చాణక్య నీతి: మీ ఎదుగుదల పతనాన్ని ఈ ముగ్గురు నిర్ణయిస్తారు



ఎవరి జీవితంలో అయినా ఎదుగుదల, పతనం వారి ఈ ముగ్గురిపై ఆధారపడి ఉంటుందంటాడు ఆచార్య చాణక్యుడు



సంసారత్పాదగ్ధానం త్రయో శబాణహేతవః.
అపత్యం చ కలత్రం చ సతతం సదారేవ చ||



తెలివైన జీవిత భాగస్వామి
సుఖ దుఃఖాలలో ఒకరికొకరు తోడునీడగా నిలిచే భార్యాభర్తలు ఎలాంటి కష్టం వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తారు. కష్ట సమయాల్లో, మనతో న‌డిచే జీవిత‌ భాగస్వామిని కలిగి ఉండటం అదృష్టం.



సంస్కారవంతులైన, అవగాహన ఉన్న భాగస్వామి సహాయంతో, ఎవరైనా ఖచ్చితంగా విజయాల మెట్లు ఎక్కగలరని సూచించాడు చాణక్యుడు



మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు
సత్ప్రవర్తన కలిగిన పిల్లలు తమ తల్లిదండ్రులకు దుఃఖం కలిగించరు. పైగా ఏ సమస్య ఎదురైనా అండగనా నిలబడతారు. కన్నవారి సమస్యను తమ సమస్యగా భావిస్తారు



మంచి స్నేహితులు
మంచి వ్యక్తులతో సాంగత్యం అడుగడుగునా ఆకాశమంత ఎత్తుకు చేరేలా స్ఫూర్తినిస్తే చెడ్డవారి సాంగత్యం మీ మేధస్సును మందగింపజేసి మిమ్మల్ని వినాశనపు అంచులకు చేర్చుతుంది



సత్ప్రవర్తన గల భార్య, సత్ప్రవర్తన కలిగిన పిల్లలు, కష్టకాలంలో అండగా నిలిచే స్నేహితులను పొందిన వ్యక్తి నిజంగా అదృష్టవంతుడని ఆచార్య చాణక్యుడు బోధించాడు



Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.



Images Credit: Pinterest