Guppedanta Manasu September 8th: రిషికి క్లాస్ వేసిన వసు, నిశ్చితార్థానికి జగతి-మహేంద్రకి ఆహ్వానం!
ఏంజెల్ పెళ్లిగోల ఓ వైపు...అటు కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు మరోవైపు...ఇదే స్టోరీ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు సెప్టెంబరు 8th ఎపిసోడ్ (Guppedanta Manasu September 8th Written Update)
రిషి పెళ్లికి అంగీకరించాడని అనుకుంటున్న విశ్వనాథం, ఏంజెల్ ఇద్దరూ సంతోషంలో మునిగితేలుతారు. అదే ఆనందంలో ఏంజెల్..వసుధారకి కాల్ చేసి..రిషి పెళ్లికి ఒప్పుకున్నాడని చెబుతుంది. అటు ఏంజెల్ మాట్లాడుతూనే ఉంటుంది..వసుధార కళ్లుతిరిగి పడిపోబోతుంటే రిషి వచ్చి పట్టుకుంటాడు.
రిషి: ఏం జరిగింది
వసు: మీరు ఒప్పుకున్నారా..ఏంజెల్ ను పెళ్లిచేసుకుంటానని మీరు చెప్పారా
రిషి: మీరు నమ్ముతున్నారా..నా మనసులో ఒక్కరికే చోటుంది..ఆల్రెడీ ఒకరికి ఇచ్చేశాను నా మనసు తనకు మాత్రమే అంకితం
వసు: మీరు ఒప్పుకున్నారని ఏంజెల్ చెబుతోంది
రిషి: నా ప్రమయేం లేకుండానే జరిగిపోయింది..మీరు ప్రాబ్లెమ్ సాల్వ్ చేయమంటే చేయడం లేదు..ఈ పెళ్లి ఇష్టంలేదని నేను చెప్పేలోగా నేను ఒప్పుకున్నానని ఆనందపడుతున్నారు..ఇప్పుడు విశ్వనాథం గారికి చెబితే ఆయన ఆరోగ్యం ఏమవుతుందో అని ఆగిపోయాను. చెబితే విశ్వనాథం గారికి ప్రమాదం, చెప్పకపోతే నాకు ప్రమాదం...నాకేంటి ఈ సమస్య...మీరే కారణం
వసు: మీ సమస్యకి నన్ను తప్పుపడుతున్నారా
రిషి: నా మనసులో ప్రేమను నింపావ్..మనసుని ముక్కలు చేసి చంపేశావ్..ఇంకా ఎన్నిసార్లు చంపేస్తావ్.. ఓ సారి నా ప్రేమను కాదన్నావు, మరోసారి నిజాయితీ పరుడిని కాదని వ్యక్తిత్వం పై మచ్చవేసి చంపేశావ్..ఇప్పడు మనసుకి నచ్చనిది చేయమని చంపేశావ్.ఇప్పటికి మూడుసార్లు చంపేసిన మనిషిని మళ్లీ మళ్లీ చంపేస్తావా
వసు: మీ కోసమే మళ్లీ మళ్లీ పడుతున్నాను..మీరు నా ప్రాణం..అందుకే నా ప్రాణం మిమ్మల్ని వదిలివెళ్లడం లేదు..
రిషి: నేను ప్రాణం అంటూనే నా ప్రాణం తీస్తున్నారు కదా అనేసి కోపంగా వెళ్లిపోతాడు రిషి...
మళ్లీ వసుధార ఫోన్ రింగవుతుంటుంది...కానీ వసు వినిపించుకోదు...ఏమైందో ఏమో వసుధార ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నేను తన దగ్గరకు వెళ్లొస్తానంటుంది ఏంజెల్. అక్కడ ఏం జరిగి ఉండదు..నువ్వు గుడ్ న్యూస్ చెప్పావు కదా తనే మన ఇంటికి వస్తూ ఉండొచ్చేమో అంటాడు విశ్వనాథం. నిజమే విశ్వం..వసుకి మనం చాలా ఇష్టం...
Also Read: కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారిపోయిందే , రిషి-ఏంజెల్ పెళ్లి ఫిక్స్!
ఇప్పట్లో అకౌంట్స్ క్లియరయ్యేలా లేవు..ఏంచేద్దాం, గోల్డ్ తాకట్టు పెడితే సరిపోయేది..ఇప్పుడు శైలేంద్ర దీన్ని అదనుగా తీసుకుంటాడేమో అని అనుకుంటారు. ఇంతలో కాల్ చేసిన విశ్వనాథం మీకో గుడ్ న్యూస్ చెబుదామని కాల్ చేశానంటూ...ఏంజెల్ కి తగిన వరుడిని చూశానంటూ గెస్ చేయమంటాడు...మహేంద్ర-జగతి కన్ఫ్యూజన్లో ఉండగా ఆ పెళ్లికొడుకు ఎవరో కాదు రిషినే అని క్లారిటీ ఇస్తాడు. జగతి-మహేంద్ర షాక్ లో ఉండిపోతారు. మీరు చెప్పేది నిజమా అని జగతి అంటే..మేం రిషితో మాట్లాడొచ్చా అని మహేంద్ర అడుగుతారు. మరోవైపు నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేస్తున్నాం , ఆ సమయానికి రిషి తరపున తల్లిదండ్రులు ఉంటే బావుండును..కానీ తను ఏమీ చెప్పడం లేదు..ఆ రోజు మీరైనా తన పక్కనుంటే బావుంటుంది తప్పకుండా రావాలి...రిషికి మీరు రావడం సర్ ప్రైజ్ గా ఉండాలని చెప్పి కాల్ కట్ చేస్తాడు విశ్వనాథం.
జగతి-మహేంద్ర
ఈ విషయం వసుకి తెలిసి ఉంటుందా..అసలు ఏం జరుగుతోందని టెన్షన్ పడుతూ వసుధారకి కాల్ చేస్తారు మహేంద్ర-జగతి. వసు ఫోన్ చూసుకోదు. అక్కడ ఏదో జరిగి ఉంటుంది మహేంద్ర మనం వెంటనే వెళదాం అని జగతి అంటుంది. ఈ విషయం అన్నయ్యకి చెబుదాం అని మహేంద్ర అంటే..వద్దంటుంది జగతి. వీళ్లిద్దరి మాటలు బయటి నుంచి వింటాడు శైలేంద్ర. అక్కడ ప్రాబ్లెమ్ సాల్వ్ చేసి ఇక్కడకు రాగానే బావగారికి అన్ని విషయాలు చెబుదాం అంటుందిజగతి. సరే మీరు వెళ్లండి మీరు వచ్చేలోగా నా ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకుంటాను అనుకుంటాడు శైలేంద్ర.
Also Read: సీరియల్ ని మలుపుతిప్పనున్న రిషి సమాధానం, మరింత విజృంభించిన శైలేంద్ర!
రిషి-వసుధార
రిషి మాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంటుంది వసుధార. మరోవైపు రిషి ..వసు ఇంటి ముందే ఉంటాడు... లోపలకు రాడు..వసు తనని చూడదు. నిద్రపోయేముందు డోర్స్ వేద్దామని వచ్చిన చక్రపాణి రిషిని చూస్తాడు. ఒకరికి ఒకరంటే ప్రాణం, వసమ్మ చేసిన గాయం అల్లుడుగారు మర్చిపోరు..మీరిద్దరూ మీ ప్రేమను గుండెల్లో దాచుకుని ఎంతకాలం బాధపడతారు, మమ్మల్ని బాధపెడుతుంటారు..మీ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుంది..ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాలి...ఇప్పుడు అల్లుడు గారిని పిలిస్తే ఆయన రారు... వసుధారకి చెప్పి ఇంట్లోకి తీసుకురమ్మని చెప్పాలి అనుకుంటాడు. రిషి..ఇంటి బయటే ఉన్న సంగతి చక్రపాణి చెప్పి తనని ఇంట్లోకి తీసుకురా అంటాడు. పరుగున వెళుతుంది... రిషి సార్ అని పిలుస్తుంది... అప్పటి వరకూ బయటే ఉన్న రిషి..వసు వెళ్లగానే వెళ్లిపోతాడు. ఈ వసుధార మీ సంతోషం కోరుకునే మనిషి మీరెప్పుడు అర్థం చేసుకుంటారో అని బాధపడుతుంది. వెంటనే బయలుదేరి బయటకు వెళుతుంది... రిషి ఓ దగ్గర కూర్చుని ఉంటాడు...తనెక్కడుంటాడో తెలుసుకున్న వసు కూడా అక్కడికి వెళుతుంది. రిషి చేయిని ముట్టుకునేందుకు ట్రై చేస్తుంది కానీ రిషి చేయి వెనక్కు లాగేసుకుంటాడు. లైఫ్ అంటే ఇంతేనా, గాయాలు,బాధలతో నలిగిపోవాలా..జీవితంలో సంతోషం ఉండదా..ఉన్నా అది క్షణమేనా, జీవితాంతం సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాం, ఎవరికోసమో నేను ఇష్టంలేని పనులు ఎందుకు చేయాలంటాడు. వసు చిన్న క్లాస్ వేస్తుంది. ఇంతలో విశ్వనాథం కాల్ చేయడంతో...మీరు చెబుతున్నది బావుంది కానీ నాకీ టార్చర్ ఏంటని బాధపడతాడు. ఫోన్ లిఫ్ట్ చేయండని వసు చెప్పడంతో లిఫ్ట్ చేసిన రిషి.. వస్తున్నా సార్ అంటాడు..