అన్వేషించండి

Guppedantha Manasu January 27th Episode: నో డౌట్ రిషి వచ్చేస్తున్నాడు - శైలేంద్రని ఆడేసుకున్న మహేంద్ర!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. వసుధార శైలేంద్రను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu January 27th Episode:  (గుప్పెడంతమనసు జనవరి 27 ఎపిసోడ్)

రిషి వ‌స్తున్నాడు..మీరు కూడా కాలేజీకి వ‌స్తే మంచిద‌ని దేవ‌యానితో అంటాడు మ‌హేంద్ర‌. మీ కొడుకు చేసే దుర్మార్గాలు, అన్యాయాల‌కు మీరే ఆజ్యం పోశారు. అలాంటిది శైలేంద్ర నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డే రోజు మీరు ప‌క్క‌నుండ‌క‌పోతే ఎలా అని దేవ‌యానితో అంటాడు మ‌హేంద్ర‌. ప్రతి విషయంలోనూ పక్కనుండి ప్రోత్సహించారు కదా...ఓ తల్లి చెడుదారిలో వెళ్లమని కొడుక్కి చెబితే వాడికి ఎలాంటి శిక్ష పడుతుందో ఓ తల్లిగా మీరు చూడాలి కదా, మీ కొడుకు జైలుకి వెళుతుంటే చూడాలి కదా....మీకోసం వెయిటింగ్ రండి వదినగారు అని కాల్ కట్ చేస్తాడు.

శైలేంద్రకి పంచ్ లు
పది మందికి మంచి చేయడం తెలియదు కానీ చెడుచేయడం బాగా తెలుసుకదా, అవునూ...నువ్వు ఫారెన్లో బిజినెస్ చేశావా లేదంటే కుళ్లు కుతంత్రాలు, కుట్రలు, హత్యలు ఎలా చేయాలో ట్రైనింగ్ తీసుకున్నావా అంటి..అయినా సైలెంట్ గా ఉన్నావేంటి? మాట పెగలడం లేదా? రిషి వస్తున్నాడని తెలిసి గుండెల్లో టెన్షన్ మొదలైందా? ఇంకొన్ని క్షణాల్లో నీ ముసుగు తొలగిపోతుంది, అందరి ముందు నీ నిజస్వరూపం బయటపడుతుంది? ఈ రోజు నీ కు నా కొడుకంటే ఏంటో తెలుస్తుంది? ఊచలు లెక్కెట్టేందుకు రెడీగా ఉండు, ఇప్పటికైనా అర్థమైందా నువ్వు నా కొడుకు కాలి గోటిని కూడా టచ్ లేవని అని క్లాస్ పీకి వెళ్లిపోతాడు మహేంద్ర.

Also Read: నా కొడుకొస్తున్నాడు - దేవయానికి పెద్ద షాకిచ్చిన మహేంద్ర , శైలేంద్రలో టెన్షన్!

మినిస్టర్ ఎంట్రీ
కాలేజ్ యూత్ ఫెస్ట్ కు మినిస్టర్ వస్తాడు..అందరూ వెళ్లి స్వయంగా బొకేలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలుకుతారు. శైలేంద్ర ఏదో చికాకుగా ఉన్నట్టు కనిపించడంతో ఏం జరిగిందని మినిస్టర్ అడిగితే ఏం లేదని కవర్ చేస్తాడు
మినిస్టర్: రిషి లేకుండా ఫెస్ట్ జరుగుతోందని బాధపడ్డాను..మంచి సర్ ప్రైజ్ ఇచ్చావమ్మా వసుధారా...అసలు డీబీఎస్టీ కాలేజీ ఈ స్థాయిలో ఉందంటే కారణం రిషి..అందుకే రిషి అంటే స్టూడెంట్స్ అందరకీ నాకు చాలా ఇష్టం. తన వ్యక్తిత్వం తెలిసిన ప్రతి ఒక్కరూ రిషిని ఇష్టపడతారు...
అందరూ లోపలకు వెళతారు... ఫెస్ట్ మొదలవుతుంది....

