Guppedanta Manasu Serial Today February 12th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: తట్టా బుట్టా సర్దుకున్న మహేంద్ర – వసుధారకు హ్యాండిచ్చిన ఫ్రెండ్స్
Guppedanta Manasu Today Episode: అప్పులు కట్టలేక ఊరొదిలి వెళ్లిపోదామని మహేంద్ర నిర్ణయించుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: రిషి తమ దగ్గర అప్పు తీసుకున్నాడని ఇద్దరు వ్యక్తులు వచ్చి బోర్డు మీటింగ్‌లో అడుగుతారు. వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపిస్తారు. అయితే ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అని మహేంద్ర, వసుధార అంటారు. దీంతో తాము కోర్టుకు వెళతామని అప్పు ఇచ్చిన వాళ్లు చెప్పడంతో.. సరే మీఇష్టం ఏమైనా చేసుకోండని మహేంద్ర అనడంతో.. కోర్టుకు వెళితే వారే గెలుస్తారని మహేంద్రతో అంటుంది అనుపమ. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండి ఇప్పుడే ఎందుకు అప్పు అడగటానికి వచ్చారని ఆ ఇద్దరిని వసుధార నిలదీస్తుంది.
రిషి బతికి ఉంటే ఈ రోజు కాకపోయిన రేపైనా మా అప్పు తిరిగివస్తుందనే నమ్మకం ఉండేది. కానీ ఆయన చనిపోయారు కదా..అందుకే డబ్బులు అడగటానికి వచ్చామని అంటారు. రిషి చనిపోయాడని అనగానే వారిపై వసుధార ఫైర్ అవుతుంది. రిషి చనిపోయాడనే మాట ఇంకోసారి అనోద్దని అంటుంది. రిషి చనిపోయాడా...బతికి ఉన్నాడా అన్నది మాకు అనవసరం...మాకు డబ్బు అయినా ఇవ్వండి. లేదంటే కాలేజీనైనా మాకు హ్యాండోవర్ చేయండి అని అప్పు ఇచ్చిన వాళ్లు డిమాండ్ చేస్తారు.
దీంతో ఈ సమస్యను సాల్వ్ చేయడానికి తమకు కొంత టైమ్ కావాలని అప్పు ఇచ్చిన వారిని అనుపమ రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో వారు 24 గంటలు టైమ్ ఇచ్చి.. డబ్బులు ఇవ్వకపోతే కాలేజీని మాకు అప్పగించాలని డెడ్‌లైన్ విధించి వెళ్లిపోతారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తేవడం సాధ్యం కాదని కోపంగా బోర్డ్ మీటింగ్ రూమ్ నుంచి మహేంద్ర కూడా కోపంగా వెళ్లిపోతాడు. ఒంటరిగా బోర్డ్ రూమ్‌లో మిగిలిపోతుంది వసుధార.
శైలేంద్ర: కళ్లలో భయం, మనసులో ఆందోళన కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది
వసుధార: ఇంతకుముందు తిన్న చెంపదెబ్బ సరిపోలేదా... ఇంకా ఏదేదో వాగుతున్నావు
శైలేంద్ర: దానిని ఎలా మార్చిపోతాను. నా మీద చేయి చేసుకున్నావో లేదో ఇలా జరిగింది. మంచి వాళ్లను బాధపెడితే దేవుడు ఊరుకోడు. అందుకే నీ మీద ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు.
వసుధార: ఇది నువ్వు ఆడుతోన్న నాటకం కదా...వెనకుండి నువ్వే ఈ డ్రామా ఆడిస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అది నిజం ఇకనైనా నీ వెధవ వేషాలు ఆపు
శైలేంద్ర: రెచ్చిపోతే నీకే మంచిది కాదు. నువ్వు నా మీద అరవడం కాదు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. నేను అడిగినప్పుడు కాలేజీని నాకు అప్పగిస్తే సరిపోయేది. పరాయివాళ్ల చేతుల్లోకి కాలేజీ వెళ్లే పరిస్థితి వచ్చేది కాదు కదా
అంటూ వసుధారను శైలేంద్ర బెదిరించడంతో అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని తాను నిరూపిస్తానని, కాలేజీని సొంతం చేసుకోవడానికి ఎవరో దుర్మార్గులు కుట్రలు పన్ని ఇదంతా చేస్తున్నారని తాను నిరూపిస్తానని శైలేంద్రతో ఛాలెంజ్ చేస్తుంది వసుధార. మరోవైపు బోర్డ్ మీటింగ్ నుంచి ఆవేశంగా ఇంటికి వచ్చిన మహేంద్ర... ఊరికి, కాలేజీకి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. తన లగేజీని సర్ధుతుంటాడు. వసుధార ఇందుకు ఒప్పుకుంటుందా అని అనుపమ అనుమానం వ్యక్తం చేస్తుంది. అప్పుడే వసుధార ఇంట్లో అడుగుపెడుతుంది.
వసుధార: మామయ్యా ఏంటిది? ఎక్కడికి వెళుతున్నారు.
మహేంద్ర: వెళుతున్నారు కాదు. వెళుతున్నాము. నీ లగేజీ కూడా సర్ధుకో..ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోదాం
వసుధార: మరి కాలేజీ పరిస్థితి ఏంటి?
మహేంద్ర: కాలేజీ వల్లే ఇన్ని సమస్యలు బాధలు వస్తున్నాయి. మనం కారుస్తున్న కన్నీళ్లకు కాలేజీనే కారణం.
సమస్య కాలేజీ కాదని, శైలేంద్ర అని మహేంద్రతో అంటుంది వసుధార. కాలేజీని వదిలిపెట్టి వెళ్లిపోతే శైలేంద్రకు భయపడిపారిపోయినట్టు అవుతుందని మహేంద్ర కు చెబుతుంది వసుధార. కాలేజీని వదిలిపెట్టడం అంటే నా ప్రాణాలను వదిలేసినట్లేనని వసుధార అంటుంది. అయినా మహేంద్ర తన పట్టుదల వీడడు. కాలేజీ వల్ల జగతి, రిషితో పాటు మీ అమ్మ చనిపోయారు అని వసుధారను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు మహేంద్ర.
వసుధార: మామయ్యా రిషి సార్ చనిపోయాడు అనే మాట ఇంకోసారి అంటే నా చావును చూస్తారు మీరు.
మహేంద్ర: అందరూ కలిసి నన్ను ఎమోషనల్ బ్లాక్‌బెయిల్ చేస్తున్నారా నువ్వు చనిపోతే నేను బతికేది ఎలా...నేను కూడా చనిపోవడం తప్ప మరో మార్గం ఉండదు. అందరం కలిసి చనిపోతే ఏ సమస్య ఉండదు.
అంటూ కాలేజీ సమస్యను ఎలా పరిష్కరిస్తావని వసుధారను నిలదీస్తాడు మహేంద్ర. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావని అడుగుతాడు. ఒకవేళ డబ్బు తెచ్చిన కూడా అప్పు ఇచ్చిన వాళ్లు ఏ కండీషన్ పెడతారో తెలియదు అని మహేంద్ర టెన్షన్ పడతాడు. అయితే ఆ డబ్బును తాను అరెంజ్ చేస్తానని వసుధార చెబుతుంది. తన తండ్రిని అడిగి ఆ డబ్బును తెస్తానని అనుపమ అంటుంది. కానీ వద్దని మహేంద్ర వారిస్తాడు.
మహేంద్ర: నువ్వు డబ్బు అడిగి తీసుకొస్తే శైలేంద్ర రేపు మరో ప్రాబ్లెమ్ క్రియేట్ చేస్తాడు. అదే డబ్బు కట్టకపోతే కాలేజీని వాళ్లు హ్యాండోవర్ చేసుకుంటారు. అప్పుడు వసుధార తనంతట తానే మనతో పాటు కలిసి వస్తుంది.
బయటకు వెళ్లిన వసుధార తనకు తెలిసిన వారందరిని డబ్బులు అడుగుతుంది. కానీ ఎవరూ డబ్బు ఇవ్వరు. మరోవైపు శైలేంద్ర ఈ ప్లాన్ వేశాడని తెలిసి కొడుకుపై ప్రశంసలు కురిపిస్తుంది దేవయాని.
దేవయాని: నీ ప్లాన్ అదిరిపోయింది అసలైన క్రిమినల్ బ్రెయిన్ అంటే నీది లేనిది ఉన్నట్లు...ఉన్నది లేనట్లు చేయడంలో ఎవరైనా నీ తర్వాతే
శైలేంద్ర: నా మీదే తను పొగరు చూపించింది. నా మాటలు లేక్కచేయకపోగా...నాకే వార్నింగ్ ఇచ్చింది. అందుకే డమ్మీ గాళ్లను దించి వసుధారకు సమస్యలను క్రియేట్ చేశాను
అనగానే నువ్వు బిగించిన ఉచ్చును విడదీయం ఎవరి వల్ల కాదని దేవయాని సంతోషంగా ఫీలవుతుంది. నువ్వు ఎండీ సీట్‌లో కూర్చోవాలన్న నా కల రేపటితో నిజం కాబోతుంది అని సంబరపడుతుంది. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన ధరణి మీ కల కలగానే ఉంటుందని.. మీరింత వరకు ఎన్ని కుట్రలు చేసినా ఎండీ సీట్ దక్కలేదని.. ఇకపై కూడా దక్కదని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పింక్ డ్రెస్ లో రుక్సర్ ఎంత బావుందో!