Guppedantha Manasu (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
గుప్పెడంత మనసు జూన్ 17 ఎపిసోడ్
రిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటుంది జగతి. నీ రాక కోసం ఈ తల్లి వేయి కళ్లతో ఎదురు చూస్తోంది అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన ధరణి జగతిని గమనిస్తుంది.
ధరణి: చిన్నత్తయ్య మీరు ఇలా తేదీలు మారుస్తూ.. రిషి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. దీనివల్ల మీ బాధ పెరుగుతుంది కానీ తరగదు
జగతి: రిషి కోసం వెతకని ప్లేస్ లేదు..ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో.. ఏమీ తెలియడం లేదు
ధరణి:పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, పేపర్లో ప్రకట వేయిద్దాం
జగతి: పేపర్లో ప్రకటన ఇస్తే మరింత బాధపడతాడు, తాను పారిపోయానని అందరికీ తెలిసేలా చేశారని కోపం తెచ్చుకుంటాడు, ఉన్నచోట నుంచి వేరచోటుకి వెళ్లిపోతాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే రిషి ఎక్కడున్నాడో తెలుస్తుంది కానీ తన బాధమరింత పెరుగుతుంది.
ధరణి: ఎప్పుడు వస్తాడు, ఎవరి కోసం వస్తాడు .
జగతి: తన కల కోసం, మహేంద్ర కోసం, నా కోసం తిరిగి వస్తాడు
ధరణి: వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు కదా కొంచెం ఆలోచించుకోండి
జగతి: ఎదురుచూడక తప్పదు. నేను చేస్తోంది తప్పు అని తెలిసి చేశానని, రిషిని దోషిగా అందరి ముందు నిలబెట్టాను. నేను చేసింది రిషి మంచి కోసం చేశాకానీ అది చెడు అయింది. తన రాక కోసం ఎదురుచూస్తానని స్పష్టం చేస్తుంది జగతి. ఎప్పటికైనా నా కొడుకు నా కోసం తిరిగి వస్తాడు
మహేంద్ర: ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర చాలు ఆపు అని అరుస్తాడు. ఆ మాట ఇంకోక సారి అనొద్దని చెప్పు ధరణి అంటాడు. ఇన్నెళ్లైనా.. రిషి రావట్లేదని, ఆ రోజు ఎందుకు అలా చేశావని అడిగితే.. తల్లిగా బిడ్డ కోసం చేశానని చెబుతుందని సీరియస్ అవుతాడు.
జగతి: మనసు పొరల్లో దాగి ఉన్నవన్ని తప్పులే అనుకుంటే ఎలా మహేంద్ర, నిప్పులాంటి నిజాలు కూడా ఉంటాయి, బయట వాళ్లకు కనిపించవుగానీ, నిప్పులా దహించివేస్తూ ఉంటుంది
మహేంద్ర: ఎందుకు చేశావో దానికి గల కారణం ఏంటో చెప్పమని అడిగితే.. ఇన్ని రోజులు అయినా చెప్పడం లేదు. నా కొడుకు కోసం నేను ఎదురుచూస్తున్నా.. నా ఆశలన్నీ అడియాశలయ్యాయి. జగతి దగ్గరైందని ఆనందాన్ని తీసుకునేలోపే.. కొడుకుని దూరం చేసేసింది. ఎందుకు ధరణి మీ చిన్నత్తయ్య నా మీద ఇంత పగ సాధిస్తోంది, తనను ప్రేమించడమేనా నేను చేసిన పాపం .తనను పెళ్లి చేసుకోవడమేనా నేను చేసిన నేరం, ఎందుకు నాకు ఈ శిక్ష
ధరణి: మామయ్య మీరు ఇలా మాట్లాడొద్దు మీరు చిన్నత్తయ్య బాధను అర్థం చేసుకోవాలి
మహేంద్ర: నా బాధ ఎవరు అర్థం చేసుకోవాలని, నా రిషి కోసం నా మనసు ఎంత విలవిలలాడుతుందో చూడమని ధరణి చేయి తీసి గుండె మీద పెడతాడు . అడుక్కునేవాడిలా నా కన్న కొడుకు కోసం తిరుగుతున్నాను. ఎక్కడా.. నా రిషి జాడ లేదు, ఆఖరికి ఆ వసుధార కూడా చెప్పడం లేదు
జగతి: అంటే వసుధార మహేంద్రకి ఏం చెప్పలేదా అనుకుంటుంది జగతి మనసులో
Also Read: వసుకి కొత్తగా కనిపించాలని డిసైడ్ అయిన రిషి, ఇకపై వార్ వన్ సైడే!
వసు కాలేజీలో నడుచుకుంటూ వస్తుంది.. హలో సైడ్ ప్లీజ్ అంటుంది కొంచెం ముందుకు వెళ్లి వెనక్కు తిరిగి చూస్తుంది. అక్కడ రిషిని చూసి షాక్ అవుతుంది. కింద పడిన బుక్ తీసి వసుకు ఇస్తాడు రిషి.
వసు: సర్.. మీరేంటి ఇలా. మీరు మా రిషి సారేనా
రిషి: నాకు ఈ ఫీలింగే కావాలి, నేను ఎవరో అన్నట్టుగా అనిపించాలి, ఇంతకు ముందు ఏ పరిచయం లేని, నీ మనసు మార్చుకుంటే మంచిదని హితవు చెబుతాడు. కొంతమంది మనుషులు నా నుంచి నన్ను దూరం చేశారని అంటాడు.
వసు: నా మనసులో మార్పు రావాలని మీరు ఇలా మారిపోయారని నాకు అర్థమైంది సర్, అయినా మీ రూపం మారినంత మాత్రాన, నా మనసు ఎలా మార్చుకుంటాను సార్ అనేసి క్లాసుకు వెళ్లిపోతుంది.
Also Read: రామాయణంతో ముడిపడిన ప్రదేశాలు శ్రీలంకలో ఎన్నో ఉన్నాయి!
జగతి దగ్గరకు వచ్చిన ఫణీంద్ర..రిషి గురించి ఎంక్వైరీ చేస్తాడు. ఏంటమ్మా ఇది రిషి గురించి ఆలోచిస్తే ఏవోవో ఆలోచనలు వస్తున్నాయంటాడు
ఫణీంద్ర: మన కాలేజీ ప్రపంచం నలుమూలాల పేరు సంపాదించిందంటే దానికి కారణం రిషి. రిషిని పంపించావంటే.. ఏదో కారణం ఉంది అదేంటో చెప్పు. కనీసం నాకు అయినా నిజం చెప్పు, దాని వెనక ఎవరెవరు ఉన్నారో చెప్పు
జగతి: ఎలా చెప్పను బావగారు.. దీని అంతటికి కారణం మీ కొడుకు, మీ బావగారు అని చెబితే తట్టుకునే శక్తి మీకు ఉందా అని మనసులో జగతి బాధపడుతుంది. అందుకే చెప్పడం లేదని అనుకుంటుంది. ఎంత చెప్పమన్నా.. జగతి అస్సలు చెప్పదు. రిషి వస్తే.. అన్ని నిజాలు తెలుస్తాయని, వస్తాడు బావగారు అని జగతి చెబుతుంది.
ఇదే సమయంలో మినిస్టర్ జగతికి కాల్ చేస్తాడు. మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా అని అడుగుతాడు. చెప్పండని జగతి అంటుంది. నేరుగా కలిసి మాట్లాడాలని మినిస్టర్ చెబుతాడు. వీలైతే ఇప్పుడే బయల్దేరి వచ్చేసేయండని అంటాడు. దీంతో జగతి బయల్దేరుతుంది. మహేంద్ర కూడా వస్తాడా మీరు అడుగుతారా బావగారు అని అంటుంది
ఫణీంద్ర: నేను అడగలేను. నా తమ్ముడిని ఏ విషయంలోనూ శాసించను, బంధించను
జగతి: మీరు దేవుడిలాంటి మనిషి మీకు ఎటువంటి కీడు జరగకూడదని, నిజాన్ని విషంలా మింగవలసి వస్తోంది అనుకుంటుంది.
జగతి మినిస్టర్ దగ్గరకు బయలుదేరుతుంది.
Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్
Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ
Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
/body>