Guppedanta Manasu Serial,Guppedanta Manasu Serial Today Episode,Guppedanta Manasu Serial Written Update,Guppedanta Manasu Serial April 24th Episode
గుప్పెడంతమనసు ఏప్రిల్ 25 ఎపిసోడ్
డీబీఎస్టీ కాలేజిని టార్గెట్ చేసిన MSR కుట్ర బయటపెడతారు జగతి-వసుధార. ఇంతలో మినిస్టర్ నుంచి కాల్ రావడంతో మహేంద్ర, జగతి ముందేవెళతారు..ఆ తర్వాత రిషి-వసుధార ఇద్దరూ వెళతారు. రిషిని తన ఇంటికి పిలిచిన మినిస్టర్ మెడికల్ కాలేజీ పెట్టుకోవడానికి అనుమతి వచ్చిందని చెబుతాడు. మినిస్టర్ మాటలకు రిషి సర్‌ప్రైజ్ అవుతాడు. స్వయంగా మినిస్టర్ పర్మిషన్ లెటర్‌ను రిషికి అందిస్తాడు.
మినిస్టర్: ఇంత త్వరగా మీ కాలేజీకి పర్మిషన్ రావడానికి ఇద్దరు కారణం ... ఒకరు జగతి...మరోకరు వసుధార . రిషి నువ్వు ఏదనుకున్నాఅది జరుగుతుంది. దాని కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా కష్టపడతారు. ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. నీ ఫేస్‌లో ఆనందం చూడటం కోసం వీరు చాలా ఇబ్బందిపడ్డారు. చివరికి అనుకున్నది సాధించారు. సౌజన్యరావుతో జరిగిన గొడవలు మర్చిపోయి మెడికల్ కాలేజీ పనులు చూసుకోమని రిషికి మినిస్టర్ సలహా ఇస్తాడు.
Also Read: బొమ్మ అదుర్స్- గుండు బాస్ తో గుటకలు వేయించిన వసు, రిషి కల నెరవేర్చిన జగతి
మినిస్టర్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన రిషి చాలా సీరియస్‌గా ఉంటాడు.
రిషి కోపం చూసి జగతి-వసుధార భయపడతుంటారు...
రిషి: వసుధార ఏంటిది? ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు?
వసు: మీరు ఇలా రియాక్ట్ అవుతారని అనుకోలేదు
రిషి: ఇలా కాకుండా ఎలా రియాక్ట్ అవుతానని అనుకున్నావు . సౌజన్యరావు ఒక ఫ్రాడ్. ఏదో దురుద్దేశంతోనే అతడు మన దగ్గరకు వచ్చాడనే విషయం తెలిసి తనకు ఎందుకు చెప్పలేదు. నేను మోసపోతానని ముందే తెలిసి నాకు ఎందుకు చెప్పలేదు. ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు
రిషిని కన్వీన్స్ చేయడానికి జగతి, మహేంద్ర ట్రై చేసిన ఎవ్వరి మాటా వినడు.
రిషి: మీరంతా నన్ను లెక్కచేయరని తేలిపోయింది. మెడికల్ స్టార్ట్ చేయడం నా కల. అది నువ్వు సాధించలేవు. మేము సాధిస్తాం అని చెప్పకనే చెప్పారు. నన్ను ఒక పనికిమాలిన వాడిగా, చేతకానివాడిలా జమకట్టారు. ఇదెప్పుడూ నా మనసులో చెరగని మచ్చగానే మిగిలిపోతుందని చెప్పి వెళ్లిపోతాడు.
గుప్పెడంత మనసు సీరియల్‌లోకి మరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రావడంతోనే వసుధారతో గొడవ పెట్టుకుంటాడు. ఓ యాక్సిడెంట్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వసు వార్నింగ్ ఇస్తుంది. మళ్లీ నువ్వు నా కంట పడితే నీకే డేంజర్ అంటూ ఆ వ్యక్తి చెప్పి వెళ్లిపోతాడు. తను ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు. దేవయాని కొడుకు శైలేంద్ర భూషణ్ కావొచ్చేమో...
Also Read: ఏప్రిల్ 25 రాశిఫలాలు, ఈ రాశులవారు కష్టపడతారు కానీ తగిన ఫలితం పొందలేరు
ఆ తర్వాత మెడికల్ కాలేజీ పర్మిషన్స్ వసుధార నువ్వు కలిసి ఎలా తెచ్చారో చెప్పమని జగతిని అడుగుతాడు మహేంద్ర. వసు సాయంతో ఈ పని చేశానని జగతి అంటుంది. అందుకు మాతో పాటు రిషి కూడా పరోక్షంగా సాయం చేశాడని, ఆ విషయం తనకి తెలియదని మహేంద్రతో జగతి చెబుతుంది. రిషితో సంతకాలు చేయించి ఆ ఫైల్స్‌ను పర్మిషన్స్ కోసం పంపించిన విషయం చెబుతుంది. రిషి మంచి కోసమే మీరు ఇదంతా చేసినా అర్థం చేసుకోలేకపోతున్నాడని మహేంద్ర బాధపడతాడు. ఇప్పుడు పుత్రరత్నం ఏం చేస్తాడో, వాడి కోపం ఎలా తగ్గుతుందో అని మహేంద్ర భయపడుతుంటాడు. ఆ బాధ్యత వసు చూసుకుంటుందంటుంది జగతి.
మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
హీరో, హీరోయిన్లను కొట్టడం పై తేజకి ప్రశ్న - దర్శకుడి ఆన్సర్‌కి పారిపోయిన ‘జబర్దస్త్’ కమెడియన్!
Gruhalakshmi June 8th: శేఖర్ కిడ్నాప్, క్లైమాక్స్ కి చేరిన లాస్య కథ- దివ్య మీద రాజ్యలక్ష్మి ఫైనల్ ఎటాక్
Guppedanta Manasu June 8th: వసు పనిచేస్తున్న కాలేజీ బాధ్యతలు తీసుకున్న రిషి సార్, మళ్లీ ప్రేమకథ మొదలు!
Brahmamudi June 8th: రాహుల్ ప్లాన్ తిప్పికొట్టి కావ్య తన అక్క పెళ్లి జరిపిస్తుందా?
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు
YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్