అన్వేషించండి

Guppedanta Manasu July 5th: దరిచేరిన నెచ్చెలిపై దయచూపిన రిషి, మళ్లీ ఇంటికి చేరిన మహేంద్ర-జగతి!

Guppedantha Manasu July 5th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయాడు, జగతిపై మహేంద్ర కోపం కంటిన్యూ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

గుప్పెడంతమనసు జూలై 5 ఎపిసోడ్ (Guppedanta Manasu July 5th Written Update)

వసుధార బ్యాగ్ తీసుకుని బయలుదేరుతుంది. ఏంటి బ్యాగు పట్టుకున్నావ్ ఎక్కడికి వెళుతున్నావ్ అని అడుగుతుంది ఏంజెల్.
ఏంజెల్: మీ నాన్నగారు కూడా ఊరెళ్లారు మీ ఇంట్లో చూసుకునేందుకు ఎవ్వరూ లేరు నీకు కష్టం అయిపోతుంది, నీ గాయం కూడా మానలేదు, ఇంకా రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పారుకదా నువ్వైనా చెప్పు రిషి అంటుంది. ఈ పరిస్థితుల్లో కాలేజీకి వెళ్లడం అవసరమా
రిషి: బాగాలేనప్పడు కాలేజీకి వెళ్లి ఇబ్బంది పడేకన్నా ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోవడం మంచిదికదా ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను
ఇంతలో అక్కడకు వచ్చిన విశ్వనాథం వస్తాడు
విశ్వనాథం:ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం మంచిది. వసుధార నీ ఫ్రెండ్ మాత్రమే కాదు మన కాలేజీ లెక్చరర్ తనవల్లే కాలేజీ బాగుపడింది.  ఆరోగ్యం పూర్తిగా బాగయ్యే వరకూ ఇక్కడే ఉండాలి, మీ నాన్నగారు కాల్ చేసి మాట్లాడారు, అక్కడ పరిస్థితులు సెట్టయ్యేవరకూ రాలేనన్నారు అందుకే నువ్వు కాలేజీకి, ఇంటికి వెళ్లడానికి వీల్లేదు...నీకు ఏ రోజు పర్మిషన్ ఇస్తామో నువ్వు ఆరోజే ఈ ఇంటినుంచి బయటకు అడుగుపెట్టాలి అప్పటి వరకూ నువ్వు ఇక్కడే ఉండాలి...ఏమంటావ్ రిషి
రిషి: నేనూ అదే చెబుతున్నా సార్ పూర్తిగా రికవరీ అయ్యేవరకూ ఇక్కడే ఉండడం మంచిది
వసు: జాలితో చెబుతున్నారా ప్రేమతో చెబుతున్నారా అని మనసులో అనుకుంటుంది
రిషి: ఇది జాలి మాత్రమే అని తను అనుకుంటాడు
ఇంకోసారి నాకు చెప్పకుండా ఇలా లగేజీలు సర్దుకోవడం చేయొద్దని లోపలకు తీసుకెళ్లిపోతుంది ఏంజెల్..

Also Read: వెళ్లిపోతానంటున్న వసుని రిషి ఆపుతాడా, కొత్త స్కెచ్ వేసిన దేవయాని శైలేంద్ర!

గెస్ట్ హౌజ్ లో ఉన్న మహేంద్ర,జగతి, ఫణీంద్ర ముగ్గురూ మిషన్ ఎడ్యుకేషన్ గురించి చర్చించుకుంటారు. ఇంతకుముందులా ఈ ప్రాజెక్ట్ కొనసాగాలి అనుకుంటారు. ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇస్తాడు శైలేంద్ర. దేవయాని సూచనలు గుర్తుచేసుకుని డ్రామా స్టార్ట్ చేస్తాడు. 
శైలేంద్ర: మీరు రాలేదని నేను వచ్చాను
ఫణీంద్ర: వీళ్లతో పాటూ నేనుకూడా వర్క్ చేస్తున్నా..నువ్వెళ్లు నేను కూడా ఇక్కడే ఉంటాను
శైలేంద్ర: మీరంతా ఇప్పుడే రావాలి..మిమ్మీ మీకోసం ఆరాటపడుతోంది..అంత పెద్దిల్లు పెట్టుకుని గెస్ట్ హౌజ్ లో ఉండడం ఏంటి అందర్నీ తీసుకుని రా అని పంపించింది.మీరు రాకపోతే తనే ఇక్కడకు వస్తానంది..బాబాయ్ ప్లీజ్ రండి అని లేని ప్రేమ తెచ్చిపెట్టుకుంటాడు
ఫణీంద్ర: దేవయాని ఓ మాట అంటుందే కానీ మనం ఇంట్లో కనిపించకపోతే కంగారుపడుతుంది. మనం ఇంటికి వెళ్లకపోతే ఇక్కడకు వచ్చినా వచ్చేస్తుంది మనం ఇల్లు వదిలేసి ఇక్కడ ఉండడం బావోదు మహేంద్ర ఇంటికి వెళదామా
మహేంద్ర,జగతి ముఖాలు చూసుకుంటారు... జగతి మహేంద్రకి మెసేజ్ చేస్తుంది..వెళ్లిపోదాం లేదంటే శైలేంద్రకి మనపై అనుమానం వస్తుందని.. దీంతో సరే అంటాడు మహేంద్ర. హ్యాపీగా ఫీలైన ఫణీంద్ర పద అన్నయ్య అంటాడు..
ఇక్కడ వర్క్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నారా..ఏదైనా నాముందే చేయాలి..అది నేను స్పాయిల్ చేస్తుండాలి నువ్వు ఓడిపోయి నన్ను గెలిపించాలి అని క్రూరంగా నవ్వుకుంటాడు శైలేంద్ర...

Also Read: మహేంద్ర వాళ్ళ చెంతకి చేరిన ఫణీంద్ర- దాచినా దాగని రిషి ప్రేమ, ఎంతైనా జెంటిల్మెన్ కదా!

హాల్లో ట్యాబ్లెట్ బాక్స్ చూసి అసలు వేసుకుందా లేదా అని రిషి ఆలోచిస్తాడు.. ఏంజెల్ ని పిలిచి అదే విశయం అడుగుతాడు.  ఇంతలో వసుధార నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అక్కడ తూలి పడబోతుంది కానీ పట్టుకోబోయి ఆగిపోతాడు. ట్యాబ్లెట్స్ వేసుకుందా లేదా అని మీ ఫ్రెండ్ అని అడుగుతాడు. దీనికే ఇంత హడావుడి చేసి నన్ను పిలవాలా అదేదో తనకే చెబితే సరిపోతుంది కదా అంటుంది ఏంజెల్. 
వసు: సార్ మనసులో నాపై ప్రేమ ఉంది కానీ చెప్పరు
ఏంజెల్: మీరు వచ్చి ఇన్నాళ్లైంది...ఇద్దరూ మాట్లాడుకోవడం చూడలేదు..కొంపతీసి ఇద్దరి మధ్యా ఫ్లాష్ బ్యాక్ ఉందా ..గతంలో కూడా ఓసారి అడిగాను మళ్లీ అడుగుతున్నా..మీ తీరు చూస్తుంటే ఇద్దరి మధ్యా ఏదో ఉందనిపిస్తోంది
రిషి-వసు షాక్ అయి అలా నిల్చుండిపోతారు..
ఏంజెల్: రిషి ఏమీ మాట్లాడడు కానీ నువ్వైనా చెప్పు...రిషి నీ సీనియర్ అని నువ్వు రిజర్వ్ డ్ గా ఉంటున్నావా..నువ్వైనా చెప్పు
రిషి: మేడంకి నాకు మధ్య సమస్యలుండేంత పరిచయం లేదు..ఇక ఫ్లాష్ బ్యాక్ ఎందుకు ఉంటుంది..ట్యాబ్లెట్స్ టైమ్ ప్రకారం వేసుకోవాలి అప్పుడే తొందరగా నయం అవుతుంది
ఏంజెల్: ఇదికూడా నాకే చెబుతున్నావా...ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్.. 
జాగ్రత్త అనేసి రిషి వెళ్లిపోతాడు..ఏంటో ఇది అనుకుంటూ వెళ్లిపోతుంది ఏంజెల్.. వసుమాత్రం హ్యాపీగా ఫీలవుతుంది..

ఇంట్లో దేవయాని ఎదురుచూస్తూ ఉంటుంది.. శైలేంద్ర వాళ్లూ ఇంకా రాలేదేంటి మహేంద్రకి నిజం తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతుంటుంది. అది అబ్జర్వ్ చేసిన ధరణి దగ్గరకు వెళ్లి దేనిగురించో టెన్షన్ పడుతున్నట్టున్నారు అని అడుగుతుంది. అసలు నా సంగతి నీకెందుకు అని ఫైర్ అవుతుంది ధరణి. ఇంతలో కారు వస్తుంది. అందరూ ఇంటికి రావడం చూసి దేవయాని ప్లాన్ సక్సెస్ అయిందని ఫీలవుతుంది. ఎదురెళ్లి మరీ లేని ప్రేమ నటిస్తుంటుంది. హమ్మయ్య మీరు తిరిగొచ్చేశారు నాకు చాలా సంతోషంగా ఉందంటూ యాక్షన్ చేస్తుంది.  మహేంద్ర,జగతి,ధరణి ముగ్గురూ చికాకుగా మొహం పెడతారు. అయినా మీరు లేకపోతే ఇల్లు బోసిపోయినట్టుంది తెలుసా అని చెలరేగిపోతుంది..

ఎపిసోడ్ ముగిసింది

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget