Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?

కాలేజీలో జరిగిన అవమానంతో రగిలిపోయిన సాక్షి... రిషి ఇంట్లో పంచాయితీ పెడుతుంది. తన సంగతి తేల్చాలంటూ గొడవ పెడుతుంది. రిషితో వాగ్వాదానికి దిగుతుంది.

FOLLOW US: 

కాలేజీ ఆఫీస్‌లోకి నేరుగా సాక్షి రావడంపై రిషిరి సీరియస్‌ అవుతాడు. తన పర్మిషన్ లేకుండా ఎవర్నీ లోని రానియొద్దని చెప్పేస్తాడు రిషి. సాక్షిపై సీరియస్‌ అయిన తర్వాత అక్కడి నుంచి రిషి వెళ్లిపోతాడు. 

ఇంతలో సాక్షి కూడా వెళ్తుంటే... చేయి పట్టుకొని ఆపేస్తుంది జగతి. రిషి కోపంగా ఉన్నాడని... ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దని సాక్షికి  చెబుతుంది జగతి. ఎక్కడా కలవడం లేదని ఎక్కడ కలావాలో అర్థం కావడం లేదని జగతికి చెబుతుంది సాక్షి. మీరంతా రిషిని ఎవరి కోసం సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసని అంటుంది సాక్షి.

ఇంతలో మహేంద్ర అక్కడకు వస్తాడు. రిషిని ఎవరు సపోర్ట్ చేసినా.. రిషిని వదులుకునే ప్రసక్తే లేదని చెబుతుంది. ఇవన్నీ కాలేజీలో ఎందుకని అన్నా సరే.. ఎవరు ఎన్ని చెప్పినా రిషిని కలుస్తూనే ఉంటానని చెప్పి వెళ్లిపోతుంది. 

కాలేజీ క్లాస్‌ రూమ్‌లో కూర్చున్న వసుధార... తన బుక్‌లో ఉన్న లవ్‌ లెటర్ తీసి చదువుకుంటుంది. ఇంతలో వచ్చిన రిషి బుక్ తీసుకురమ్మంటాడు. సాక్షిని చూస్తే చిరాకుగా... వసుధారను చూస్తే ఆనందంగా ఎందుకు ఉంటుందని తన మనసులో క్వశ్చన్ చేసుకుంటాడు రిషి. నువ్వు నాకో రిలీఫ్‌ జోన్‌వని అనుకుంటాడు. 

ఇంతలో కాలేజీలో జరిగిన సంఘటన గురించి దేవయానికి వివరిస్తుంది సాక్షి. చాలా అవమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన ముందే వసుధార గురించి జగతితో మాట్లాడిన సంగతి కూడా చెబుతుంది. ఎన్ని అవమానాలు జరిగితే అంత పంతం పెరుగుతుందని అంత పట్టుదల వస్తుందని హిత బోధ చేస్తుంది దేవయాని. వల విసిరి చేపలను పట్టుకుందామని.. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపిద్దామని సాక్షితో దేవయాని చెబుతుంది. 

ఇంతలో క్లాస్‌ అయిపోతుంది. అంతా వెళ్లిపోతారు. తన బుక్ తీసుకుటుంది వసుధార. ఈ లోపు అందులో ఉన్న లవ్‌ లెటర్ పడిపోతుంది. ఆది రిషి చూస్తాడు. షాక్ అవుతాడు. గతం మైండ్‌లో ఫ్లాష్ అవుతుంది. కవర్ చేసుకొని ఏంటిది అని అడుగుతాడు. ప్రేమ లేఖ నీ వద్దకు ఎలా వచ్చిందని అడుగుతాడు రిషి. జగతి మేడం మొబైల్‌  నుంచి పంపించారని.. ప్రింట్ తీసుకున్నట్టు చెప్పారు. తన రూమ్‌లో ఉన్న లెటర్‌ ఎలా వచ్చిందని ఆలోచిస్తాడు. దీంతో ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తాడు. లెటర్‌ రాసిన బొమ్మ గీసింది ఎవరో కనిపెడతానంటుంది వసుధార. స్కాలర్‌షిప్ ఎగ్జామ్ ఉందని.. ముందు చదువుపై దృష్టి పెట్టమని చెప్పి వెళ్లిపోతాడు రిషి. 

రిషి ఇంటికి వచ్చే సరికి సాక్షి వాళ్ల పేరెంట్స్ వచ్చి ఉంటారు. సమస్య బయటే ఉందని.. ఇంట్లో లేదని చెబుతుంది సాక్షి. పదిసార్లు మీటింగ్స్ పెట్టి చర్చించాల్సిన అవసరం లేదంటుంది. పరిష్కారం కూడా మీ చేతిలో లేదని... నాకు రిషికి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్‌ మాత్రమేనని అంటుంది. ఆ రోజు రిషిని కాదని నేను వెళ్లిపోయానని.. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ రిషి ప్రయార్టీలు మారిపోయాయని అంటోంది సాక్షి. రిషి కూడా మారిపోయాడంటుంది. అందరూ ఉన్నారని నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దని రిషి వార్నింగ్ ఇస్తాడు. ఎవరిని ఎవరూ విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఇంటికి వచ్చారని గౌరవంతో ఊరుకుంటున్నాని అంటాడు. ఇక్కడెవరూ మారిపోలేదంటాడు. అనవసరంగా టాపిక్ పెంచొద్దంటాడు. ఇంతలో ఫణీంద్ర కలుగుజేసుకుంటాడు. అందరి ముందు ఏంటిదని అడుగుతున్నానని కవర్ చేస్తాడు రిషి. మన విషయం మాట్లాడటానికే పెద్దలు వచ్చారని అంటుంది సాక్షి. మన విషయంలో మాట్లాడటానికి ఏముందని ప్రశ్నిస్తాడు రిషి. దాన్ని అందుకున్న సాక్షి.... రిషి కావాలని లండన్ నుంచి నేను వస్తే.. చీపురు పిల్లలా తీసేస్తున్నాడని ఆవేదనతో చెబుతుంది. నీ మనసులో ఏముందో చెప్పు రిషీ అని నిలదీస్తుంది. నా మనసులో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం నీకేముందని ప్రశ్నిస్తాడు రిషి. అప్పడు ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత వెళ్లిపోయి తప్పుదారి పట్టించావని... ఇప్పుడు వచ్చి మారిపోయానంటూ చెబుతున్నావని అంటాడు. అలా వస్తే మొత్తం మారిపోవాలా అని ప్రశ్నిస్తుంది సాక్షి. మాట్లాడటానికి కూడా టైం ఇవ్వడం లేదని అంటుంది. నేను బిజీగా ఉంటాని.. అందుకే మాట్లాడటం లేదని చెప్తాడు రిషి. ఎవరెవరికో టైం ఇస్తావని... వసుధార విషయాన్ని ప్రస్తావన తీసుకొస్తుంది.  

రేపటి ఎపిసోడ్
వసుధార కోసం పరితపిస్తున్నావని... ఆమెను ప్రేమిస్తున్నావని అంటుంది సాక్షి. షట్‌ అప్‌ అంటాడు రిషి. వాళ్లిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు చూపిస్తుంది సాక్షి. ఇంతలో సార్ అంటూ వసుధార వస్తుంది. ఈమె ఎందుకు వచ్చిందని రిషి అనుకుంటాడు...   

Published at : 17 May 2022 07:25 AM (IST) Tags: Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Guppedantha Manasu Today Episode Guppedantha Manasu 17th May Episode 452

సంబంధిత కథనాలు

Regina Cassandra: 2019 కులు మనాలి రూమ్‌లో ఒకటి జరిగింది, అతడిని మిస్సవుతున్నా - ఆలీతో రెజీనా

Regina Cassandra: 2019 కులు మనాలి రూమ్‌లో ఒకటి జరిగింది, అతడిని మిస్సవుతున్నా - ఆలీతో రెజీనా

Devatha జులై 5 ఎపిసోడ్: దేవుడమ్మకి రుక్మిణి వాయనం, రుక్మిణి ఫోన్ ట్యాప్ చేసిన మాధవ

Devatha జులై 5 ఎపిసోడ్: దేవుడమ్మకి రుక్మిణి  వాయనం, రుక్మిణి  ఫోన్ ట్యాప్  చేసిన మాధవ

Janaki Kalaganaledu జులై 5 ఎపిసోడ్: గోవిందరాజుల పరిస్థితి విషమం, ఆందోళనలో జ్ఞానంబ- జానకిని ఇరికించిన మల్లిక

Janaki Kalaganaledu జులై 5 ఎపిసోడ్: గోవిందరాజుల పరిస్థితి విషమం, ఆందోళనలో జ్ఞానంబ- జానకిని ఇరికించిన మల్లిక

Guppedantha Manasu జులై 5 ఎపిసోడ్: ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్ - రిషిని రెస్టారెంట్ కి రమ్మన్న వసు, సాక్షితో కలసి వెళ్లి షాకిచ్చిన ఈగో మాస్టర్

Guppedantha Manasu జులై 5 ఎపిసోడ్:  ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్ - రిషిని రెస్టారెంట్ కి రమ్మన్న వసు, సాక్షితో కలసి వెళ్లి షాకిచ్చిన ఈగో మాస్టర్

Gruhalakshmi జులై 5 ఎపిసోడ్: విషం తాగబోయిన లాస్య, కరిగిపోయిన నందు, సంబరంలో తులసి

Gruhalakshmi  జులై 5 ఎపిసోడ్: విషం తాగబోయిన లాస్య, కరిగిపోయిన నందు, సంబరంలో తులసి

టాప్ స్టోరీస్

Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు

Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు

Twitter Moves Court : ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !

Twitter Moves Court :  ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !

IND vs ENG 5th Test: బాజ్‌ బాలా? అదేంటో తెలియదంటున్న రాహుల్‌ ద్రవిడ్‌

IND vs ENG 5th Test: బాజ్‌ బాలా? అదేంటో తెలియదంటున్న రాహుల్‌ ద్రవిడ్‌

Shaitan Web Series: ఓటీటీ కోసం 'యాత్ర' దర్శకుడి వెబ్ సిరీస్ - 'సైతాన్'

Shaitan Web Series: ఓటీటీ కోసం 'యాత్ర' దర్శకుడి వెబ్ సిరీస్ - 'సైతాన్'