Gunde Ninda Gudi Gantalu December 9 Episode: రోహిణి అసలు రంగు బయటపడుతుందా? మీనా, బాలు ఏం చేస్తారు? గుండెనిండా గుడిగంటలు డిసెంబర్ 9 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: డబ్బు తిరిగి ఇచ్చేవరకూ ఇంట్లో తినేదే లే అని ప్రతిజ్ఞ చేసింది రోహిణి. అన్నట్టుగానే డబ్బు కట్టలతో తిరిగివచ్చి షాక్ ఇచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 09 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 December 09 Episode
బంగారం అమ్మేసిన తల్లీ కొడుకు డాబు ప్రదర్శిస్తున్నారు. బంగారం కోసమే కదా ఈ రచ్చ చేశావ్ ఇదిగో తీసుకో అంటూ గాజులు విసిరేసింది ప్రభావతి. మీనా అవి తనకు అవసరం లేదని చెప్పింది. మనోజ్ బదులు ఆ డబ్బులు నేనిస్తానని చెప్పింది రోహిణి. ప్రభావతితో సత్యం ఇంకా మాట్లాడడం లేదు...పైగా ఆ దుష్టశక్తి ఎక్కడుంటే అక్కడ నేను ఉండను అని తెల్చిచేప్పేసి అక్కడి నుంచివెళ్లిపోతున్నాడు. మీనా-బాలు బతిమలాడినా కానీ సత్యం తగ్గడం లేదు. ఎవ్వరూ పట్టించుకోకుండా ఉన్నా ఏమీ అనని ప్రభావతి..మీనా-బాలు సత్యాన్ని బతిమలాడినా అర్థం చేసుకోదు..పైగా ఈ గొడవంతటకీ వీళ్లే కారణం అని మరింత రగిలిపోతుంది.
ఇంట్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న మీనా దగ్గరకు వెళ్లి నానా మాటలు అంటుంది ప్రభావతి. నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తుంది. నీవల్లే ఇదంతా జరిగింది..మా ఆయన నాతో మాట్లాడడం మానేశాడు, ఇప్పుడు కడుపునిండిందా అంటూ సూటిపోటి మాటలంటుంది.ఆ తర్వాత హాల్లో కూర్చుని ఉంటుంది. మీనా టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ పై పెడుతుంది. రోహిణి, మనోజ్ బయటకు వచ్చి ఫర్నిచర్ షోరూమ్ కి బయలుదేరుతారు. టిఫిన్ తిని వెళ్లమని మీనా అంటే.. డబ్బులు తిరిగి ఇచ్చేవరకూ ఏమీ తినం అంటుంది రోహిణి. ఎప్పటివరకూ తినరు? ఎన్నాళ్లు మానేస్తారు? ఎప్పుడు డబ్బులిస్తారు? లేనిపోని పట్టింపులు ఎందుకు తిండిదగ్గర అంటుంది. ఆ బాలు నిలదీస్తాడు అని రోహిణి అంటే.. అవును 40 లక్షలు మింగేశారు వాటి గురించి ఇప్పటికీ కక్కించలేకపోయారు..మా ఆయన అవేమీ అడగడం లేదు..మా బంగారం అమ్ముకుని మింగేసిన నాలుగు లక్షలు ఇవ్వాల్సిందే ఆ విషయం మీరు, మీ ఆయన, మీ ఎదురుగా ఉన్న ఆవిడ గుర్తుపెట్టుకుంటే మంచిది అంటుంది. కాసేపు వాగ్వాదం జరుగుతుంది.
ఆ తర్వాత అందరూ టిఫిన్ తినేందుకు కూర్చుంటారు...ప్రభావతి పక్కన కూర్చుని తినడం ఇష్టంలేక సత్యం తర్వాత తింటాను అంటాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా మనోజ్ పై సెటైర్స్ వేస్తుంటాడు బాలు..మీ డబ్బులు మీకు తెచ్చేస్తాను అన్నా కదా అంటుంది రోహిణి. నువ్వు తెచ్చి ఇచ్చినప్పుడు ఆపుతాలే అంటాడు బాలు. అయినా తండ్రి డబ్బు మింగినోడు, తమ్ముడి భార్య నగలు అమ్మేసుకున్నవాడు... రేపు నీ నగలు కూడా అమ్మేస్తాడేమో జాగ్రత్త పార్లలమ్మ అంటాడు. సత్యం బయటకు వెళుతుంటే డ్రాప్ చేస్తాను అంటాడు బాలు... వద్దులే అనేసి...మీనాకు వెళ్లొస్తా అని చెప్పి వెళతాడు. ఎప్పుడూ నీకు చెప్పేవారు కదా నాన్న అంటాడు రవి. ఆవిడ చేసిన పనికి ఆయన కాబట్టి ఇంకా అలా ఉన్నారు..వేరేవాళ్లు అయితే సూట్ కేస్ నెత్తిన పెట్టి పుట్టింటికి పంపించేవారు అంటుంది శ్రుతి. నువ్వెందుకు పెద్దది చేస్తావ్ అంటుంది రోహిణి...నువ్వెందుకు చిన్నది చేస్తావ్ అంటుంది శ్రుతి. ప్రభావతి కోపంగా లేచి వెళ్లిపోతుంది...అయ్యో అత్తయ్యా అంటుంది మీనా. నువ్వెందుకు జాలి పడతావ్... అరడజను తిన్నాక ఇంకేం ఆకలేస్తుంది అంటాడు బాలు. మనోజ్ పై సెటైర్స్ వేస్తుంటే.. రోహిణి అక్కడి నుంచి లాక్కెళ్లిపోతుంది.
అంతా వెళ్లిపోతుండగా... శ్రుతిని పిలిచి మీనా మాట్లాడుతుంది. మనింట్లో జరిగిన నగల దొంగతనం సంగతి మీ ఇంట్లో చెప్పొద్దు అంటుంది. అత్తారింటి విషయాలు పుట్టింటికి చేరవేయకూడదు. మనం ఎప్పటికీ ఉండాల్సిన ఇల్లు ఇది...మనింటి పరువు పోతే నీ భర్త పరువు పోయినట్టే అని చెబుతుంది. నీ అంత మెర్చూరిటీ వాళ్లకు ఎప్పటికి వస్తుందో ఏమో ..సరే నువ్వు చెప్పావ్ గా వింటా అంటుంది శ్రుతి. ఇదంతా విన్న ప్రభావతి...ఇదంతా డ్రామానే అని మీనా తిట్టుకుంటుంది.
షాప్ కి వెళ్లిన రోహిణి..మనోజ్ తో డిస్కషన్ పెడుతుంది. నావల్లే కదా అమ్మ బాధపడుతోందని మనోజ్ అనుకుంటాడు. నాతో చెప్పి ఉండాల్సింది అంటుంది రోహిణి. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావని చెప్పలేదు అంటాడు. నా దగ్గర ఏమీ దాచొద్దు అంటుంది. నువ్వు ఆ డబ్బులు ఎలా తెస్తావ్ అంటాడు. ఎలాగైనా ఇవ్వాలి కదా అంటుంది రోహిణి. ఆ డబ్బులు ఇవ్వకపోతే విలువ ఉండదు అంటుంది. ఇంతలో పోలీసులు వచ్చి..మీ షాప్ లో కొన్ని వస్తువులు పోయాయ్ కదా వాటిలో కొన్ని వీడు కొన్నాడని చెబుతారు పోలీసులు. వాళ్లకు క్లాస్ వేస్తుంటాడు మనోజ్. తను కొన్న వస్తువులు మీకు తిరిగి ఇద్దామని వచ్చాడు అంటాడు పోలీస్. తను ఎంతకు కొన్నాడో అంత మొత్తం ఇచ్చేయండి..ఆ వస్తువులు తీసుకోండి అంటాడు పోలీస్. మీకు ఇలా సాయం చేద్దామని తీసుకొచ్చాను ..మీరే ఏదో ఒక నిర్ణయానికి రావాలి అంటాడు పోలీస్. సరే డబ్బు మీకిచ్చి ఆ వస్తువులు తీసుకుంటాం అంటుంది. మనకు కల్పన ఇచ్చిన డబ్బులు తీసి ఇద్దాం... అందులోంచి 2lac బాలుకి ఇస్తే బెటర్ అంటుంది. ఆ డబ్బులు ఫ్యూచర్ కోసం దాచుకున్నాం కదా అంటే... సమస్యనుంచి బయటపడడం ముఖ్యం అని క్లాస్ వేస్తుంది.
ఇంటికి తిరిగి వచ్చిన సత్యం.. దగ్గుతూ, తమ్ముతూ ఊపిరి అందక ఇబ్బందిపడతాడు.. ప్రభావతి వచ్చి మంచినీళ్లు ఇచ్చినా తీసుకోడు. సడెన్ గా ఏమైందని అడుగుతాడు బాలు.. దుమ్ము దులిపాను అంటాడు. మీనా ఇచ్చిన నీళ్లు తాగడంతో కోప్పడిన ప్రభావతి గ్లాస్ విసిరేసి వెళ్లిపోతుంది.
అత్తయ్య-మావయ్య ఇద్దరూ తూర్పు పడమర...ఇద్దర్నీ కలపాలి అంటుంది మీనా. మావయ్య కోపంగా ఉన్నారని..అది మీవల్లే అంటుంది మీనా. ఇప్పుడేం చేద్దాం అంటుంది మీనా.. మా నాన్న అలానే ఉండడం మంచిది అంటాడు బాలు. పంతం, పట్టుదల అన్నీ మీకు మావయ్య నుంచే వచ్చాయ్..ఆ రెండు తప్ప అంటుంది. ఏంటవి అనగానే... ఒకటి మందు...రెండోది నోటి దూ..... అనేసరికి ఆపేస్తాడు బాలు....






















