Guppedantha Manasu (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
గుప్పెడంతమనసు సెప్టెంబరు 9th ఎపిసోడ్ (Guppedanta Manasu September 9th Written Update)
రిషి, వసుధార అర్థరాత్రి రోడ్డు పక్కన కూర్చుని మాట్లాడుకుంటారు. ఇంతలో విశ్వనాథం ఫోన్ చేసి ఏంజెల్ నీకోసం స్వీట్స్ చేసింది త్వరగా వచ్చేయ్ అని కాల్ కట్ చేస్తాడు. నేను రాను సార్ అని అసహనంగా అంటాడు రిషి. ఏంటీ రిషి అని విశ్వనాథం అడిగితే.. అదే సార్. ఇక్కడ ఇంకా వర్క్ కాలేదని కవర్ చేస్తాడు. చూశారా మేడమ్ ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇంటికెళ్లండి అని సమాధానం ఇస్తుంది. మీరు వెళ్లండి అంటే మీరు వెళ్లండని మాట్లాడుకుంటారు.
మరుసటి రోజు ఉదయం కారులో కంగారుగా బయలుదేరుతారు జగతి, మహేంద్ర. వసుధారకి కాల్ చేసి విశ్వనాథం గారు కాల్ చేసిన విషయం చెబుతారు. అసలు దీనికి రిషి ఒప్పుకున్నాడా అని ఇద్దరూ అడుగుతారు. రిషి సార్ కి ఇష్టం లేదు కానీ తనకి ఇష్టం అని వాళ్లు భ్రమపడ్డారంటుంది. మరి ఆ విషయం చెప్పొచ్చు కదా అంటే... నిజం చెబితే తన గతం గురించి చెప్పాల్సి వస్తుందని భయపడుతున్నారని రిప్లై ఇస్తుంది. ఏంటిదింతా అని ఫైర్ అవుతారు..
వసు: రిషి సార్ ఒంటరిగా ఉంటున్నారు..ఇప్పుడు ఏంజెల్‍తో రిషి సార్‍కు పెళ్లి జరిగితే ఆయన సంతోషంగా ఉంటారేమో
మహేంద్ర: నువ్వు రిషి వేర్వేరు కాదు.. రిషి నీవాడు. మేం వచ్చి రిషితో మాట్లాడుతాం. నువ్వు తన జీవితంలో లేవన్న మరుక్షణమే నా కొడుకు గుండె ఆగిపోతుంది. మీరు చేసిన తప్పుని అంగీకరించేందుకు తన మనసు అంగీకరించడం లేదు. త్వరలో మీరిద్దరూ ఒక్కటవుతారు.. ఈ పెళ్లి ఆపేద్దాం మేం వస్తున్నాం..నువ్వు ధైర్యంగా ఉండు ..మేం వస్తున్నట్టు రిషికి చెప్పొద్దు. మనం అందరం కలసి ఏదో దాస్తున్నాం అనుకుంటాడు
వసు: ఇప్పుడు చెప్పడమే మంచిది సార్
మహేంద్ర: నేను వచ్చాక మాట్లాడుతాను..ఈ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను...
వసు: నాకు మేడంకి రిషి సార్ తో మాట్లాడే అర్హత లేదు..మీరు చెప్పినట్టే ఈ విషయం రిషి సార్ కి చెప్పను
కాల్ కట్ అవుతుంది...
Also Read: రిషికి క్లాస్ వేసిన వసు, నిశ్చితార్థానికి జగతి-మహేంద్రకి ఆహ్వానం!
శైలేంద్ర-రౌడీ
మహేంద్ర, జగతి కారు బ్రేకులు ఫెయిల్ అయ్యేటట్లు ఒక రౌడీతో శైలేంద్ర ప్లాన్ చేస్తాడు. మీరు చెప్పినట్టే చేశాను సర్..వాళ్ల పని అయిపోతుంది, వాళ్లను ఎవరూ కాపాడలేరని వాడంటే...అదే జరిగితే నీకు నాలుగింతలు రెట్లు డబ్బు ఇస్తానంటాడు.
వసు-చక్రపాణి
చక్రపాణి బాధపడుతుంటే వసు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. మీరిద్దరూ ఇలా ఉంటేన కాఫీ, టిఫిన్ ఎలా దిగుతుందమ్మా. మీరంతా కలిసి రిషి సార్‍ను బాధపెట్టారు. ఆయన ఇంట్లోకి రాలేక, విశ్వనాథం ఇంటికి వెళ్లకుండా మదనపడుతున్నారు. ఏ పాపం తెలియను అల్లుడి గారికి ఎందుకమ్మా ఇన్ని కష్టాలు. ఎందుకింత క్షోభ. నాకు గుండె ఆగిపోయినంత పనవుతోంది. తన బాధను చూడలేకపోతున్నాను ..నేను వెళ్లి మీకు నిశ్చితార్థం అయినట్లు విశ్వనాథం గారికి చెబుతాను. ఇప్పుడు కూడా ముందడుగు వేయకుండా ఉండలేను అని చక్రపాణి అంటాడు.
వసు: మీరు చెబితే అమ్మ మీద ఒట్టే
చక్రపాణి: సుమిత్ర ఫొటో దగ్గరికి వెళ్లి చూశావా. వసు నాకు ఎలా బంధనం వేసిందో. ఇదంతా చూసేందుకా నేను బతికి ఉండాలి
వసు:అలా మాట్లాడకండి నాన్న. జగతి మేడమ్, మహేంద్ర సార్ రిషి సార్ గురించి చెప్పేందుకు వస్తున్నారు
ఈ మాటకు చక్రపాణి కాస్తా కుదుటపడతాడు.
Also Read: కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారిపోయిందే , రిషి-ఏంజెల్ పెళ్లి ఫిక్స్!
జగతి-మహేంద్రకు యాక్సిడెంట్
మరోవైపు జగతి, మహేంద్ర కారును ఫాలో చేస్తుంటాడు రౌడీ. మహేంద్ర కారుకు తన బైకుతో వచ్చి అడ్డుగా వచ్చి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాడు రౌడీ. దీంతో బ్రేకులు ఫెయిల్ అయి ఓ డివైడర్‍కు గుద్దుకుంటారు. పరలోకానికి వెళ్లిపోయారని అనుకున్న రౌడీ వెళ్లిపోతాడు. కారు యాక్సిడెంట్ చూసి కొంతమంది వచ్చి వాళ్లను కాపాడతారు. కొంత తేరుకున్న జగతి.. కాపాడిన అతనితో తన ఫోన్ నుంచి వసుధారకు కాల్ చేయిస్తుంది. జగతి, మహేంద్రకు యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలుసుకున్న వసుధార కంగారుపడిపోతుంది. రిషికి కాల్ చేసి చెప్పాలని ఫోన్ చేస్తే.. రిషి లిఫ్ట్ చేయడు. దీంతో వసుధార జగతి, మహేంద్ర దగ్గరకి వెళ్తుంది.
సంబరాల్లో శైలేంద్ర
సంతోషంగా మామ్ అంటూ దేవయాని దగ్గరికి వస్తాడు శైలేంద్ర. చాలా సంతోషంగా ఉంది మామ్. స్వీట్స్ తిను. ఇక బాబాయ్, పిన్ని అడ్డు తొలగిపోయింది. రిషికి ఏదో సమస్య వచ్చిందని వాళ్లు వెళ్తుంటే యాక్సిడెంట్ చేయించాను అని శైలేంద్ర అంటాడు. యాక్సిడెంట్ అయితే.. వాళ్లు చనిపోయినట్లా అని దేవయాని అంటుంది. ఇప్పుడు వాళ్లు బతికారా. హాస్పిటల్‍లో ఉన్నారా అది కావాల్సింది. వాళ్లు కొద్దిరోజులు ఇక్కడ ఉండకపోవడమే కావాలి. రేపు మనకు ఉన్న పని చాలా ముఖ్యమైంది అని శైలేంద్ర అంటాడు. ఇప్పుడు కరెక్ట్ దారిలో వెళ్తున్నావని దేవయాని అంటుంది.
మరోవైపు రిషికి వసు, ఏంజెల్ కాల్ చేస్తారు. కానీ లిఫ్ట్ చేయడు. వసుకి ఏంజెల్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా తర్వాత ఫోన్ చేస్తానని మెసేజ్ చేస్తుంది. రిషికి విశ్వనాథం కూడా కాల్ చేస్తాడు. కానీ రిషి లిఫ్ట్ చేయడు.
Bigg Boss Telugu 7: నువ్వేమైనా పెద్ద పిస్తావా? సందీప్‌కు నాగ్ క్లాస్, ఊహించని పనిష్మెంట్
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
Nindu Noorella Savasam September 23rd: ఇంట్లోకి తిరిగి అడుగుపెట్టిన అరుంధతి ఆత్మ - సైకోలా మారిన మనోహరి!
Trinayani September 23rd Episode: సుమనకు ఆస్తి ఇచ్చిన విశాల్ - విషపు కత్తిని మింగిన పాము!
Gruhalakshmi September 23rd: మాజీ భార్యని ఇంప్రెస్ చేసేందుకు నందు తిప్పలు- జాహ్నవి ఆత్మహత్యాయత్నం
Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్
Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్
వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!
Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు
/body>