Guppedanta Manasu Serial Today March 29th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: మనును మళ్లీ ఆఫీసుకు రమ్మన్న వసు, తండ్రి కోసమే మను, అనుపమల గొడవన్న దేవయాని
Guppedanta Manasu Today Episode: మనును మళ్లీ ఆఫీసుకు రమ్మని వసు పిలవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ మరింత ఆసక్తిగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: అందరం కలిసి భోజనం చేద్దామని మహేంద్ర పిలవగానే అనుపమ తనకు ఆకలిగా లేదని మీరు వెళ్లండని చెప్తుంది. దీంతో మను నేను ఇక్కడ ఉంటే మేడంకు ఆకలి వేయదు. నేను వెళ్లిపోతాను. అంటాడు. దీంతో మహేంద్ర సీరియస్‌గా అను వెళదాం పద ఆకలిగా ఉంది తిందాం అంటాడు. అను పలకదు. దీంతో వసు మౌనం అంగీకారం మామయ్య.. మనం వెళ్లి భోజనానికి రెడీ చేద్దాం అని అందరూ వెళ్లిపోతారు. తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. ఎంజేల్ ప్లాన్ ప్రకారం మనును అనుపమ పక్కన కూర్చోబెడుతుంది.
వసుధార: మను ఈ కర్రీ మేడంకు వడ్డించు..
మహేంద్ర: అనుపమ అలాగే ఉంటావేంటి? తిను..
ఎంజేల్: అత్తయ్యా కర్రీస్ చాలా బాగా ఉన్నాయి కదా.. బాగున్నా ఇప్పుడు మీరేం చెప్పలేరులే కానీ తినండి. అవును మను నీ ఫేవరెట్ కర్రీస్ ఏంటి?
వసు: లాస్ట్ టైం ఏదో చెప్పారు.
మహేంద్ర: అవునమ్మా ఏదో చెప్పాడు.
అను: గుత్తి వంకాయ, పప్పు చారు, ఆలూ ఫ్రై
ఎంజేల్: నీకెలా తెలుసు అత్తయ్యా..
అను: లాస్ట్ టైం వచ్చాడు కదా అప్పుడు చెప్పాడు.
మహేంద్ర: లాస్ట్ టైం మను చెప్పక ముందే నువ్వే చెప్పావు.
ఎంజేల్: సరే మరి నీ ఫేవరెట్ కర్రీస్ ఎంటి అత్తయ్యా..
మను: కాకరకాయ ఫ్రై, బీరకాయ పప్పుచారు, వీటితో పాటు అప్పడాలు.
అనగానే వావ్ చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు.. ఎంతైనా అమ్మవి కదా ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు అంటుంది ఏంజేల్. దీంతో మహేంద్ర కొంతమందికి ఎంతమంది ఉన్నా ఒంటరిగానే ఉంటారు. కొంతమంది ఎవరూ లేకుండానే ఒంటరిగా ఉంటారు అంటాడు. ఇంతలో ఎంజేల్ అందరం కలిసి సెల్ఫీ దిగుతాం అంటుంది. అను వద్దంటుంది. అందరూ దిగుదాం అనడంతో అనుపమ ఏమనదు. ఎంజేల్ సెల్ఫీ తీసుకుంటుంది. తర్వాత అందరూ హాల్‌లో కూర్చుని ఉంటారు.
మహేంద్ర: ఎంటి మను కూర్చో
మను: సార్ ఇక వెళ్తాను.
మహేంద్ర: ఏంటి మను ఎలా ఉన్నాయి భోజనాలు. కడుపునిండా తిన్నారా?
ఎంజేల్: మీరు మొహమాట పడకుండా తిన్నారు కదా.. మీకు ఆ సెల్ఫీ ఫార్వార్డ్ చేస్తాను.
అనగానే మను ఇక వెళ్తాను అనగానే మహేంద్ర ఇక్కడే ఉండి రేపు వెళ్లొచ్చు కదా మను అంటే లేదు సార్ వెళ్లాల్సిందే అంటాడు. దీంతో సరే వెళ్తే వెళ్లు కానీ నువ్వు ఇక్కడికి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావొచ్చు.. ఎవరో ఏదో అనకుంటారని రావడం మాత్రం మర్చిపోవద్దు అని మహేంద్ర చెప్పగానే మను వెళ్లిపోతాడు. మహేంద్ర, అనుపమ, ఎంజేల్ లోపలికి వెళ్లిపోతారు. మను మళ్లీ తిరిగివస్తాడు.
మను: మేడం మీరు నాతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు. ఎంటి మేడం ఇప్పుడు కూడా మళ్లీ మాట్లాడాల్సిన అవసరం లేదని డిసైడ్ అయ్యారా?
వసు: లేదు నేను ఇప్పుడు కచ్చితంగా మాట్లాడాల్సిందే?
మను: ఏంటి మేడం అది
వసు: అదే మొన్న కాలేజీ గొడవలో మీది ఏ తప్పూ లేదని మా అందరికీ తెలిసింది కదా! మీరు ఇక కాలేజీకి రావొచ్చు.
మను: అదేంటి మేడం గెంటేయడం మీ వంతే.. మళ్లీ రమ్మనడం మీ వంతేనా.. సరే మీ కాలేజీ కాబట్టి వెళ్లిపోమనగానే వెళ్లిపోయాను. కానీ అంత జరిగిన తర్వాత మళ్లీ ఎలా రాగలను మేడం.
వసు: ఏంటండి ఇగో అడ్డొస్తుందా?
అనగానే నేను మళ్లీ వచ్చినా మీరు అపార్థం చేసుకోరని గ్యారంటీ ఉందా అని మను అడుగుతాడు. తనను కాలేజీ నుంచి వెళ్లిపోమ్మని చెప్పింది అనుపమ మేడం అనగానే.. మేడంను ఒప్పిస్తే తిరిగి వస్తారా? అని వసు అడుగుతుంది. దీంతో రాలేనని చెప్పి మను వెళ్లిపోతాడు. మరోవైపు దేవయాని, శైలేంద్ర ఇద్దరూ కలిసి అనుపమ, మనుల గురించి అలోచిస్తుంటారు. వాళ్లిద్దరి మధ్య గొడవ మను తండ్రి గురించి ఉండొచ్చని దేవయాని అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా?