అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 28th:శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేందుకు నిషిక ప్లాన్‌..మళ్లీ ఇంటికి వచ్చిన పాపారాయుడు

Jagadhatri Serial Today Episode July 28th: శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేందుకు నిషిక ప్లాన్‌..మళ్లీ ఇంటికి వచ్చిన పాపారాయుడు

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించడానికి ప్లాన్ చేసిన నిషిక, యువరాజు...పాపారాయుడికి ఫోన్ చేస్తారు.నేను ఆ పనిమీదే మీ ఇంటికి వస్తున్నానని..ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకోమని చెబుతాడు. దీంతో ఆదిలక్ష్మీ మెట్లు ఎక్కుతుంటే నిషిక వెనక నుంచి గట్టిగా నెడుతుంది.ఆమె గోడకు తగిలి దెబ్బతగిలించుకోవడంతో వెంటనే కేదార్‌, జగధాత్రిని ఇచ్చి ఆస్పత్రికి పంపుతారు. కౌషికి,సుధాకర్ ఆఫీసుకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో పాపారాయుడు వచ్చి శ్రీవల్లిని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఆమె అతని చేయి కొరికి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. నిషిక వాళ్లు ఏదో ప్లాన్ చేస్తున్నారని జగధాత్రికి అనుమానం వస్తుంది.
కుళ్లుకున్న నిషిక,  వైజయంతి
                               సుధాకర్‌, జగధాత్రి, కేదార్‌, శ్రీవల్లి కలిసి ఆనందంగా చెస్‌ ఆడుకుంటుండటం చూసి నిషిక, వైజయంతి కడుపు మంటతో రగిలిపోతారు.ఇప్పుడు ఈ కేదార్‌గాడితోనే చస్తున్నాం..వీడికి ఇప్పుడు ఈ శ్రీవల్లి తోడయ్యిందంటే మనం రోడ్డునపడటం ఖాయమని వైజయంతి అంటుంది. వాళ్ల రూమ్‌లోకి వెళ్తుంటే ఆదిలక్ష్మీ వచ్చి కాఫీ ఇవ్వమని గొడవ పెట్టుకుంటుంది. మాకే పనిచేసేవాళ్లు ఉన్నారని మేం నీకు కాఫీ ఇచ్చేది ఏంటని గొడవపడి నిషిక  తన రూమ్‌లోకి వెళ్తుంది.శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించే పని ఎంతవరకు వచ్చిందని యువరాజును అడగ్గా....తను వెంటనే వాళ్ల మామ పాపారాయుడికి ఫోన్ చేస్తాడు.ఆపని మీదే ఇంటికి వస్తున్నానని ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకోమని చెబుతాడు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
                       ఆ జగధాత్రి,కేదార్ ఇంట్లో ఉంటే శ్రీవల్లిని పంపించరని....అందుకే వాళ్లను బయటకు పంపడం ఎలా అని ఆలోచిస్తుండగా నిషిక  ఓ ఐడియా చెబుతుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలంటూ పథకం వేస్తుంది.ఇంతలో కౌషికి వాళ్ల బాబాయిని తీసుకుని బోర్డు మీటింగ్‌కు వెళ్తుంది. జగధాత్రి,కేదార్‌ కిచెన్‌లో పనిచేస్తుండగా.....ఆదిలక్ష్మీ హాల్‌లో నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్తుంటే...నిషిక వెనక నుంచి వెళ్లి గట్టిగా తోస్తుంది.దీంతో ఆమె గోడకు గుద్దుకుని దెబ్బ తగిలించుకుని గట్టిగా అరుస్తుంది. దీంతో కేదార్‌, ధాత్రి అక్కడికి వచ్చిఆమెకు పసుపు రాస్తారు. ఆస్పత్రికి తీసుకెళ్దాం యువరాజును రమ్మని అనగా...యువరాజు బయటకు వెళ్లిపోయాడని అబద్ధం చెబుతారు.నువ్వే వెంట వెళ్లమని నిషిక చెప్పడంతో కేదార్‌, జగధాత్రి ఆదిలక్ష్మీని తీసుకుని ఆస్పత్రికి బయలుదేరతారు. అయితే ఇంటి ముందు యువరాజు షూతోపాటు కారు ఉండటంతో జగధాత్రికి అనుమానం వస్తుంది.
శ్రీవల్లిపై చేయిచేసుకున్న పాపారాయుడు
                            ఇంట్లో అందరూ వెళ్లిపోవడంతో యువరాజు పాపారాయుడికి ఫోన్ చేస్తాడు. పది నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెబుతాడు. జగధాత్రి అదోలా ఆలోచిస్తుంటే కేదార్ ఏమైందని అడుగుతాడు.నాకు ఎందుకో నిషిక వాళ్లు ఏదో ప్లాన్ చేస్తున్నట్లు అనుమానం కలుగుతుందని జగధాత్రి అంటుంది.ఇంట్లో ఎవరూ ఉండకుండా అందరినీ కావాలనే బయటకు పంపినట్లు ఉందని అంటుంది.నాకు కూడా అదే అనిపిస్తుందని కేదార్ అంటాడు.యువరాజు  ఇంట్లోనే ఉన్నాడని నాకు అనుమానం కలుగుతుందని చెబుతుంది. ఇంతలో పాపారాయుడు ఇంటికి రావడంతో శ్రీవల్లి అతన్ని చూసి బెదిరిపోతుంది. నువ్వు మామయ్య వెంట ఊరు వెళ్లమని యువరాజు అంటాడు. కౌషికి అక్క, జగధాత్రి వదిన,కేదార్ అన్నయ్య లేకుండా నేను వెళ్లనని చెబుతుంది. వాళ్లు వచ్చిన తర్వాత మేం చెబుతాంలేగానీ నువ్వు వెళ్లు అని వైజయంతి అంటుంది. బట్టలు సర్దుకుని వస్తానని చెప్పగా....ఆల్రెడీ బ్యాగ్‌ సర్దేశామని చూపిస్తుంది. అయినా సరే వాళ్లు రాగానే వాళ్లకు చెప్పి వెళ్తానని చెప్పగా....పాపారాయుడికి కోపం వచ్చి శ్రీవల్లిపై చేయిచేసుకుంటాడు. మంచిగా చెబుతుంటే వినవా అని జుట్టుపట్టుకుని పైకి లేపుతాడు. ఇవాళ ఏం జరిగినా నువ్వు నా వెంట రావాల్సిందేనని పట్టుబడతాడు. దీంతో శ్రీవల్లి పాపారాయుడు చేయి కొరికి గదిలోకి వెళ్లి తలుపువేసుకుంటుంది. వీళ్లంతా తలుపు తీయమని బాదుతూ ఉంటారు.ఇంతలో జగధాత్రికి అనుమానం వచ్చి శ్రీవల్లి ఫోన్‌కు ఫోన్ చేయగా....అదిహాల్‌లోనే ఉంటుంది. దీనికి అప్పుడే అనుమానం వచ్చినట్లు ఉందని నిషిక అంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget