Guppedanta Manasu April 29th: అర్థరాత్రి రిషిధార రొమాంటిక్ చాటింగ్, ధరణికి చుక్కలు చూపిస్తోన్న శైలేంద్ర!
Guppedantha Manasu April 29th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గుప్పెడంతమనసు ఏప్రిల్ 29 ఎపిసోడ్
తాతగారి తర్వాత డీబీఎస్టీ కాలేజీలో చైర్మన్ స్థానం మీ నాన్నకి దక్కాలి లేదంటే నీకు దక్కాలి..కానీ రిషిని కూర్చోబెట్టారు..కానీలే ఏదో నడిపిస్తాడు అనుకుంటే దాన్ని ఓ సామ్రాజ్యంగా మార్చాడు..రిషి మాటకి ఎదురుచెప్పేవారు లేరు..ఇదంతా చూస్తుంటే నా గుండె మండిపోతుంది. కళ్లలో కోపం, మనసులో బాధ పెట్టుకుని వాళ్లపై ప్రేమ నటించడం నా వల్ల కావడంలేదు. నీకు దక్కాల్సినవన్నీ తనకి దక్కకూడదు..అందుకే నువ్వు రిషి స్థానంలో కూర్చోవాలి...నువ్వు డీబీఎస్టీ కాలేజీకి చైర్మన్ కావాలి
శైలేంద్ర: నీ కోరిక తీరదు..
దేవయాని: అదేంటి నాన్నా...
శైలేంద్ర: నేను వెళ్లి అక్కడ కూర్చోవడం ఏంటి..వాళ్లంతట వాళ్లే నాకు కట్టబెట్టాలి..వాళ్లంతట వాళ్లే నాకు ఇచ్చేలా చేస్తాను..దటీచ్ శైలేంద్ర భూషణ్
దేవయాని: నాకన్నా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్..ఇప్పుడు ఆనందంగా ఉంది..ఎలాగైనా కాలేజీలో చక్రం తిప్పాలి నువ్వు...
ఇంతలో అన్నయ్యా అంటూ రిషి ఎంట్రీ ఇవ్వడంతో ఇద్దరూ షాక్ అవుతారు.. పెద్దమ్మా మీరుకూడా ఉన్నారా అంటాడు రిషి..
దేవయాని: పర్లేదు నాన్నా అన్నయ్యతో మాట్లాడాలని వచ్చావు కదా రా అనేసి..నేను వెళతాను అంటుంది
రిషి: పెద్దమ్మా మీరు వెళ్లాల్సిన అవసరం లేదు..కూర్చోండి..ఏంటన్నయ్యా ఫారెన్ సంగతులు
శైలేంద్ర: నాగురించి ఏముందిలే రిషి..నువ్వే చెప్పాలి కాలేజీ విషయాలు..
రిషి: నువ్వు వచ్చి చూడు అన్నయ్యా తెలుస్తుంది
శైలేంద్ర: నన్ను వచ్చి పాఠాలు నేర్చుకోమంటావా..చెప్పమంటావా
రిషి: అది మన కాలేజీ..నువ్వురేపు వచ్చికచ్చితంగా కాలేజీ చూడాల్సిందే.. ఇంకా మంచిగా ఏం చేయాలి అనేది నువ్వే చెప్పాలి.. నీకున్న నాలెడ్జ్ మన కాలేజీకి అవసరం..
శైలేంద్ర: నాకు ఇష్టంలేదు కానీ నువ్వు రమ్మన్నావని వస్తున్నాను...
రిషి: మార్నింగ్ రెడీ అవ్వు..ఇద్దరం కలసి కాలేజీకి వెళదాం... గుడ్ నైట్ అనేసి రిషి వెళ్లిపోతాడు..
Also Read: వసు కోసం అనుక్షణం పరితపిస్తున్న రిషీంద్ర, ధరణిని అడుగడుగునా అవమానిస్తున్న శైలేంద్ర
ధరణి వంటగదిలో కూర్చుని ఏదో ఆలోచిస్తుంటుంది..జగతి-వసు ఇద్దరూ తన గురించి మాట్లాడుకుంటారు
జగతి: శైలేంద్ర అంటే తనకు చాలా ఇష్టం..ఈ రోజు తను వచ్చిన ఆనందం ధరణి కళ్లలో కనిపించడం లేదు
ధరణి: తన మనసులో బాధ చెప్పరు..అడిగినా మాటదాటేస్తారు..
జగతి: శైలేంద్ర-ధరణి మధ్య సఖ్యత లేదనుకుంటా..అందుకే అలా ఉంది
ఇదంతా విన్న శైలేంద్ర..వీళ్లంతా నన్ను గమనిస్తున్నారన్నమాట..నేను జాగ్రత్త పడకపోతే ప్రమాదంలో పడిపోతాను అనుకుంటాడు.. ధరణి అంటూ లేని ప్రేమ ఒలకబోస్తూ కావాలని హడావుడి చేస్తాడు...
శైలేంద్ర: నేను నీతో సరదాగా టైమ్ స్పెండ్ చేద్దాం అనుకుంటే నువ్వెప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటావు..ఇలా అయితే ఎలా ధరణి..కొంచెం నా మనసు కూడా అర్థంచేసుకోవాలి కదా..ముందుగా అగ్రిమెంట్ ఎందుకు పూర్తిచేసుకుని వచ్చానో తెలుసా నీకోసం ధరణి...
ధరణి ఆనందంగా కనిపించేలోగా..ఏంటి ఆనందపడతున్నావా..నేను వచ్చాక కూడా నువ్వు ఇలా ఉంటే అందరూ నన్ను అనుకుంటారు.. అందుకే సంతోషంగా ఉన్నట్టు మ్యానేజ్ చేయి..నేను నిన్నేమి కొట్టడం లేదు కదా ఎందుకు మొహం అలా పెడతావ్..మరీ అంత మొద్దు మొహం పెట్టకు..ఫేస్ లో స్మైల్ మెంటైన్ చేయి..వెనుక పిన్నీ వాళ్లున్నారంటూ..తెచ్చిపెట్టుకుని మాట్లాడతాడు...
త్వరగా పని పూర్తిచేసుకుని గదిలోకిరా అనేసి..బయటకు వచ్చి..కావాలని జగతి వాళ్లను పిలిచి..కొంచెం ధరణికి చెప్పండి..నేను ఎంత ప్రయత్నించినా నాకు అనుగుణంగా ఉండడం లేదు..తను పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి కావొచ్చు మరీ వంటింటి కుందేలులా ఉంటే ఎలా అంటూ తననుంచి నాకు సరదా లేదు..వసుధారా నువ్వు రోడ్డుమీద నాతో ప్రవర్తించిన తీరు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది ధరణికి కూడా నేర్పించవచ్చుకదా
వసు: కొందరికి మనం ఎంత నేర్పించాలి అనుకున్నా వాళ్లని మార్చలేం..వాళ్లకి వాళ్లుగా అన్నీ తెలుసుకోవాలి..మారాలి..
శైలేంద్ర: ఈ మాటతీరే నాకు ఇష్టం..ధరణిఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను..ధరణి నన్ను త్వరగా అర్థం చేసుకుంటే బావుంటుంది అనేసి వెళ్లిపోతాడు...
Also Read: వాస్తు ప్రకారం ఈ మూలలు పెరిగిన స్థలాలు అస్సలు కొనకూడదు
అటు రిషి రూమ్ లో కూర్చుని బుక్ ఓపెన్ చేస్తే అందులో వసుధార కనిపిస్తుంటుంది... వసుధరాని చూడాలని ఉంది అనుకుంటూ రూమ్ వరకూ వెళ్లి.. ఈ టైమ్ లో వద్దులే అనుకుని ఆగిపోతాడు. ఫోన్లో ఫొటో చూస్తూ మిస్ యూ అనుకుంటాడు. మెసేజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ మెసేజ్ పెడతాడు..
రిషి: ఏం చేస్తున్నావ్
వసు: నిద్రపోవాలని రెప్పలు మూశాను సార్..కానీ..మనసు మూతపడలేదు
రిషి: ఎందుకో అలా
వసు: ఏవో ఆలోచనలు మనసులో అలా తిరుగుతున్నాయి ఎండీ గారు
రిషి: ఏంటా ఆలోచనలు
వసు: అర్థంకానివి..అంతులేనివి..వాటి గురించి ఇంకా లోతుగా ఆలోచిస్తే తెల్లవార్లూ జాగారం చేయాల్సి వస్తుంది సార్ వదిలేయండి.. మరి మీరెందుకు మేల్కొని ఉన్నారు సార్
రిషి: నాక్కూడా నిద్ర పట్టడం లేదు
వసు: ఎందుకో నాకు తెలుసు
రిషి:ఎందుకు
వసు: ఎందుకంటే..మీ అన్నయ్య వచ్చారు కదా ఆ సంతోషంలో మీకు నిద్రపట్టడం లేదు..ఆ విషయం నాకు అర్థమవుతోంది సార్
రిషి: నా సంతోషం నీకు అర్థమైంది కదా అందుకే నీకు నిద్రపట్డడం లేదని రిప్లై ఇస్తాడు
ఇంతలో రూమ్ డోర్ తీసుకుని బయటకు వస్తుంది వసుధార... ఫోన్ చూసుకుంటూ.. జగతి ఎదురుపడి ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది.. జగతి: టెర్రస్ మీద ఇప్పుడు చంద్రుడితో కబుర్లా అని సెటైర్ వేస్తుంది..
ధరణి చాప దిండు పట్టుకుని భయంభయంగా నడుచుకుంటూ రూమ్ లోకి వెళ్లడం చూస్తారు వసు-జగతి... వసు వెళ్లేలోగా ఇది మాట్లాడేసమయం కాదు నువ్వు గదిలోకి వెళ్లు అంటుంది జగతి...అడిగితేనా కదా తెలుస్తుందని వసు అనడంతో...ఇంకెప్పుడూ ఇలాంటి విషయంలో తొందరపడొద్దంటుంది...