అన్వేషించండి

Guppedantha Manasu మే 13 ఎపిసోడ్: బొమ్మ గీసింది రిషి అని వసుధారకు తెలిసిపోయిందా? లేకుంటే స్పెషల్ థాంక్స్‌ ఎందుకు చెప్పినట్టు?

బొమ్మ చుట్టూ వసుధార... వసుధార చుట్టూ రిషి తిరుగుతున్నారు.

రిషి గీసిన బొమ్మ, లవ్‌లెటర్ పట్టుకొని ఆలోచిస్తుంటుంది వసుధార. ఈ రెండింటికీ లింక్‌ ఉందా.... ఇది ఇద్దరు రాసిందా.. లేకుంటే.. ఒకరే రాసిందా అంటూ ఆలోచిస్తుంది. మేడం చించేసిన లెటర్‌ మళ్లీ మేడం దగ్గరకు ఎలా వచ్చిందో అని ఆలోచిస్తోంది. బాగా తెలిసిన వాళ్ల హ్యాండ్‌ రైటింగ్‌లా ఉందనిపిస్తోందే అంటుంది. ఇది రిషి సార్ రైటింగ్‌లా ఉందని అనుకుంటుంది. అంతలోనే రిషి సార్‌ ఎందుకు రాస్తారని సర్ధిచెప్పుకుటుంది. ఈ లెటర్‌ చూస్తుంటే నాకు రిషి సార్ ఎందుకు గుర్తుకు వస్తున్నారు అని ప్రశ్నించుకుంటుంది. మనసులో ఎవరైనా ఉన్నారా అని గౌతమ్‌  అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోయాను... ఇప్పుడు నాకు నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని అనుకుంటుంది. రిషి సార్‌లో చాలా మార్పు వచ్చిందని... ఎప్పుడూ కోపగించుకునే ఆయన ఈ మధ్య నెమ్మదిగా మాట్లాడుతున్నారని గుర్తు చేసుకుంటుంది. రిషి సార్‌తో ఉంటే నాకేదో ధైర్యం పెరిగినట్టుగా అనిపిస్తోందని అనుకుంటుంది. రిషి సార్‌కు నాపై ఎందుకు ఈ బాధ్యత.. ఇది కేవలం బాధ్యతా లేకా ఏదో తెలియని బంధం ఉందా అని అనుకుంటుంది. ఇంతలో బస్తీ కుర్రాడు వచ్చి వసుధార బొమ్మ తీసుకెళ్లి బస్తీ పిల్లలకు చూపిస్తుంటాడు. వాళ్ల వెంట వసుధార పరుగెత్తి బొమ్మ కోసం అడుగుతుంది. ఇంతలో రిషి వస్తాడు. అక్కడ జరిగేది చూస్తుంటాడు. ఇద్దర పిల్లలు పోట్లాడుకొని బొమ్మను చించేస్తారు. దాన్ని చూసి రిషి, వసుధార ఇద్దరూ బాధపడతారు. 

కారు దిగి రిషి వచ్చేసరికి వసుధార ఏడుస్తుంటుంది. ఇంత మంచి స్కెచ్ ఎంత కష్టపడి గీశారో అనుకుంటుంది. వాళ్ల కళ్లకు హ్యాట్సాఫ్ అని చెబుతుంది. ఈ బొమ్మకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానని.. చాలా బాధగా ఉందని అంటుంది. ఎవరో వేసిన బొమ్మకు ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావని రిషి ప్రశ్నిస్తాడు. ఎందుకో తెలియదు కానీ.. ఆ వ్యక్తిపై తెలియని గౌరవం ఏర్పడిందని చెబుతుంది. 

తన రూమ్‌కి వచ్చి మళ్లీ వసుధార బొమ్మ గీయడానికి ట్రై చేస్తుంటాడు రిషి. తన రూమ్‌లో చినిగిపోయిన బొమ్మను అతికించుకునే పనిలో పడింది వసుధార.  మనసుతో గీసిన బొమ్మను అనవసరంగా చించేశారనుకుంటుంది. 

నీ కళ్లు నా కళ్లల్లో ప్రింట్ అయ్యాయని... నా మనసులో ఎప్పుడో ముద్రించుకుపోయాయని... మళ్లీ అంత అందంగా గీయగలనని రిషి అనుకుంటాడు. ఇంతలో సాక్షి మళ్లీ మైండ్‌లోకి వస్తుంది. సాక్షి వెళ్లిపోయిన ఇన్నేళ్లలో ఒక్కసారి ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించాడు. వసుధారను నిత్యం ఎందుకు తలచుకుంటున్నాను అని ప్రశ్నించుకుంటాడు. వీళ్లిద్దరి మధ్య ఎందుకీ తేడా తెలుసుకోవాలని అనుకుంటాడు రిషి. 

తను గీసిన బొమ్మ పట్టుకొని రిషి రెస్టారెంట్‌కు వస్తాడు. ఓ పిల్లాడిని పిలిచి తను గీసిన బొమ్మను వసుధారకు ఇమ్మని చెబుతాడు. ఆ పిల్లాడు తీసుకెళ్లి వసుధారకు ఆ స్కెచ్ ఇస్తాడు. ఆ బొమ్మ చూసి ఆశ్చర్యపోతుంది వసుధార. 

కాస్త లేట్‌గా రిషి వచ్చిన సంగతి గుర్తిస్తుంది వసుధార. తన స్కెచ్‌ మళ్లీ వచ్చేసిందని... ఎవరో నా బొమ్మ గీశారని... చాలా బాగుందని మురిసిపోతుంది. ఎవరు గీశారని అడుగుతాడు రిషి. ఏమో సార్ నాకు తెలియదని అంటుంది. బొమ్మ గీసిన వాళ్లను పొగిడేస్తుంది. కనిపిస్తే థాంక్స్‌ చెప్పాలంటుంది వసుధార. స్పెషల్ థాంక్సా అంటూ క్వశ్చన్ చేస్తాడు రిషి. అలాంటిదేమీ లేదంటుంది. ఈ బొమ్మ గీసిన వ్యక్తి ఎవరో అని నేనెందుకు టెన్షన్ పడాలని... తెచ్చిన ఇచ్చిన పిల్లాడిని అడిగితే చెప్పేస్తాడు కదా ఆనుకుంటుంది. రిషిలో టెన్షన్ మొదలవుతుంది. 

రేపటి ఎపిసోడ్.. 
బొమ్మ గీసిన వ్యక్తి గురించి ఆ పిల్లాడు కూడా చెప్పడు. ఎవరు గీసి ఉంటారా అని వసుధార మైండ్‌లో ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. బొమ్మ గీసింది నేనే అయితే అంటూ రిషి క్వశ్చన చెస్తాడు. వెంటనే కౌగిలించుకుంటుంది వసుధార.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget