అన్వేషించండి

Guppedantha Manasu June 8th (ఈరోజు) ఎపిసోడ్: వసుధారను దేవయాని గెంటేస్తే, సాక్షిని జగతి గెంటేస్తుంది- బోత్‌ ఆర్‌ నాట్ సేమ్‌- వీడియో కాల్‌ చేసిన వసుధారతో రిషి మాట్లాడతాడా?

ఇంటి బయట ఉన్న వసుధారను గౌతమ్ వచ్చి కలుస్తాడు. రిషికి నో చెప్పాక ఫీల్ అవుతున్నావు కదా అంటాడు. లేకుంటే నీలో ఇంత బాధ ఎందుకు ఉందని ప్రశ్నిస్తాడు.

రిషి ఆరోగ్యం బాగుండాలని దారిలో కనిపించిన ఓ దేవతను మొక్కుకుంటుంది వసుధార. నేను రిషి సార్‌ను కాదని చెప్పి మంచి చేశానో చెడు చేశానో పెద్దమనసులో మన్నించు పెద్దమ్మ. రిషి సార్ ప్రేమను కాదన్నానేమో కానీ అతనిపై గౌరవాన్ని కాదనలేదు కదా. యాక్సిడెంట్‌ అయి ఆయన ఇప్పుడు మంచంపై ఉన్నారు. ఆయన చూసే వీలు నాకు లేకపోయింది. పెద్ద పెద్ద కన్నులతో నీవు చూస్తున్నావ్ కదా... రిషి సార్‌కు ఏం కాకూడదు.. తొందరగా కోలుకోవాలి. నువ్వే చూసుకోవాలి.. తొందరగా బాగవ్వాలి. అంటూ అక్కడ దీపం వెలిగించి దండం పెట్టుకుంటుంది వసు. అక్కడ పూజలు చేస్తుంది. రిషి సార్‌ బాగండాలని కోరుకోవడానికి మించిన వరం ఇంకా ఏమి ఉంటుందని అంటుంది.  పూజ చేసిన తర్వాత కుంకుమ తీసుకుంటుంది. నీ ఆశీస్సులు తీసుకువెళ్తున్నాను. రిషి సార్ తొందరగా కోలుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

పూజ చేసిన తెచ్చిన కుంకుమ తీసుకొచ్చి రిషికి ఇద్దామనుకుంటుంది. ఇంట్లోకి వస్తున్న వసుధారను దేవయాని మరోసారి అడ్డుకుటుంది. మళ్లీ ఎందుక వచ్చావు అని అడుగుతుంది. ఒక్కసారి చెబితే అర్థం కాదా. లేకా నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేనా అంటుంది. ఒక్కసారి రిషి సార్ ను చూసి వెళ్తానని రిక్వస్ట్ చేస్తుంది వసుధార. రిషిని చూడటానికి నీకు ఉన్న అర్హత ఏంటి? అని ప్రశ్నిస్తుంది దేవయాని. అసలు నీవు ఈ ఇంటికి ఎందుకు రావాలని నిలదీస్తుంది. ఏదో తీసుకొచ్చావ్ అయిపోయింది. నాకు కోపం తెప్పించకు వసుధార... రాజులా ఉండే రిషి నీ మాయలో పడే ఇలా అయిపోయాడు. రిషి బాధకు నీవు కారణం కాదా అని అడుగుతుంది. మేడం మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. అవన్నీ తర్వాత రిషి సార్‌ను దూరం చూసి వెళ్లిపోతాను అని వసుధార ప్రాధేయపడుతుంది. అవసరం లేదని అరుస్తుంది దేవయాని. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఎప్పుడో కోల్పోయావ్ అంటుంది. చేతిలో ఏంటీ.. ఏదైతే నాకేంటిలే కానీ.. బయల్దేరు నువ్వు కసురుకొని పంపించేస్తుంది. 

ఆ సీన్‌ గౌతమ్ ధరణి చూస్తారే కానీ... ఎవరూ హెల్ప్ చేయరు. దేవయాని కూడా అదే చెబుతుంది. హెల్ప్ చేయ్యనివ్వను కూడా అంటుంది. ఒకప్పుడు బాగా ఎగిరెగిరి పడేదానివి కదా... మాటకు మాట సమాధానం చెప్పేదానివి కదా.. ఆ దూకుడు ఆ మాటల చాతుర్యం ఇప్పుడు ఏమైందో అని ప్రశ్నిస్తుంది. మేడం మీకు దండం పెడతాను... ఒక్కసారి లోపలికి వెళ్లనివ్వండి మేడం అని ప్రాధేయపడుతుంది. కుదరదు అని చెప్పాను కదా అని మరోసారి అరుస్తుంది. వసుధార నీకు ఇంతకు ముందే చెప్పాను. రిషిని తీసుకొచ్చినప్పుడే చెప్పాను వినలేదు.. బుద్దిగా వినకపోతే... మెడపట్టి గెంటించుకునే వరకు తెచ్చుకోకు. రిషి సార్‌ను చూసి వెళ్లిపోతానంటుంది. రిషి సార్ రిషి సార్‌ ఏంటీ నీ గోల అని అడుగుతుంది. అక్కడే ఉన్న ధరణిని పిలిచి వసుధారను గేటు బయటకు గెంటేసిరా అని ఆర్డర్‌ వేస్తుంది దేవయాని. ఆమె వచ్చి వసుధార వెళ్లిపో అంటుంది. ఇంతలో సాక్షి వస్తుంది. ఆమెతో గెంటిద్దామనుకుంటుంది. అక్కర్లేదు ధరణి. వసుధారను గెంటేయడనికి సాక్షి వచ్చింది అంటుంది. ఇంతలో వసుధారే వెనక్కి తగ్గి వెళ్లిపోతుంది.

వసుధారకు ఎదురు పడుతుంది సాక్షి. వేటకారపు నవ్వుతో చూసి వెళ్లిపోతుంది. దేవయాని రా అని సాక్షిని లోపలికి తీసుకెళ్తుంది. 

బెడ్‌పై గాయంతో పడుకొని ఉన్న రిషికి వసుధార గుర్తుకు వస్తుంది. ఆమె వెంట పడుతున్నట్టు కల వస్తుంది. ఆమె వెళ్లిపోతున్నట్టు కనిపిస్తుంది. వసుధార అని పిలుస్తూ అంటూ కలవరిస్తాడు. వసుధారా అని పిలుస్తూ ఒక్కసారిగా లేస్తాడు. బయటకు వెళ్తున్న వసుధారకి కూడా రిషి సార్ పిలిచినట్టు అనిపించిందే అంటుంది.  చుట్టూ చూస్తుంది ఎవరూ కనిపించరు. 

ఇక్కడ బెడ్‌పై నుంచి లేవడానికి ట్రై చేస్తాడు రిషి. కిందపడబోతుంటాడు... సాక్షి వచ్చి పట్టుకోబోతుంది. డోన్ట్‌ టచ్‌మీ అంటాడు. పడబోతుంటే పట్టుకోబోయానుంటుంది సాక్షి. నేను పడిపోయినా ఫర్వాలేదు కానీ నువ్వు మాత్రం పట్టుకోవద్దని అంటాడు. అసలు నీవెందుకు వచ్చావని అడుగుతాడు. ఏంటీ రిషి యాక్సిడెంట్ అయిందని చూడటానికి వచ్చిన నన్ను ఎందుకు పరాయిదానిలా చూస్తున్నావ్‌... నువ్వు ఎందుకిలా మారిపోయావ్‌ అంటుంది సాక్షి. నా దృష్టిలో నువ్వు ఏమిటో ఇంతకు ముందే చెప్పాను అంటాడు. 

