అన్వేషించండి

Gunde Ninda Gudi Gantalu November 26 Episode: మౌనిక బాధలు మొత్తం చెప్పేసిన మీనా, సంజూపై బాలు దండయాత్ర - గుండెనిండా గుడిగంటలు నవంబర్ 26ఎపిసోడ్!

Gundeninda GudiGantalu Today episode: బంగారం గొడవ పక్కకు పోయింది...మౌనిక లైఫ్ గురించి సత్యం ఫ్యామిలీలో చర్చ మొదలైంది. సంజూ పైశాచికత్వం కొనసాగుతోంది... రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుండె నిండా గుడి గంటలు నవంబర్ 26 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 November 26th Episode

కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడికి వస్తారు సత్యం ఫ్యామిలీ. గుడికి వెళతానని చెప్పి మౌనిక కూడా వస్తుంది. సంజయ్ సరే అంటాడు కానీ తండ్రి వచ్చి మౌనిక నిన్ను మోసం చేస్తోందని, నీకు గుడికి అని చెప్పి వాళ్లింటికి వెళ్లిందని బామ్మ బర్త్ డే వేడుకల్లో ఫొటోలు చూపిస్తారు. నువ్వు నమ్ముతున్నావ్ కానీ ఆమె నిన్ను మోసం చేస్తోందని నూరిపోస్తాడు. నచ్చచెప్పేందుకు తల్లి ప్రయత్నించినా సంజూ వినడు. మౌనికపై కోపంగా గుడికి బయలుదేరుతాడు. అక్కడ అదొక్కతే ఉంటే పర్వాలేదు..వాళ్లింట్లో వాళ్లతో కనిపిస్తే అప్పుడుంటుందని ఆవేశంతో ఊగిపోతాడు. సరిగ్గా సంజూ వెళ్లేసరికి మౌనికకు వాయనం ఇస్తూ కనిపిస్తుంది ప్రభావతి. కోపంగా వెళ్లి మౌనికను లాగిపెట్టి కొడతాడు. గుడికి అని చెప్పి నిత్యం బయటకు వచ్చేస్తున్నావ్..ప్రతి సారీ మీ ఇంటికే వెళుతున్నావా? ఇంకెక్కడికైనా వెళుతున్నావా? అని నోటికొచ్చినట్టు వాగుతాడు. చెల్లెల్ని అలా మాట్లాడేసరికి బాలు పట్టరాని ఆవేశంతో సంజూ చొక్కా పట్టుకుంటాడు. సత్యం ఫ్యామిలీ అంతా కలసి విడిపిస్తారు. పండుగపూట గుడిలో పెద్ద రచ్చే జరుగుతుంది.

సత్యం , ప్రభావతి అండ్ కో అంతా ఇంటికి చేరుకుని..సంజూ ప్రవర్తన తల్చుకుని ఏం జరుగుతోందని మాట్లాడుకుంటారు. పండుగపూట ఇంటి అల్లుడిపై చేయి చేసుకుంటావా అని ప్రభావతి ఎప్పటిలా బాలుపై ఫైర్ అవుతుంది. వాడు నా చెల్లెలిపై చేయి వేస్తే నేను వాళ్లలా చవటల్లా చూస్తూ ఊరుకోవాలా అని రివర్స్ లో క్వశ్చన్ చేస్తాడు.  అంటే ఆ ఇంట్లో మౌనిక ప్రశాంతంగా లేదా? సంతోషంగా ఉండడం లేదా? అని సత్యం అడుగుతాడు. అక్కడ ఏం జరిగిందో మొత్తం మీనాకు తెలుసు..కానీ నిజం చెబితే బాలు ఆవేశంగా సంజూని ఏమైనా చేస్తాడనే భయంతో చెప్పకుండా ఆగిపోతోంది. ప్రభావతి, రోహిణి, మనోజ్, రవి అందరూ వరుస ప్రశ్నలు వేస్తారు. మీనా ఏమీ చెప్పదు. అంతా బాలుని టార్గెట్ చేస్తుంటే శ్రుతి మాత్రం సపోర్ట్ చేస్తుంది.  ఆ తర్వాత మీనా బాధపడుతుంది... నేను నిజం చెప్పకుండా తప్పుచేస్తున్నానా అని ఆలోచిస్తుంది. 

మౌనికను తీసుకుని సంజూ ఇంటికెళ్లిపోతాడు. వెళ్లడంతోనే ఇంట్లో పెద్ద గొడవ స్టార్ట్  చేస్తాడు. గుడికి అని చెప్పి వెళ్లి వాళ్లింటివాళ్లను కలుస్తోందని సూటిపోటి మాటలంటాడు. నాకు నిజంగా తెలియదు..అక్కడకు వెళ్లిన తర్వాతే వాళ్లను చూశాను అంటుంది మౌనిక. సంజూ కోపానికి తండ్రి మరికొంత ఆజ్యం పోస్తాడు. నువ్వు వాళ్లకు దూరంగా ఉండాలి..వాళ్లను దూరం పెట్టాలి. నిజాయితీగా ఉండాలి ఎందుకిలా చేస్తున్నావని అడుగుతాడు. అది చిన్నపిల్ల..దాన్ని ఇద్దరూ కలసి ఎందుకు భయపెడుతున్నారని సంజూ తల్లి అడుగుతుంది. ఇదే నాతో ఆడుకుందంటూ సంజూ ఫైర్ అవుతాడు.  నేను నిన్ను ఎలా టార్చర్ చేశానో అన్నీ చెప్పేసి నిన్ను అక్కడే వదిలేసి వస్తాను పద అని బెదిరిస్తాడు సంజూ. నేను ఇంకెప్పుడూ మావాళ్ల దగ్గరకు వెళ్లను, వాళ్లతో మాట్లాడను అని ప్రామిస్ చేస్తుంది మౌనిక. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లిపోతుంది మౌనిక. 

దాన్ని వాళ్లింట్లో వదిలేసేందుకు మంచి అవకాశం దొరికింది..నువ్వెందుకు వదిలేశావ్..దాన్ని పంపించాలి కదా అంటాడు. కళ్లముందే చెల్లి ఉన్నా కలుసుకోకుండా చేస్తే ఆ బాలుగాడు విలవిల్లాడిపోయి నా కాళ్లపై పడతాడు అందుకే ఇదంతా అంటాడు సంజయ్. 

మౌనిక గురించి ఆలోచిస్తుంటాడు సత్యం...నాక్కూడా అదే భయంగా ఉందండి అంటుంది ప్రభావతి. ఓసారి కాల్ చేయండి అంటుంది. సత్యం కాల్ చేస్తాడు. నేను ఒక్క నిముషం మాట్లాడితే ఎలాంటి సమస్యా ఉండదు..లేదంటే  బాలు అన్నయ్య ఇక్కడకు వస్తాడు అంటుంది. ఏంటి నన్ను బెదిరిస్తున్నావా అంటాడు సంజయ్. ఏం జరుగుతుందో నాకు మీకు తెలుసు అంటుంది.  స్పీకర్ ఆన్ చేసి అంతా వింటాడు సంజూ. బాలుకి దూరంగా ఉండు అని ప్రభావతి నూరి పోస్తుంది... వెంటనే ఫోన్ లాక్కుని సత్యం క్లాస్ వేస్తాడు.  ఆ తర్వాత బాలుని తిడతాడు సంజూ. నేను వాడికి భయపడను..మళ్లీ వాడికి దూరంగా ఉండకపోతే మీ ఇంట్లో మీ నాన్న ఫొటోకి దండ ఉంటుంది గుర్తు పెట్టుకో అని బెదిరిస్తాడు. 

వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!

 'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?

 'వారణాసి' సినిమా టీజర్లో కనిపించిన 'చినమస్తా దేవి' ఎవరు? రాజమౌళి ఆమె గురించి ఏం చెప్పబోతున్నారు?

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Advertisement

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget