Guppedanta Manasu July 1st: వసు విషయంలో ఏంజెల్ కి మాటిచ్చిన రిషి, ఇంట్లోంచి వెళ్లిపోయిన జగతి మహేంద్ర!
Guppedantha Manasu July 1st: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయాడు, జగతిపై మహేంద్ర కోపం కంటిన్యూ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గుప్పెడంతమనసు జూలై 1 ఎపిసోడ్
జగతిని ఇన్నాళ్లూ చాలా మాటలన్న విషయం గుర్తుచేసుకుని మహేంద్ర బాధపడతాడు. జగతి రాగానే సారీ చెప్పి హగ్ చేసుకుంటాడు.
మహేంద్ర: రిషిపై ప్రేమతో నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నిజం తెలిసిన క్షణం నుంచి నా గుండె తట్టుకోలేకపోతోంది నవ్వు ఇన్నాళ్లూ ఎలా ఉన్నావ్
జగతి: పరిస్థితులు ఎదుర్కోవాలి,తట్టుకోవాలి..అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలం
మహేంద్ర: చిన్నప్పుడు రిషిని వదిలేసినందుకు అమ్మా అనే పిలుపు కోసం తపించిపోయావు ఇప్పుడిలా చేశావ్ ఇక ఎప్పటికీ అమ్మా అని పిలవడేమో
జగతి: లేదు మహేంద్ర..రిషి నన్ను అమ్మా అని పిలిచాడని చెప్పి ...జరిగిన విషయం చెబుతుంది
మహేంద్ర: బాధ పడకు జగతి రిషి నిన్ను అర్థం చేసుకుంటాడు
జగతి: వసు వద్దని చెబుతున్నా అబద్ధపు సాక్ష్యం చెప్పించి విడగొట్టాను ఇప్పుడు ఇద్దరూ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో
మహేంద్ర: వసుధార అమ్మగారు చనిపోయారు
జగతి: తెలుసు మహేంద్ర కానీ ఈ విషయం నీకు చెప్పి బాధపెట్టడం ఎందుకని చెప్పలేదు
మహేంద్ర: వాళ్లిద్దరూ ఒకే కాలేజీలో లెక్చరర్స్ గా పనిచేస్తున్నారని అసలు విషయం చెబుతాడు. రిషికి ఇంకా వసుపై కోపం తగ్గలేదు ఇదంతా చక్రపాణి చెప్పారు
జగతి: రిషికి కోపం తగ్గాలి, మళ్లీ వాళ్లు ఇంటికి రావాలి డీబీఎస్టీ కాలేజీ బాధ్యతలు మళ్లీ చేపట్టాలి
మహేంద్ర: నా కొడుక్కి కీడు చేయాలనుకున్న మనుషుల మధ్య ఉండాలంటే కంపరంగా ఉంది. అన్నయ్య దగ్గర ఏదో రోజు బయటపడితే ఇబ్బంది అవుతుంది మనం ఇక్కడి నుంచివెళ్లిపోదాం
జగతి: నీ ఇష్టం జగతి..నువ్వు ఏం చెబితే అది చేస్తాను
మహేంద్ర: థ్యాంక్స్ జగతి..కాలేజీ గెస్ట్ హౌజ్ కి వెళ్లిపోదాం..అన్నయ్య వచ్చేలోగా..
Also Read: వసు మదిలో ఉన్నా గదిలోకి వెళ్లలేకపోతున్న రిషి, దేవయాని - శైలేంద్రకి షాకిచ్చిన మహేంద్ర
మరోవైపు విశ్వనాథం, ఏంజెల్ ఇద్దరూ బయటకు బయలుదేరుతారు. ఆ విషయం వసు-రిషికి చెబుతారు. రిషి గురించి చెబుతూ ఉంటుంది ఏంజెల్. నువ్వే పట్టించుకో సరే వసు వెళ్లొస్తాను అనేసి రిషి దగ్గరకు వెళ్లి బయటకు వెళుతున్నట్టు చెప్పి వసుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్లిపోతుంది.
మరోవైపు ఇంట్లోంచి బ్యాగులు తీసుకుని బయలుదేరుతారు మహేంద్ర-జగతి. వాళ్లని అలా చూసి దేవయాని,శైలేంద్ర షాక్ అవుతారు
దేవయాని: జగతి ఇద్దరూ ఎక్కడికి వెళుతున్నారు.
జగతి: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళతామని మినిస్టర్ గారికి మాటిచ్చాం కదా
దేవయాని: మళ్లీ ఎప్పుడొస్తారు
మహేంద్ర: ఇక మళ్లీ రాం..మనకు సాయంగా ఉన్నవాళ్ల మధ్యలో ఉంటే మంచిది కదా..అదే మిషన్ ఎడ్యుకేషన్ పనులను సవ్యంగా చేయగలం
జగతి: మాకు మా కొడుకు ఆశయం ముఖ్యం..ఈ సొసైటీకి తను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అందించాడు దాన్ని కొనసాగించాడు
దేవయాని: మీ అన్నయ్య వచ్చాక వెళ్లండి
మహేంద్ర: మీరు టెన్షన్ పడకండి అన్నయ్యకు నేను కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పి..ధరణి జాగ్రత్తమ్మా అని చెప్పేసి జగతి-మహేంద్ర వెళ్లిపోతారు
శైలేంద్ర: బాబాయ్ నీకెందుకు జాగ్రత్తలు చెబుతున్నాడు
ధరణి: అయినవాళ్లకి జాగ్రత్తలు చెప్పకూడదా
దేవయాని-శైలేంద్ర: మహేంద్రకి నిజం తెలిసి ఉంటే మౌనంగా ఉండడు, ఇల్లంతా రచ్చ చేస్తాడు నిలదీస్తాడు నువ్వు టెన్షన్ పడొద్దని శైలేంద్రకి సర్దిచెబుతుంది. వాళ్లు ఎందుకు బయటకు వెళ్లినా ఈ అవకాశాన్ని వాడుకోవాలి అనుకుంటారు
Also Read: జూలై మొదటి రోజు ఈ రాశివారికి శని అనుగ్రహం, ఆ రాశులవారికి బ్యాడ్ న్యూస్
వంటగదిలోకి వెళ్లిన ధరణి..అత్తయ్య, మా ఆయన శైలేంద్ర ఇద్దరూ ఇంత దారుణంగా ఉంటారని ఊహించలేదని తనలో తాను మాట్లాడుకుంటుంది. ఇంతలో వచ్చిన ఫణీంద్ర కోర్టులో ఫేవర్ గా తీర్పు వచ్చిందని చెబుతూ మహేంద్ర అని సంతోషంగా పిలుస్తాడు.మహేంద్ర ఇంట్లోంచి వెళ్లిపోయిన విషయం తెలుసుకుని దేవయానిపై ఫైర్ అవుతాడు.
ఫణీంద్ర: అసలు ఇంట్లో ఏం జరుగుతోంది జగతి వెళ్లిపోయింది తిరిగివచ్చింది, అంతా కలసి హ్యాపీగా ఉండొచ్చంటే రిషి వెళ్లిపోయాడు, ఇప్పుడు వీళ్లు వెళ్లిపోయారు, రిషిపై నింద వేసింది ఎందుకో చెప్పమంటే చెప్పనంటోంది, అసలు రిషి వెళ్లిపోవడానికి కారణం మీకు తెలుసా అని దేవయానిని గద్దిస్తాడు. అమ్మా ధరణి నీకేమైనా తెలుసా అని స్ట్రాంగ్ గా అడుగుతాడు ఫణీంద్ర. ధరణి ఎక్కడ చెప్పేస్తుందో అని శైలేంద్ర కళ్లతోనే బెదిరిస్తాడు. ధరణి నోరు తెరిచేలోగా నాకే తెలియదు నీకేం తెలుస్తుందిలే.. ఒకవేళ వాళ్లు వెళ్లిపోవడానికి కారణం మీరే అని తెలిస్తే వేరేలా ఉంటుందని బెదిరించి వెళ్లిపోతాడు.
ఫణీంద్ర వెళ్లిపోగానే శైలేంద్ర ధరణిపై ఫైర్ అవుతాడు.. నాది ముట్టబుర్ర కదా ఎప్పుడెలా ఉండాలో తెలియదులెండి అనేసి వెళ్లిపోతుంది.
దేవయాని: ఇప్పుడు మీ నాన్న మహేంద్ర దగ్గరకు వెళ్లారు కదా..ఇద్దరి మధ్యా గొడవ జరిగి విడిపోతారు అప్పుడు కాలేజీ మనసొంతం అవుతుంది. ఒకవేళ వాళ్లు వస్తే అనుక్షణం గమనిస్తూ వాళ్ల పనికి అడ్డుతగలొచ్చు..మన కల నెరవేరుతుంది