By: ABP Desam | Updated at : 14 May 2022 07:38 AM (IST)
Guppedantha Manasu 14th May 450(Image Credit: Star Maa/Hot Star)
బొమ్మ తెచ్చిన బాబు ఇక్కడే ఉన్నాడని... అడుగుదామని వసుధార పిలుస్తానంటుంది. పక్కనే రిషి ఉంటాడు. వీడు వచ్చాడంటే కొంపముంచుతాడని అనుకొని వసుధారను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అయినా వసుధార ఆగదు.. వెళ్లి అడుగుతుంది. ఇంతలో రిషిని చూసి విష్ చేస్తాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడిని ఏదో చేసి పంపించేయాలని విఫలయత్నం చేస్తాడు. ఇంతలో వసుధార ఆ బొమ్మ ఇచ్చిన వ్యక్తి గురించి అడుగుతుంది. వాడు చెప్పే లోపు వసుధారను ఏదోలా చేసి రిషి పంపించేస్తాడు. ఆమె వచ్చే లోపు ఆ పిల్లాడిని పంపించేస్తాడు.
జగతి రూమ్‌కి సాక్షి వస్తుంది. రిషిని కలుద్దామని వచ్చానని చెబుతుంది. అంతకు ముందు మిమ్మల్ని కలుద్దామని వచ్చానని చెప్తుంది. బాగానే అర్థం చేసుకున్నావని జగతి రిప్లై చేస్తుంది. అంతే అంటీ.. నేను అందర్నీ అర్థం చేసుకుంటాను కానీ... నన్నే ఎవరూ అర్థం చేసుకోవడం లేదంటుంది సాక్షి. మనల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదంటే ఎదుటి వాళ్ల లోపం కంటే మనలో ఏదో లోపం ఉందని క్లాస్ తీసుకుంటుంది జగతి.
మహేంద్రను మా పేరెంట్స్ కలుద్దామని అనుకుంటున్నారని... ఆ విషయాన్ని ఆయనతో చెప్పాలని రిక్వస్ట్ చేస్తుంది సాక్షి. నేను చెప్తే ఓ రకంగా ఉంటుంది.. ఇలాంటివి నేరుగా వ్యక్తికి చెబితే బాగుంటుందని జగతి స్ట్రైట్‌గా చెప్పేస్తుంది. రిషి గురించి అడుగుతుంది సాక్షి. రిషి చిన్నపిల్లాడు కాదని.. కాలేజీ ఎండీ అని... తనకు ఎన్నో పనులు ఉంటాయని అలసిపోయిం ఉంటాడని అందుకే ఈ టైంలో వచ్చి కలవడం బాగోదని చెప్తుంది జగతి. పొద్దున వచ్చి కలిస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది జగతి. మరి పొద్దున్న వచ్చాక కలకపోతే ఏం చేయాలని అడుగుతుంది సాక్షి. రావడం మానేయాలని సూటిగా చెప్పేస్తుంది జగతి. ఆ మాటతో సైలెంట్‌గా వెళ్లిపోతుంది సాక్షి.
రిషి... కారులో కూర్చొని వసుధార, బొమ్మ గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో పువ్వులు అమ్మే వ్యక్తి వచ్చి పువ్వులు కొనమంటుంది. పెళ్లి కాకుంటే మనసులో ఉన్న వ్యక్తికి ఇవ్వండని సలహా ఇవ్వండి. మాటల్లో చెప్పలేనివి ఈ పువ్వులు చెప్తాయని వివరిస్తుంది. బేరాల్లేవని చెప్తే డబ్బులు ఇవ్వబోతాడు రిషి. పువ్వులు తీసుకుంటేనే డబ్బులు తీసుకుంటానని చెప్పేస్తుంది. మంచే జరుగుతుందని దీవించి వెళ్లిపోతుందామె.
బొమ్మ గురించి ఆలోచిస్తూ.. రిషి సార్‌కి సంబంధం ఉందా లేదని ఆలోచిస్తుంది. అక్కడే ఉన్న రిషి నాకేం సంబంధం లేదు అంటాడు. ఈ బొమ్మ తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టు తిరగడం ఏంటని అంటాడు రిషి. ఇప్పటి జనాలు చిన్న పని చేసి థాంక్స్ కోసం ఎదురు చూస్తారని.. ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడంలో తప్పేమీ లేదని చెప్తుంది. మరోసారి బొమ్మ చూపించి ఎంత బాగా గీశారో అంటుంది వసుధార. అందులో ఏముందని ప్రశ్నిస్తాడు రిషి. అందులో మనసు ఉందని చెప్తుంది వసుధార. ఓ పేపర్, ఓ పెన్సిల్ నాలుగు గీతలే అంటాడు రిషి. ఫొటో చూస్తూ కూడా ఇంత కరెక్ట్‌గా గీయలేరు కదా అంటుంది వసుధార. ఈ బొమ్మ గీసిన వ్యక్తి ఎదురు పడితే ఏం చేస్తావు అని అడుగుతాడు. రిషిని గట్టిగా హగ్ చేసుకుంటుంది.
థాంక్యూ సార్..నన్ను చూడకుండానే ఇంత బాగా గీశారు. అని చెప్తానని చెబుతుంది వసుధార. ఆ బొమ్మ గీసింది నేనే అయితే అంటాడు రిషి. గట్టిగా నవ్వి.. మీరు అమ్మాయిల బొమ్మలు గీయడం అని అనేస్తుంది. మీరు బొమ్మ గీయడమేంటని అడుగుతుంది. అమ్మాయిలతో మాట్లాడని వాళ్లు బొమ్మలు ఎలా గీస్తారని ప్రశ్నిస్తుంది. నాతోనే ఇంత ఎక్కువగా మాట్లాడతారు... వేరే వాళ్లతో ఎందుకు మాట్లాడరని అడుగుతుంది వసుధార. నీవు చాలా స్పెషల్ అని చెప్తాడు రిషి. ఏంటీ ఇంకా బొమ్మ గురించే ఆలోచిస్తున్నావని మళ్లీ చిరాకు పడతాడు. ఇది ఆర్ట్ కాదు హార్ట్ అంటుంంది వసుధార. అంటే నాకు హార్ట్ లేదటండావా అంటాడు రిషి. అలాని కాదు సార్.. ఇలాంటి బొమ్మలు వేయాలంటే పూర్వజన్మలో ఏదో మంచి చేసి ఉండాలని కవర్ చేస్తుంది.
రేపటి ఎపిసోడ్
రిషి కారులో వెళ్తున్న వసుధార.. మల్లి పూల ఉన్న సంగతి గుర్తు పడుతుంది. కారు దిగుతూ ఆ పువ్వులు తీసుకుంటానని చెబుతుంది. ఆ పెద్దావిడ చెప్పినట్టు ఎవరికి చేరాలో వాళ్లకే చేరాయని షాక్ అవుతాడు రిషి.
Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్
Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?
Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి
Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య
Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి
Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు