Gunde Ninda Gudi Gantalu October 8th Episode: బాలు మీనా ముచ్చట్లలో బయటపడిన గుణ కుట్ర ! గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 08 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: మీనా ఇంట్లోంచి వెళ్లిపోయింది అనుకుని కంగారుపడిన బాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తిరిగి వచ్చేసరికి మీనా ఇంట్లో కనిపించింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 08 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 8th Episod
మీనా ఇంట్లోంచి వెళ్లిపోయింది అనుకుని టెన్షన్ పడిన బాలు..మీనా తిరిగి రావడంతో ఎమోషనల్ అయిపోతాడు. తలోమాట అంటుంటారు. నేను శ్రుతికి చెప్పి వెళ్లాను అంటుంది మీనా. నాకెప్పుడి చెప్పావ్ అని శ్రుతి అనగానే..ఇలా కవర్ చేస్తోందని ప్రభావతి నోరుపారేసుకుంటుంది. శ్రుతి ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతుంటుంది. ఆ విషయం గమనించని మీనా..నాకు ఓ ఆర్డర్ కాల్ వచ్చింది. వెళ్లాలి..మా ఆయనకు చెప్పి వెళదాం అంటే పొద్దున్నే ఇద్దరం వాదించుకున్నాం..అందుకే నీకు చెబుతున్నా అంటుంది. అప్పుడే ఫోన్ మాట్లాడుతూ సరే అంటుంది శ్రుతి. అయితే తను చెప్పింది విని శ్రుతి సరే అన్నది అనుకుంటుంది మీనా. మొత్తం గుర్తుచేసుకున్న శ్రుతి.. మీనా అబద్ధం చెప్పదు..అప్పుడు నేను కాల్ మాట్లాడుతుంటే వచ్చింది..ఆ సమాధానం తనకే చెప్పాను అనుకుందేమో అని చెప్తుంది. ప్రభావతి అండ్ కో నోరు మూసేస్తారు.
ఒక్కరోజు మీనా ఇంట్లో లేకపోయేసరికి కాఫీ, టిఫిన్, భోజనం వరకూ అన్నింటికీ అల్లాడిపోతారు. వంట చేయకుండా వెళ్లిపోయింది...ఊరిమీద తిరిగి తిని వచ్చిందంటూ ప్రభావతి నోటికి పనిచెబుతుంది. జాగ్రత్తగా మాట్లాడండి..తిరిగి వచ్చింది అంటే అర్థాలు మారిపోతాయ్ అని క్లాస్ వేస్తుంది.
ఆ తర్వాత మీనా తల్లి కాల్ చేసి ఇంకా కంగారుపడుతుంటే.. తను ఇంటికి వచ్చేసిన సంగతి చెబుతాడు బాలు. ఈ టైమ్ లో ఎవరు అని మీనా అడిగితే.. మీ అమ్మ అని చెబుతాడు బాలు. అందరకీ ఎందుకు చెప్పారు అంటుంది. మరి నువ్వు వెళ్లిపోతే సైలెంట్ గా ఊరుకోనా అంటాడు . ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారు. బాగా టెన్షన్ పడినట్టున్నారు అనగానే...నేను టెన్షన్ పడలేదని కవర్ చేస్తాడు బాలు. మీరు బాగా ఏడ్చారంటకదా..కళ్లు కూడా ఎర్రబడ్డాయ్..నాపై ప్రేమ కూడా కనిపించింది అంటుంది మీనా. అదేం లేదంటూ కవర్ చేస్తాడు బాలు. చిన్న పిల్లాడు తప్పిపోతే ముందు.. తల్లి కొట్టేందుకు చేయెత్తుతుంది..ఆ తర్వాతే ప్రేమగా దగ్గర తీసుకుంటుంది. మీరు కూడా అలానే చేశారు ఈ రోజు..నాపై ఇంత ప్రేమ సంతోషంగా ఉంది అంటుంది.
నన్ను వెతుక్కుంటూ ఎక్కడెక్కడ తిరిగారని అడిగితే.. మొత్తం తిరిగాను, చివరకు పోలీస్ స్టేషన్ కి వెళ్లాను అంటాడు. ఇంతకీ పోలీసులు ఏమన్నారని అడగ్గానే...అక్కడ వేరే కథ జరిగిందిలే అంటూ శివ చేసిన రచ్చ గురించి చెబుతాడు బాలు. మా అక్కను బావ వేధించాడు, బావ కారణంగానే అక్క కనిపించకుండా పోయింది, మా బావే చంపేసి ఉంటాడు, వెంటనే అరెస్ట్ చేయండి అంటూ శివ ఇచ్చిన కంప్లైంట్ గురించి చెప్పి...వాడిని ఎవరో బాగా రెచ్చగొట్టి పంపించి ఉంటారు అంటాడు. ఆ మాట వినగానే మీనా ఆలోచన గుణవైపు మళ్లుతుంది. వాడిపని చెప్తా అని మీనా అంటే.. వాడు కంప్లైంట్ ఇచ్చిన సంగతి నేను ఎవ్వరితోనూ చెప్పలేదు నువ్వుకూడా చెప్పొద్దు అంటాడు. మీ మంచితనం వాడికి ఎప్పుడు అర్థమవుతుందో అంటుంది మీనా.
ప్రతిసారీ ఏదోలా వాడు తప్పించుకుంటున్నాడని గుణ బాధపడుతుంటాడు. ఇంతలో శివ రావడంతో.. మీ అక్క వచ్చేసిందంట కదా అని అడుగుతాడు. అప్పుడే మీనా ఎంట్రీ ఇస్తుంది. శివకోసం వచ్చావా అని గుణ అంటే.. శివ వెనుక ఉండి నువ్వే ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు అని మీనా అంటుంది. నేనే కంప్లైంట్ ఇచ్చాను అంటాడు శివ. నేనంటే ఆయనకు ప్రేమ ఉంది అందుకే ఊరంతా వెతికాడు.. నన్ను అడ్డం పట్టుకుని మా ఆయనపై పగ తీర్చుకోవాలని చూశావ్.. ఇంకోసారి మా ఇద్దరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
మీనా వెళ్లిపోగానే అనవసరంగా కంప్లైంట్ ఇచ్చానని శివ బాధపడతాడు. నీ తప్పేంలేదు అంటాడు గుణ. అయినా నేనే తప్పుచేశాను అంటాడు శివ. వాళ్లమ్మ దగ్గర డబ్బులు కొట్టేసినా బావ ఏమీ అనలేదు..కానీ నేనే ఎక్కువగా వాళ్లని బాధపెడుతున్నా..ఇక వాళ్లమధ్య ఇన్వాల్వ్ అవను అంటాడు శివ. మంచిగా మాట్లాడి శివను పంపించేసిన గుణ...వాళ్లను నేను వదలను అనుకుంటాడు.
నువ్వు షోరూం చూస్తుండు అని చెప్పి మనోజ్ బయటకు వెళతాడు. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు రోహిణిని బెదిరిస్తున్న వ్యక్తి. నువ్వెందుకు ఇక్కడకు వచ్చావని రోహిణి కంగారుపడుతుంది. షోరూం చాలా బావుంది కళ్యాణి అంటూ.. మనోజ్ వచ్చేస్తాడు వెళ్లు అంటుంది. ఎంతైనా నా ప్లేస్ ని రీప్లేస్ చేసిన లక్కీ పర్సన్ కదా అంటాడు. ఎందుకింత టార్చర్ చేస్తున్నావని అడిగితే..డబ్బు కావాలని అడుగుతాడు. నా దగ్గర లేవు అనగానే...త్వరలో విల్లా కొనాలి అనుకున్నా ఫర్నిచర్ తీసుకెళ్తా బిల్లు నువ్వే కట్టెయ్ అంటాడు. ఇంతలో మనోజ్ వస్తాడు. చాలా పెద్ద సేల్ చేసినట్టున్నావ్ అని మెచ్చుకుంటాడు. కార్డ్ పేమెంట్ చేశారా అంటే EMI లో తీసుకున్నారని కవర్ చేస్తుంది రోహిణి. అడ్వాన్స్ తీసుకోవచ్చు కదా అంటే నాకు తెలిసినవాళ్లు అని చెబుతుంది. ఇప్పుడు డీలర్ కి డబ్బులివ్వాలి కదా అని అడుగుతాడు. నాకు తెలిసినవాళ్లు అని చెబుతుంటే విసిగిస్తావేంటి..సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కునాకు లేదా ఆ ఫర్నిచర్ తెచ్చివ్వమని చెబుతాను అంటుంది. వద్దులే అని చెప్పి రోహిణిని పార్లర్ కి పంపించేస్తాడు. విద్యకు కాల్ చేసి దినేష్ గాడు షోరూమ్ కి వచ్చాడంటూ జరిగింది చెబుతుంది. వీడికి బుద్ధిచెప్పకపోతే అలానే వేధిస్తాడు అంటుంది.
మీనా వంట చేస్తుంటే శ్రుతి వెళుతుంది. టీ పెట్టి ఇవ్వనా అని అడుగుతుంది. నిన్న జరిగినదానికి వంట చేయవు అనుకున్నా అంటుంది శ్రుతి. నిన్న ఆయన మాట్లాడినదానికి కోపం వచ్చింది కానీ నా గురించి ఎంతగా వెతికారో తెలిశాక ఆ కోపం పోయింది అంటుంది. మీనాను మెచ్చుకుంటుంది శ్రుతి.






