రిషి రూమ్‌ బయట ఉన్న మహేంద్ర జగతి ఈ వాదన చూసి పరుగెత్తుకొని వస్తారు. సాక్షిని జగతి బయటకు పంపించేస్తుంది. రిషి పరిస్థితి బాగాలేదని వెళ్లిపోమంటుంది. తనకు రెస్ట్ కావాలని అంటుంది జగతి. నాకు సమాధానం కావాలని అడుగుతుంది సాక్షి. ప్రశ్నలు వేయడానికి ఇది సమయం కాదు సాక్షి అంటుంది జగతి. తనకు ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం కావాలి... ఈ టైంలో వచ్చి నా కొడుకును డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకోను అంటు హెచ్చరిస్తుంది. మహేంద్ర కూడా అదే చెప్తాడు. మర్యాదగా చెప్తే విననప్పుడు నీ భాషలోనే చెప్తానంటూ సాక్షిని లాక్కొని వెళ్లిపోతుంది జగతి. 

రిషి పక్కనే కూర్చొని మహేంద్ర తలనొప్పిగా ఉందా అని అడుగుతాడు. అసలు ఏం జరిగింది డాడ్. నాకు ఏమీ గుర్తు లేదని అంటాడు రిషి. జరిగింది వివరిస్తాడు మహేంద్ర. డాడ్‌ నన్ను ఇంటికి ఎవరు తీసుకొచ్చారని ప్రశ్నిస్తాడు రిషి. మహేంద్ర సైలెంట్‌ అయిపోతాడు. అప్పుడే అక్కడ పడి ఉన్న వసుధార చున్నీ చూస్తాడు రిషి. వసుధార కదూ అని అడుగుతాడు రిషి. ఏంటి నాన్న... నడుచుకుంటూ వెళ్లడమేంటీ.. యాక్సిడెంట్ చేసుకోవడం ఏంటీ అని ప్రశ్నిస్తాడు మహేంద్ర. ఇంతలో రిషి లేస్తుంటాడు.. సాయం చేయబోతుంటే... డాడ్‌ ఒంటరిగా వదిలేయండని రిక్వస్ట్ చేస్తాడు రిషి. అసలే వీడి మనసలు బాగాలేదంటే ఈ యాక్సిడెంట్ ఏంటో అనకుంటాడు మహేంద్ర. 

రిషి కారిడార్‌లో తీరుగుతూ నన్ను వసుధార కాపాడిందా అని అనుకుంటాడు.  ఇంటికి తీసుకొచ్చిందా... అని బయటకు చూస్తే అక్కడే వసుధార నిల్చొని చూస్తుంటుంది. అయితే అది భ్రమ అనుకుంటాడు. ఇంటి బయట ఉన్న వసుధార.. ఎలాగైనా రిషి సార్‌ను కలవాలని అనుకుంటుంది. ఎలాగైనా రిషి సార్‌ను కలవాను అనుకుటుంది. ఎవరు ఎన్ని తిట్టినా భరిస్తానుంటూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లిపోయిన రిషి ఆమె చున్నీ చూస్తూ కూర్చుండిపోతాడు. 

రేపటి భాగం
ఇంటి బయట ఉన్న వసుధారను గౌతమ్ వచ్చి కలుస్తాడు. రిషికి నో చెప్పాక ఫీల్ అవుతున్నావు కదా అంటాడు. లేకుంటే నీలో ఇంత బాధ ఎందుకు ఉందని ప్రశ్నిస్తాడు.
 మహేంద్రకు వీడియో కాల్ చేసి రిషీ సార్ ఎలా ఉన్నారని ఆరా తీస్తుంది వసుధార. పక్కనే పడుకొని ఉన్న రిషిని చూపిస్తాడు మహేంద్ర. చూసి ఏడుస్తుంది. ఇంతలో రిషి లేచి ఫోన్‌లో ఎవరు డాడ్ అని అడుగుతాడు. వసుధార అని చెప్తాడు. మాట్లాడతావా అని అడుగుతాడు. రిషి సైలెంట్ అయిపోతాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget