తెలుగు నెలలో ప్రతి నెలకు ఓ పౌర్ణమి, ఓ అమావాస్య ఉంటాయి. అంటే నెలకో పౌర్ణమి చొప్పున ఏడాదికి 12 పౌర్ణమిలు వస్తాయి.
వెయ్యి పున్నమిలు చూడాలంటే..సహస్రచంద్రదర్శనం జరగాలంటే ఓ వ్యక్తి 82 లేదా 83 ఏళ్లు బతకి ఉండాలి. ఇలా వెయ్యి పున్నములు చూసిన వారు మనదేశంలో చాలామంది ఉన్నారు.
దేశాన్ని పాలించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా రికార్డ్ క్రియేట్ చేసిన మాజీ ప్రధాని వాజ్‌పేయి ‘సహస్ర చంద్రన్ దర్శన్’ 2006లో పూర్తి చేసుకున్నారు. అంతకు ముందు RSS మాజీ చీఫ్ రజ్జూ భాటియా కూడా సహస్ర చంద్ర దర్శన్ పూర్తి చేసుకున్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం 77 ఏళ్ల 7 నెలల 7 రోజుల వయసులో అడుగుపెట్టిన వారికి భీమ్ రథారోహణ్ నిర్వహిస్తారు
88 ఏళ్ల 8 నెలల 8 రోజుల వయసులో అడుగుపెట్టిన వారికి దేవ రథారోహణ్ నిర్వహిస్తారు
99 ఏళ్ల 9 నెలల 9 రోజుల వయసు వారికి దివ్య రథారోహణ్ నిర్వహిస్తారు
సహస్ర చంద్ర దర్శన్‌ను ఉత్తర భారతం, నేపాల్, కర్ణాటక, ఏపీల్లోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు.
పురుషులకు 60 సంవత్సరాల వయసులో షష్టిపూర్తి చేస్తారు. 80 సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శన శాంతి నిర్వహిస్తారు. వాస్తవానికి 50 ఏళ్లు నిండినప్పటి నుంచీ ప్రతి ఐదేళ్లకు ఏదో ఒక హోమం, శాంతి జరపించాలంటారు పండితులు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు