Gunde Ninda Gudi Gantalu July 3rd Episode : రోహిణి ఫ్రాడ్ అని బయటపెట్టేసిన బాలు, ప్రభావతికి పెద్ద షాకే ఇది - గుండె నిండా గుడి గంటలు జూలై 03 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: శ్రుతి, రోహిణి తాళి మార్చే వేడుక కోసం హడావుడి చేస్తుంది ప్రభావతి. అంతా కలసి బాలుని టార్గెట్ చేస్తారు. గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ లో ఏంజరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు జూలై 03 ఎపిసోడ్
శృతి తాళి మార్చే ఫంక్షన్ సంబరంగా జరుగుతుంది. రవి, శ్రుతి ఇద్దరూ వెలిగిపోతారు. ఆచారం ప్రకారం శ్రుతి మెడలో తాళి మార్చుతారు. తల్లిదండ్రులకు నమస్కారం చేసేందుకు వెళతారు. పిల్లాపాపలతో సంతోషంగా ఉండమని సత్యం దీవిస్తాడు, ఒంటినిండా నగలు బంగారంతో కళకళలాడాలని ప్రభావతి దీవిస్తుంది. నీ అత్తింటినుంచి దూరమైపోయి ఏకంగా పుట్టింటికివచ్చేయాలని దీవిస్తారు శ్రుతి తల్లిదండ్రులు.
రోహిణి అరెంజ్ చేసిన వ్యక్తి బాలు దగ్గరకు వెళ్లి తాగేందుకు రమ్మని బతిమలాడుతుంటాడు.
అక్షింతలు కలిపేందుకు కోడళ్లని పిలవమంటారు..రోహిణిని పిలిచి మీనాను వదిలేస్తుంది ప్రభావతి. అప్పుడు కామాక్షి, శ్రుతి మీనాను పిలుస్తారు.
ఫంక్షన్ గ్రాండ్ గా జరగడం చూసి రవి-శ్రుతి సంతోషిస్తారు. అందరం కలసిపోయాం అనుకుంటారు.
రోహిణి మీ నాన్న ఇంకారాలేదేంటని మనోజ్ అడుగుతాడు. వస్తారులే నువ్వెందుకు మీ అమ్మలా టార్చర్ చేస్తున్నావని ఫైర్ అవుతుంది
మీ మలేషియా వియ్యంకుడు ఈసారి అయినా వస్తాడా అని రంగ అడిగితే..ఏమో ఈ అత్తా కోడళ్లకే ఎరుక అంటాడు సత్యం.
రోహిణి తండ్రి వస్తాడు కిలోల కొద్దీ బంగారం తెస్తాడని గొప్పలు చెబుతుంది ప్రభావతి. మీనాన్న రాకపోతే మాత్రం ఇంటికి వెళ్లాక నా చేతిలో నీకు చావే అంటుంది. అందరి ముందు నా పరువు తీస్తున్నావని ఫైర్ అవుతుంది.తలదించుకునేలా చేశావ్ అని ఫైర్ అవుతుంది. ఫోన్ కలవడం లేదని ఎంత ప్రయత్నించినా కాల్ కలవడం లేదని , అసలు ఏం జరుగుతుందో అర్థంకావడం లేదంటుంది రోహిణి.
మీ అమ్మాయి ఫంక్షన్లోనే శ్రుతి తోడికోడలి ఫంక్షన్ కూడా చేస్తున్నారంట కదా అంటాడు సురేంద్ర స్నేహితుడు. అవును గతిలేనివాళ్లకి ఇంత పడేస్తాం కదా అలా..నా కూతురి ఫంక్షన్ జరిగిన సందడిలోనే గతిలేనివాళ్లు అని జాలితో , వాళ్లు చేతులు పట్టుకుని బతిమలాడితే రోహిణి ఫంక్షన్ కూడా జరిపించేస్తున్నాం అంటాడు. ఆ మాట విని రంగ కోపంగా లేవబోతుంటే సత్యం ఆపేస్తాడు.ఇక్కడ శ్రుతి నాకు కోడలు కాదు కూతురు. నా కూతురి ఫంక్షన్ ని నేను చెడగొట్టలేను అనేస్తాడు సత్యం..
ప్రభావతి పదే పదే వెళ్లి రోహిణిని తండ్రి గురించి అడుగుతుంటుంది. ఏదో పెద్ద గొడవ జరిగితే కానీ పరిస్థితి మారదు అంటుంది రోహిణి.
రోహిణి ఏర్పాటు చేసిన తాగుబోతు వెళ్లి బాలుని బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఏవేవో చెబుతాడు.. ఇక వీడు వదిలేలా లేడని బాలు వెళతాడు. వెళ్లి కారు డిక్కీలో ఏర్పాటు చేసిన మినీ బార్ చూపిస్తాడు. మాయమాటలు చెప్పి బాలుని తాగించేందుకు ప్రయత్నిస్తే.. బాలు తాగినట్టే నటించి గ్లాస్ పట్టుకుంటాడు. మొత్తం వాడితోనే తాగించేస్తాడు. వేరే ప్లేస్ అయితే తాగేవాడిని ఇక్కడ తాగను అని నా భార్యకు మాటిచ్చాను అనుకుంటాడు బాలు. నేను తాగితే నిజాలు మాట్లాడుతాను, గొడవలు జరిగే ప్రమాదం ఉంది, నేను నా భార్యకు నచ్చని పని చేయను అంటాడు. ఆ మాటలు వింటుంది మీనా. అప్పటికే బాలుని వెతుక్కుంటూ అక్కడకు వెళుతుంది మీనా. బాలు మాటలు విని సంతోషింగా హగ్ చేసుకుంటుంది. తనకోసం తాగకపోవడం చూసి థ్యాంక్స్ చెబుతుంది.
గుండెనిండా గుడిగంటలు జూలై 04 శుక్రవారం ఎపిసోడ్ లో... రోహిణి తండ్రి ఎక్కడ అని బాలు క్వశ్చన్ చేస్తాడు. తనకోసమే ఎదురుచూస్తున్నాం అంటాడు సత్యం. తను పెద్ద ఫ్రాడ్ నాన్న అంటాడు బాలు... అంతా షాక్ అవుతారు






















