Guppedanta Manasu Serial Today July 16th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: సరోజకు పెళ్లి చూపులు – కాలేజీ నుంచి వెళ్లిపోయిన మను
Guppedanta Manasu Today Episode: కాలేజీ ఎండీ పదవి వద్దని.. డైరెక్టర్ గా కూడా రిజైన్ చేసి మను కాలేజీ నుంచి వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: మనును కాలేజీ ఎండీగా చేయాలన్న మంత్రి గారి నిర్ణయాన్ని శైలేంద్ర వ్యతిరేకిస్తాడు. ఇంతలో మను కూడా ఎండీగా బాధ్యతలు తీసుకోవడానికి నేను సిద్దంగా లేనని.. ఇప్పుడున్న డైరెక్టర్ పదవికి కూడా రిజైన్ చేస్తున్నానని చెప్పడంతో శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతాడు. మిగతావారంతా షాక్ అవుతారు.
మంత్రి: ఎందుకు మను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు.
ఫణీంద్ర: మను శైలేంద్ర అలా మాట్లాడుతున్నాడని నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావా?
మను: లేదు సార్.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇలా చేయాల్సి వస్తుంది.
మహేంద్ర: నీ కారణాలేంటో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలా సడెన్‌గా కాలేజీని వదిలేయడం కరెక్టు కాదేమో
ఫణీంద్ర: అవును మను కాలేజీ కష్టాల్లో ఉన్నప్పుడు మేము అడగకుండానే సాయం చేసి ఇప్పుడు ఇలా వెళ్లిపోతే ఎలా?
అని అందరూ మను నిర్ణయాన్ని మార్చుకోమని ఎంత చెప్పినా మను వినకుండా సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతాడు. మంత్రి తన కళ్లముందే డీబీఎస్టీ కాలేజీ పతనమై పోతుంటే చూడలేకపోతున్నాను. అంటే శైలేంద్ర కూడా నేను చాలా బాధపడుతున్నాను. అందుకే ఎండీగా బాధ్యతలు తీసుకుని కాలేజీని గాడిలో పెట్టాలనుకుంటున్నాను అనడంతో మంత్రి నువ్వు ఎండీగా ఉండాలంటే రిషి కానీ వసుధార కానీ నిన్ను ఎండీగా ప్రపోజ్ చేయాలని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు రంగ మెడిసిన్స్ తీసుకొచ్చి రాధమ్మకు ఇస్తాడు.
సరోజ: అమ్మమ్మా చూశావా? ఇప్పుడేమైందో ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఇంట్లో నీకంటూ ఒక తోడు ఉండాలని కానీ నువ్వే నా మాట లెక్క చేయడం లేదు.
రాధమ్మ: ఇప్పుడేమైందే నాకు తోడుగా ఆ అమ్మాయి ఉందిగా
సరోజ: ఆ పిల్ల నీకు తోడుగా లేదు. ఈ ఇంట్లో ఉంటూ తన పని తాను చూసుకుంటుంది. బావను నాకిచ్చి పెళ్లి చేస్తే నేనెప్పుడూ ఇక్కడే ఉంటాను కదా? నీకు అన్ని పనులు చేస్తాను.
సంజీవయ్య: పోవాల్సిన టైం వచ్చినప్పుడు ఎవరైనా పోతారులేవే? అత్తయ్యా ఇప్పుడు ఒంట్లో బాగానే ఉంది కదా?
రాధమ్మ: బాగానే ఉంది బాబు
సంజీవయ్య: ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఎక్కడ మీరు ఈ వంక పెట్టి నా వడ్డీ డబ్బులు ఎగ్గొడతారోనని భయపడ్డాను. అసలు నేను ఇక్కడికి ఎందుకొచ్చానో తెలుసా? రేపు మా అమ్మాయికి పెళ్లి చూపులు. మీ మనవడితో కాదు. అబ్బాయి సిటీలో ఉంటాడు.
అని చెప్పగానే సరోజ కోప్పడుతుంది. నాకు చెప్పకుండా ఎందుకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని నిలదీస్తుంది. సంజీవయ్య, సరోజను తిడతాడు. ఊర్లో అందరికీ చెప్పాలని సంజీవయ్య వెళ్లిపోతాడు. మరోవైపు ఫణీంద్ర కాలేజీ నుంచి మను ఎందుకు వెళ్లిపోయాడని మహేంద్రను అడుగుతాడు. శైలేంద్రే కారణం అయితే చెప్పు వీణ్ని నేను వదిలిపెట్టనని మహేంద్రను తనతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు ఫణీంద్ర. మరోవైపు సరోజ రంగ దగ్గరకు వచ్చి తనకు చాలా టెన్షన్‌గా ఉందని బాధపడుతుంది. బుజ్జి, సరోజను ఆటపట్టిస్తాడు.
సరోజ: బావ నాకు ఈ పెళ్లి చూపులు అసలు ఇష్టం లేదు.
రంగ: ఏం ఎందుకు లేవు.
సరోజ: నా మనసులో వేరే వాళ్లు ఉన్నారు.
రంగ: ఓహ్ వేరే వాళ్లు ఎవరు?
సరోజ: ఎవరో తెలియదా నీకు నువ్వే ఉన్నావు బావ.
రంగ: నీకు ఆలెరెడీ నేను చెప్పాను సరోజ నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. ఇప్పటికే మీ నాన్న నన్ను ఏదేదో అంటూ సాధిస్తుంటాడు.
అంటూ ఎప్పటికీ మన పెళ్లి జరగదని చెప్తాడు రంగ. రంగ మాటలు విన్న వసుధార మీరు చెప్తుంది మన జీవితం గురించే అని నాకు తెలుసు సర్ అని మనసులో అనుకుంటుంది. సరోజతో నువ్వు ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో అంటుంది. సరోజ కోపంగా వసుధారను తిట్టి పెళ్లి చూపులు ఆపాలని రంగాకు చెప్తుంది. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని కరాకండిగా చెప్తుంది సరోజ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.