వసుధార తండ్రికి కాల్ చేస్తుంది..బయలుదేరారా అని అడుగుతుంది. సరే నాన్న మీరు వచ్చేయండి అంటుంది. ఎందుకైనా మంచిది ఓసారి ఆలోచించమ్మా అని చక్రపాణి అంటే..మీరు కంగారు పడాల్సిందే ఏమీ లేదు నాన్నా రండి అంటుంది. మొసలికి నీళ్లలో బలం ఉన్నట్టే.. ఇక్కడ రిషి సర్ ని కొట్టేవారే లేదు. ఒకవేళ శైలేంద్ర ఏమైనా చేయాలని చూసినా..స్టూడెంట్స్ చూస్తూ ఊరుకోరు. రిషి సర్ కళ్లలో ఆనందం, స్టూడెంట్స్ కళ్లలో ఆనందం చూడాలి..ఆ శైలేంద్ర పతనానికి ఈ రోజు ముహూర్తం పెడుతున్నాను..ఈ రోజు వాడుతీసుకున్న గోతిలో వాడే పడేలా చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది...

Also Read: ఇక తేల్చేసుకుందాం అన్న వసుధార - రిషి ఎంట్రీతో శైలేంద్ర చాప్టర్ క్లోజ్!

కాలేజ్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి...

రాజీవ్ కి కాల్ చేసిన శైలేంద్ర...వాళ్లు ఎక్కడున్నారో తెలిసిందా అని అడుగుతాడు. తెలీలేదని రాజీవ్ చెప్పడంతో..మీరు కూల్ గా ఉండండి.. మీకు నేనున్నాను...ఎలాగైనా వాళ్లని పట్టుకుని అంతమొందిస్తానని హామీ ఇస్తాడు. శైలేంద్రలో టెన్షన్ మాత్రం తగ్గదు. 

మినిస్టర్ కి సన్మానం చేస్తారు... వసుధార , మినిస్టర్ స్పీచ్ లిస్తారు... కాలేజ్ గురించి, రిషి గురించి, వసుధార, ఫణీంద్ర, మహేంద్ర, జగతి గురించి పేరుపేరునా ప్రసంశిస్తాడు... తన పేరు చెప్పలేదని శైలేంద్ర కుళ్లుకుంటాడు...

నాన్న గారికి కాల్ చేసి ఎక్కడిదాకా వచ్చారో కనుక్కో అని వసుధారకు చెబుతాడు మహేంద్ర. అలాగే అని వసుధార వెళ్లిపోతుంది.

Also Read: ఈ రాశులవారిపై లక్ష్మీ అనుగ్రహం, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం- జనవరి 27 రాశిఫలాలు

భద్రకు శైలేంద్ర కాల్
భద్రకు కాల్ చేసిన శైలేంద్ర...వాడు దొరికాడా అంటాడు. లేదు సర్ వాడు అక్కడి వరకూ రాకుండా ఇక్కడే వేసేస్తాను అంటాడు. 

దేవయాని టెన్షన్
మరోవైపు ఇంట్లో దేవయాని టెన్షన్ పడుతుంటుంది. ఇంతలో ధరణి వచ్చి కాఫీ ఇస్తుంది. నేను అడిగానా అంటుంది. మీరు కంగారుగా ఉన్నారని తెచ్చాను. ఏదైనా ఉంటే నాకు చెప్పండి అత్తయ్య. నేనేమైనా సాల్వ్ చేయగలనేమో ఆలోచిస్తాను అని ధరణి అంటుంది.
దేవయాని: కాలేజీకి రిషి వస్తున్నాడట 
ధరణి: దానికి సంతోషించాలి కానీ, కంగారు ఎందుకు. మీరేమైనా తప్పు చేశారా. లేదా మా ఆయన తప్పు చేశారా. అసలు ఇన్నాళ్లు రాని రిషి ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు. నేరుగా కాలేజీకే ఎందుకు వెళ్తున్నట్లు అని ధరణి అడుగుతుంది.
దేవయాని: పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్లు వసుధారతో రిషిని తీసుకురమ్మని శైలేంద్ర ఛాలెంజ్ చేశాడట. వాడికి ఆ ఐడియా ఎలా వచ్చిందో
ధరణి: ఆ ఐడియా ఇచ్చింది నేనే అత్తయ్య. కాలేజీ సర్‌ప్రైజ్ అయ్యే ఐడియా ఇవ్వమని అడిగారు. రిషి వస్తున్నట్లు చెప్పండి. అంతా సర్‌ప్రైజ్ అవుతారని చెప్పాను. దాన్నే ఆయన ఫాలో అయ్యారు అని ధరణి అంటుంది. 
దీనంతటకి మూల కారణం నువ్వా అని దేవయాని మనసులో అనుకుంటుంది. అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి అని పాడుకుంటూ వెళ్లిపోతుంది ధరణి. దేవయాని కంగారు పడుతుంది. 
ఎపిసోడ్ ముగిసింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget