చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఇప్పటి జనరేషన్ కి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇందులో భాగంగా అసలు తెవివైన వారికి శత్రువులు ఎందుకుండరు అనే విషయంపై చాణక్యుడు చాలా స్పష్టంగా చెప్పాడు.
తెలివైన వ్యక్తికి శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే విశిష్ట లక్షణం ఉంటుదట. వాస్తవానికి ఓ వ్యక్తి ప్రవర్తనే తెలివైనవాడా కాదా అనే అంశాన్ని నిర్ధరిస్తుందన్నాడు.
ఇతరుల చేతిలో ధనం ఉంటే మనకు ఉపయోగం ఎలా ఉండదో, అలాగే విజ్ఞానం కూడా పుస్తకాల్లో బంధీ అయిపోతే ఎవరికీ మంచి జరగదని అన్నాడు. తెలివైనవాడు తన తోటివారికి తగిన గౌరవం ఇస్తాడు
సాధారణ మనిషికి జీవితంలో కొన్ని విషయాలపై మాత్రమే నియంత్రణ ఉంటుంది. చాలా విషయాల్లో ఇతరుల సహాయం లేనిది ముందుకు సాగలేడు. కానీ తెలివైవాడు పెట్టుకున్న టార్గెట్ చేరుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాడు.
వ్యక్తులు కొన్ని సందర్భాల్లో తమ అహం, శౌర్యం, ఆత్మగౌరవం, అందం పట్ల ఆకర్షణతో ఆయోమయానికి గురవుతారు. ఇలాంటి సందర్భంలో తనకు అవసరమైంది ఏంటో అవగాహన చేసుకుని సమస్య నుంచి బయటపడటానికి తెలివైన వ్యక్తి ప్రయత్నిస్తాడు.
సమస్యలు ఎదురైనప్పుడు అహాన్ని పక్కనబెట్టి వాటిని పరిష్కరించుకోవాలట. ఏదైనా పని చివరి దశలో ఉన్నప్పుడు ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఆ పని వల్ల ముప్పు తొలగిపోయినా అది ఎందుకు ఎదురయిందో తెలుసుకోవాలి. అనుచిత వ్యాఖ్యలు, అసందర్భ ప్రేలాపనతో విలువైన సమయాన్ని వృథా చేయరాదు.
ప్రతి అంశాన్ని ప్రతిష్టకు ముడిపెట్టి కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు కొందరు. అసలు ప్రతిష్ట అంటే ఏంటో తెలుసుకోవాలి. అహానికి మరో రూపమే ప్రతిష్ట కాబట్టి దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటాడు చాణక్యుడు.
అనవసర విషయాలతో కాలయాపన చేసి టన్నుల కొద్దీ కాలం, శక్తిని వృథా చేసుకోకుండా అద్భుతాలు సృష్టించడానికి ప్రయత్నించండి.
తెలివైన వ్యక్తి పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు. వాటిపైనే మనసు కేంద్రీకరించి పక్కన జరిగే అనవసరమైన విషయాల గురించి పట్టించుకోడు. Images Credit: Pinterest