Guppedanta Manasu July 6th: వసుకి సమయానికి తగు సేవలు చేస్తోన్న రిషి, 'మిషన్ ఎడ్యుకేషన్' కి పోటీగా 'పవర్ ఆఫ్ స్టడీస్'!
Guppedantha Manasu July 6th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయాడు, జగతిపై మహేంద్ర కోపం కంటిన్యూ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

గుప్పెడంతమనసు జూలై 6 ఎపిసోడ్ (Guppedanta Manasu July 6th Written Update)
జగతి, మహేంద్ర తిరిగి ఇంటికి రావడంతో డ్రామా స్టార్ట్ చేస్తుంది దేవయాని. ఏవేవో మాట్లాడుతుంటుంది. అంతా సైలెంట్ గా వింటారు కానీ ఎవ్వరూ ఏమీ స్పందించరు. దేవయాని, శైలేంద్రది నాటకం అని తెలియక నిజంగానే హర్ట్ అయింది అనుకుంటాడు ఫణీంద్ర. మిషన ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వర్క్ కోసం మాత్రమే వెళ్లాం అని క్లారిటీ ఇస్తాడు మహేంద్ర. నావల్ల ఏదైనా సమస్య ఉందంటే నేనే వెళ్లిపోతానంటుంది. అంతా విన్న ఫణీంద్ర నువ్వు కొంచెం అతిగా రియాక్టవుతున్నావ్ అనిపిస్తోంది అని సెటైర్ వేస్తాడు. ఆ తర్వాత అంతా లోపలకు వెళ్లిపోతారు.
Also Read: దరిచేరిన నెచ్చెలిపై దయచూపిన రిషి, మళ్లీ ఇంటికి చేరిన మహేంద్ర-జగతి!
కాలేజీలో అడుగుపెట్టిన రిషికి ప్రిన్సిపాల్ నుంచి పిలుపొస్తుంది. ప్రిన్సిపాల్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడతాడు. ఆ తర్వాత తనవద్దకు వచ్చిన రిషితో ఓ ప్రపొజల్ వచ్చిందని చెబుతాడు. ఓ సెమినార్ కండక్ట్ చేసే అవకాశం ప్రభుత్వం ఇచ్చిందని చెబుతాడు ప్రిన్సిపాల్. ఇదో మంచి అవకాశం అని రిషి చెప్పి మంచి టాపిక్ పై సెమినార్ ఏర్పాటు చేస్తే మనకు మంచి మైలేజ్ వస్తుందని పవర్ ఆఫ్ స్టడీస్ అనే టాపిక్ ఫైనల్ చేస్తాడు. ఏఏ కాలేజీ వాళ్లని పిలవాలో నేను చూసుకుంటాను మీరు కాన్సెప్ట్ ప్రిపేర్ చేయండంటాడు ప్రిన్పిపాల్. ఆ తర్వాత రిషి డాక్టర్ కి కాల్ చేసి వసుధార గురించి చెబుతాడు. ఈ ఫోన్ కాల్ గురించి విన్న స్టూడెంట్స్ వేరేలా మాట్లాడుకుంటారు. ఇద్దరి మధ్యా ఏదైనా నడుస్తోందా అని అని ఓస్టూడెంట్ అనగానే అప్పుడే అక్కడకు వచ్చిన కేడీ బ్యాచ్ హెడ్ పాండ్యన్ క్లాస్ వేస్తాడు. రిషిసార్-వసుధార మేడంని చూసి మొదట్లో మేం కూడా తప్పుగా అర్థం చేసుకున్నాం కానీ మా కోసం ఇద్దరూ పోలీస్ స్టేషన్ కి వచ్చి మా లైఫ్ నిలబెట్టారు. మా కళ్లు తెరిపించారు. కష్టం అంటే ఏంటో తెలిసేలా చేశారు. చదువు గొప్పతనం చెప్పారు. రిషి సార్, వసుధార మేడం లేకపోతే ఆ రోజు మా జీవితం నాశనం అయిపోయేది. అసలు రిషిసార్ కి ఎంత పలుకుబడి ఉందో తెలుసా పోలీసులే సెల్యూట్ చేశారంటూ రిషిధార గురించి గొప్పగా చెబుతాడు పాండ్యన్.
పాండ్యన్ వెళ్లిపోతుండగా ఆపిన రిషి..నీలో మంచి మార్పొచ్చింది నువ్వు జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటావని ప్రశంసించి ప్రేమగా హగ్ చేసుకుంటాడు. అదే సమయంలో తనపై నిందలు వేసిన స్టూడెంట్స్ పిలిచి మీకు కనిపించినదాంట్లో తప్పు ఉంటే నిలదీయండి కానీ చాటుమాటుగా మాట్లాడకూడదు వ్యక్తిత్వం పడిపోతుంది. నిజాలు తెలుసుకుని మాట్లాడడం మనుషుల లక్షణం అని మరో క్లాస్ వేస్తాడు. పాండ్యన్ స్టూడెంట్స్ అందర్నీ పిలువు మనం ఇంపార్టెంట్ టాపిక్ పై మాట్లాడాలని చెబుతాడు. అప్పుడు సెమినార్ గురించి, పవర్ ఆఫ్ స్టడీస్ గురించి చెబుతాడు రిషి. అందరూ కాన్సెప్ట్ ని పొగుడుతారు. తక్కువ టైమ్ లో ప్రిపేర్ చేయాలి నాకు కొంతమంది వాలంటీర్స్ కావాలి మీలో ఎవరెవరు నాతో కలసి వర్క్ చేయడానికి ముందుకొస్తారని అడిగితే విద్యార్థులంతా రెడీ అంటారు. రిషికి గతంలో జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతాడు. గమనించిన పాండ్యన్ ఏమైందని అడిగితే ఏం లేదని మాటదాటేస్తాడు.
Also Read: ఈ సారి రెండు శ్రావణమాసాలు, మరి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు!
ఆ తర్వాత ఇంటికొచ్చిన రిషి హాల్లో ఉన్న వసు-ఏంజెల్ ని చూసి లోపలకు వెళ్లిపోతుంటాడు. పిలిచిన ఏంజెల్ వసుధార గాయానికి డ్రెస్సింగ్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కట్టు కట్టడమే కదా కట్టేయ్ అంటాడు. కాసేపు ఇద్దరూ వాదించుకుంటారు. ఇక చేసేది లేక డ్రెస్సింగ్ చేస్తాడు. కాసేపు మనసులోనే మాట్లాడుకుంటారు. ఇద్దర్నీ గమనిస్తుంటుంది ఏంజల్. థ్యాంక్స్ చెప్పవా అని ఏంజెల్ అంటే థ్యాంక్యూ సార్ అంటుంది. అక్కడి నుంచి లేచి రూమ్ లోకి వెళ్లిపోయిన రిషి...వసు గురించే ఆలోచిస్తాడు. దేనినుంచి దూరంగా పారిపోదాం అనుకున్నానో దానికే దగ్గర చేస్తున్నావ్ అని అనుకుంటాడు.
ఎపిసోడ్ ముగిసింది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

