Guppedanta Manasu April 27th: అప్పుడే మొదలెట్టేసిన శైలేంద్ర, రిషిధార మధ్య మొదలైన డిస్కషన్, ధరణికి కొత్త కష్టాలు!
Guppedantha Manasu April 27th Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
గుప్పెడంతమనసు ఏప్రిల్ 27 ఎపిసోడ్
భర్త రాకతో ఆనందంతో ధరణి ఉబ్బితబ్బిబ్బై అవుతుంది. అయితే శైలేంద్రలో మాత్రం ధరణిపైఎలాంటి ఇంట్రెస్ట్ కనిపించడం లేదు. కాఫీ కప్పుతో ధరణి శైలేంద్ర రూమ్‌లోకి రాగా.. వచ్చేటప్పుడు తలుపు వేయాలని తెలియదా అంటూ గద్దిస్తాడు. సిగ్గుపడుతూ ధరణి తలుపేస్తుంది. చేతిలో కాఫీ కప్పు తీసుకుని చాలా బాగుంది.. నువ్వు కూడా బాగున్నావ్ అంటూ రొమాంటిక్‌గా మాట్లాడతాడు శైలేంద్ర...ధరణి మురిసిపోతుండగా..ఇంతలో ఏంటి అవతాం అంటూ గట్టిగా అరుస్తాడు శైలేంద్ర. అప్పటి వరకూ తను కలలో ఉన్నానని ధరణికి అర్థమవుతుంది. ఈ అవతారంలో ఉంటే తనకు నచ్చనది, తాను ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వనని అంటాడు. అంతేకాకుండా కాఫీ పెట్టడం తప్ప ఏమి చేతకాదని ధరణిపై సీరియస్ అవుతాడు. ఇంతలో దేవయాని ఎంట్రీ ఇచ్చి..శైలేంద్రతో పాటు దేవయాని కూడా మొదలెడుతుంది. ధరణి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో జగతి-మహేంద్ర ఇద్దరూ బయటకు వస్తూ.. ధరణిని గమనించి ఏంటి ఇలా ఉంది అనుకుంటారు.
Also Read: రిషిని చూసి కుళ్లుకుంటున్న దేవయాని కొడుకు, ఇకపై రిషిధార Vs శైలేంద్ర
వసుధార రావడంతో ఏమైంది ఇంత ఆలస్యం అయిందని కంగారుగా అడుగుతాడు..
వసుధార: ఆసుపత్రికి వెళ్లడం వల్ల లేటైందంటూ..శైలేంద్రతో జరిగిన గొడవ గురించి చెబుతుంది. ఆ పొగరుబోతును చూస్తే భూమి మీద ఇలాంటి మనుషులు కూడా ఉంటారా...మళ్లీ అలాంటి మనిషిని చూడకూడదు అంటుంది..ఇంతలో దేవయానితో కలసి శైలేంద్ర వస్తాడు...
శైలేంద్రను చూసి వసుధార షాక్ అవుతుంది
రిషి: శైలేంద్రను వసుకు పరిచయం చేస్తాడు.
శైలేంద్ర: రిషి లైఫ్‌లోకి వచ్చింది ఈ అమ్మాయా అంటూ వ్యంగ్యంగా మాట్లాడతాడు. రోజూ మా అమ్మ నీ గురించి చెబుతుంది. ఇప్పటికే నా గురించి చెప్పేశావా బ్యాడ్ గా అంటూ మొదలుపెట్టి..నేనేదో కంగారులో క్యాబ్ డ్రైవర్‌ను తొందరగా వెళ్లమని చెప్పాను.. అతడు ఓ యాక్సిడెంట్ చేశాడు. అదేదో నేను చేసినట్లు ఈవిడ గారు నాపై గొడవకు దిగింది
వసు: సారీ సర్
రిషి: ఎవరైనా కావాలని యాక్సిడెంట్ చేయరు కదా
శైలేంద్ర: అయితే తప్పు ఒప్పుకుంటున్నావా...
రిషి: నువ్వెవరో తెలియక ప్రమాదం జరిగిందనే హడావిడిలో నీతో గొడవకు దిగుంటుంది అన్నయ్య
శైలేంద్ర: నిజమే.. కానీ యుద్ధం ఆరంభించే ముందు అన్ని తెలుసుకోవాలని కదా..
దేవయాని: తనకు దూసుకుపోవడమే కానీ.. చూసుకోవడం అలవాటు ఉండదు
వసుధార అక్కడి నుంచి వెళ్లిపోతుంది.. వెనుకే వెళ్లిన జగతి ఏం జరిగిందని అడిగితే.. ప్రాణం పోయేంత యాక్సిడెంట్ చేసి.. ఇక్కడ ఏమి జరగనట్లు, అదేదో చిన్న విషయంలా మాట్లాడుతున్నాడని చెబుతుంది. పైగా నన్ను రియాక్ట్ అవ్వొద్దని చెబుతున్నాడు. అప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు..కానీ తెలిసినా ఇలాగే చేసేదాన్ని కదా మేడమ్ అంటూ
జగతి: అవన్నీ వదిలేయ్ వసు, నేను నీ ఎమోషన్‌ను అర్థం చేసుకోగలను..నువ్వు రిషి సంతోషంగా ఉంటే చాలు
శైలేంద్ర.. అందరికీ గిఫ్ట్‌లు తీసుకొచ్చానని ఇస్తుంటాడు. అయితే ధరణికి ఏం తీసుకొచ్చావ్ అని రిషి అడిగితే తనకు మాత్రమే రూమ్ లో ఇస్తానంటాడు. ఆమెకు ఏం ఇవ్వాలో నాకు తెలుసు..అందరి ముందు ఇవ్వను..ఇది మీకు తెలియాల్సింది కాదంటాడు. ఆ తర్వాత ఎవరికి వారు వెళ్లిపోతారు.. ఆ తర్వాత వసుధార నడుచుకుంటూ వెళ్తుండగా.. సోఫా తగిలి పడిపోబోతుంది...వెనుకే ఉన్న రిషి పట్టుకుంటాడు..
వసు: నేను ఏమైనా మనుషులను అంచనా వేయడంలో తప్పుచేస్తున్నానా
రిషి: కొన్నిసార్లు మనుషుల్ని అంచనా వేయడంలో తప్పు చేస్తావ్
వసు: అన్నిసార్లు తప్పుగా అంచనావేయాలని లేదుకదా
రిషి: మొదటిసారి కలుసుకున్నప్పుడు ఏమనుకున్నావో చెప్పు
వసు: గతంలోకి వెళ్లి తను తిట్టుకున్న విషయాన్ని చెప్పకుండా అవన్నీ ఇప్పుడెందుకులే సార్ అంటుంది. మరి మీరు ఏమనుకున్నారు
రిషి: పొగరు ..నిజానికి నేను నిన్ను ఏమీ అనుకునే ఛాన్స్ ఆ రోజు లేదు...ఆ తర్వాత నువ్వు కాలేజీకి వచ్చినప్పటి నుంచీ ఈ రోజు వరకూ కూడా నేను పొగరు అనే అనుకుంటాను...
వసు: ఆ పొగరు..ఈ పొగరు ఈ జెంటిల్మెన్ పక్కనే ఉంది..
రిషి: ఎప్పటికీ ఇలాగే ఉంటాం
వసు: మనిద్దరం ఇలా ఉండడానికి కారణం అయినా అమనిషి పిలుపు కోసం ఎదురుచూస్తోంది..
రిషి: నాకు ఇష్టం లేని ప్రశ్నలు అడుగుతూ నీ కిష్టం లేని సమాధానాలు వింటూ జీవితంలో చాలా ముందుకి వచ్చేశాం..ఈప్రశ్నకు సమాధానం కావాలంటే మనం చిన్నతనానికి వెళ్లాలి
Also Read: ఏప్రిల్ 27 రాశిఫలాలు, ఈరాశివారు సలహాలు ఇవ్వడం మానేసి మీ పని మీరు చేసుకుంటే మంచిది!
ఇంతలో జగతి వచ్చి భోజనానికి పిలవడంతో అందరూ వెళతారు..అన్నీ రెడీ అయ్యాయా అని జగతి అడిగితే..అంతా సిద్ధం చేశానంటుంది ధరణి. జగతి: ఉదయం ఏంటి డల్ గా ఉన్నావు..నిజం చెప్పు అక్కయ్య ఏమైనా అందా.. శైలేంద్ర వచ్చాడు కదా సంతోషంగా ఉండాలి కదా
ధరణి కన్నీళ్లతో ఏదో చెప్పేలోగా..దేవయాని పిలుస్తుంది..
జగతి: నువ్వెళ్లి శైలేంద్రనుభోజనానికి పిలు
దేవయాని: ఇక్కడ నేనున్నాను కదా ఎవరు ఏం చేయాలో నేను చెబుతాను అంటూ..నువ్వెళ్లి అబ్బాయిని రమ్మను అని ధరణిని పంపిస్తుంది..
ధరణి వద్దకు వచ్చిన జగతి, వసు.. భోజనం ఏర్పాట్లు పూర్తయ్యయా? అని అడగ్గా.. అయ్యాయని ధరణి చెబుతుంది. అలాగే ఉదయం ధరణి డల్‌గా ఉండటాన్ని కూడా ప్రశ్నించగా..అదేం లేదని ధరణి అంటుంది. అదేమి లేదు నిజం చెప్పు.. అక్కయ్య ఏమైనా అనిందా? అని మరోసారి ప్రశ్నిస్తుంది. ఇంతలోనే దేవయాని సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. శైలేంద్రను భోజనానికి పిలవమని ధరణికి పురమాయిస్తుంది. ఆమె పొద్దున శైలేంద్రతో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ భయంగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఎపిసోడ్ ముగిసింది...