Guppedanta Manasu April 26th: రిషిని చూసి కుళ్లుకుంటున్న దేవయాని కొడుకు, ఇకపై రిషిధార Vs శైలేంద్ర
Guppedantha Manasu April 26th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు ఏప్రిల్ 26 ఎపిసోడ్
డీబీఎస్టీ మెడికల్ కాలేజ్‌కు పర్మిషన్ రావడంపై రిషి ఆనందిస్తాడు కానీ..బయటకు వచ్చాక ఇదంతా చెప్పకుండా చేశారేంటని మండిపడతాడు. ముగ్గుర్నీ వదిలేసి ఇంటికెళ్లిపోతాడు. రిషిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థంకాక జగతి మహేంద్ర కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న రిషి మళ్లీ అదే విషయంపై ఆలోచిస్తాడు. ఇంతలో జగతి-మహంద్ర ఇంటికి చేరుకుంటారు..రిషిని చూసి ఇప్పుడు మాట్లాడకపోవడమే మంచిది అనుకుంటూ వెళ్లిపోదాం అనుకుంటార..ఇంతలో రిషి పిలుస్తాడు...
రిషి: థ్యాంక్స్ మేడం అసాధ్యం అనుకున్న మెడికల్ కాలేజీ పర్మిషన్ పదిరోజుల్లో తీసుకొచ్చారు..మన కాలేజీ పరువు, ఇంటి పరువు కూడా నిలబెట్టాకు..
జగతి -మహేంద్ర: ఇద్దరూ మురిసిపోతారు...నువ్వు అర్థం చేసుకున్నావ్ చాలు రషీ అని జగతి అంటుంది..రిషి వెళ్లిపోగానే ... మన కొడుకు బంగారం కదా.. ఎంత కోపంలో ఉన్నా వెంటనే అర్థం చేసుకుని మాట్లాడతాడు అంటాడు మహేంద్ర
సౌజన్యరావు.. తన బాస్‌కు ఫోన్ చేస్తాడు. డీబీఎస్టీ కాలేజ్‌ను ఎంఎస్ఆర్ కాలేజ్‌లో కలుపుదామనుకున్న మన ప్లాన్ ఫెయిల్ అయిందని చెబుతాడు. ఎప్పడో జరిగిన విషయాన్ని కొత్తగా చెబుతున్నావ్, ఇక నన్ను విసిగించకు అని మండిపడి కాల్ కట్ చేస్తాడు.
Also Read: జగతి-వసుపై ఫైర్ అయిన రిషి, సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కొత్త క్యారెక్టర్ దేవయాని కొడుకేనా!
మరోవైపు మహేంద్ర-జగతీ-రిషి.. వసు ఇంకా రాలేదని ఆందోళన చెందుతుంటారు. ఫోన్ కూడా తీయడం లేదేంటి అనుకుంటారు. ఇంతలో వసుధార రిషి సార్ కి కాల్ చేయాలి అనుకుని ఫోన్ తీస్తుంది..ఆల్రెడీ మిస్స్ డ్ కాల్స్ చూసి నేనంటే ఎంత ప్రేమో అనుకుంటూ కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన రిషి గబగబా క్వశ్చన్స్ వేస్తాడు...సోరీ సార్ నేను ఇంటికే వస్తున్నాను అంటుంది. ఇంతకీ ఏం జరిగిందని రిషి అంటే... ఈ రోజు ఓ బ్యాడ్ మ్యాన్ ని చూశాను తను మీకు అస్సలు నచ్చడు..ఇంటికి వచ్చాక వివరాలన్నీ చెబుతానంటూ కాల్ కట్ చేస్తుంది.
దేవయానికి క్యాలెండర్ చూస్తూ..ఈ శూన్యమాసం ఎన్ని రోజులు ఉంది అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ధరణి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగగానే.. ధరణి వెళ్లి తీస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. శైలేంద్ర భూషణ్ ఎంట్రీ ఇస్తాడు. సౌజన్యరావు బాస్ ఎవరో కాదు దేవయానికి కొడుక శైలేంద్రేనని ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. దేవయాని తన కొడుకును చూసి సంతోషిస్తుంది. మహేంద్ర.. జగతిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. భర్త వచ్చిన ఆనందంలో ధరణి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. పెద్ద హడావుడి చేసేస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు...
ధరణి...లగేజ్ తీసుకెళ్లి రూమ్ లో పెట్టి తనలో తాను ఆనందపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది..ఇదంతా చూసిన రిషి..ధరణిని తీసుకుని హాల్లోకి వస్తాడు
రిషి: వదిన ఇన్నాళ్లూ ఒంటరిగా ఫీలైంది..నువ్వు ఇచ్చిన స్వీట్ సర్‌ప్రైజ్ వదినకు తెగ సంతోషపడుతుంది..
ఫణీంద్ర: ఈ రోజు ధరణి కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నాను. ఆడపిల్లకు ఆస్తులు ముఖ్యంకాదు..భర్త పక్కనుండడమే ఆనందం ఉంది. నువ్వు ఇంటికొచ్చి మంచి పని చేశావ్ . ధరణీని కాఫీ తీసుకురామ్మా
దేవయాని: ఆగు అంటూ గద్దిస్తుంది..నా కొడుకు ఇన్నాళ్ల తర్వాత ఇంటికొస్తే నా చేతితో కాఫీ ఇవ్వాలని ఉంటుంది కదా
ఫణీంద్ర: ధరణి వాడి భార్య.. నీకెంత ప్రేమ ఉంటుందో.. ధరణికి అంతే ప్రేమ ఉంటుందని ఆమెను కాఫీ తీసుకురమ్మంటాడు
Also Read: బొమ్మ అదుర్స్- గుండు బాస్ తో గుటకలు వేయించిన వసు, రిషి కల నెరవేర్చిన జగతి
రిషి: శైలేంద్రను తీసుకెళ్లి రూమ్ చూపిస్తాడు. ఈ రూమ్ నచ్చకపోతే తన రూమ్ ఇస్తాను
శైలేంద్ర: నువ్వు ఇవ్వాల్సినవి చాలానే ఉన్నాయిలే రిషి.. ఒక్కొక్కటిగా తీసుకుంటాను
రిషి: అన్నయ్య నువ్వు వ్యంగ్యంగా అంటావో, సరాదాగా అంటావో నాకు అర్థం కాదు
శైలేంద్ర: కాలేజ్ ఎండీగా నీ అనుభవం ఎలా ఉంది
రిషి: కాలేజ్‌కు మంచి పేరు తీసుకురావడం కోసం చాలా కష్టపడుతున్నాను
శైలేంద్ర: కాలేజ్ కు ఏమో కానీ.. నీకు మాత్రం మంచి పేరు వస్తోంది, నేను ఫారిన్‌లో ఉన్నా కానీ నీ గురించి కథలు, కథలుగా విన్నాను
రిషి: నన్ను మునగ చెట్టు ఎక్కించవద్దు
ఇంతలో ధరణి కాఫీ తీసుకురావడంతో రిషి బయటకు వెళ్లిపోతాడు...ఇది మనిద్దరి గది అవునా...రాగానే తలుపేయాలని తెలియదా అంటే ధరణి వెళ్లి డోర్ వేసి వస్తుంది..