Gunde Ninda Gudi Gantalu June 10 Episode: బాలుకి దొరికేసిన గుణ, డేంజర్లో ఉన్న మౌనిక - గుండె నిండా గుడి గంటలు జూన్ 10 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: రోజంతా కష్టపడి కట్టిన పూల మాలలు మండపానికి చేరకుండా ఎత్తుకుపోయాడు గుణ. గుండెనిండా గుడిగంటలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు జూన్ 10 ఎపిసోడ్
రాత్రంతా కూర్చుని పూలు కడుతుంది మీనా.. అందరూ రెస్ట్ తీసుకుంటారు..మీనా ఒక్కతే కూర్చోవడం చూసి బాలు టీ పెట్టి తీసుకొస్తాడు. మురిసిపోతుంది మీనా. తెల్లారగానే పూలన్నీ ట్రక్ ఎక్కిస్తాడు. బాలు ఫ్రెండ్ కాల్ చేసి పనైందా అని అడిగితే మొత్తం పూలు కట్టేశాం.. ఇప్పుడే ట్రక్ ఎక్కిస్తున్నాం అని చెప్తాడు.పూలతో నాకు ఫొటో తీయి అని బాలు అంటే ఇద్దరం కలసి తీయించుకుందాం అని మాత్రం అనరు అని సెటైర్ వేసి ఫొటో తీస్తుంది. ఆ తర్వాత ట్రక్ బయలుదేరుతుంది. హమ్మయ్య నాకు అప్పగించిన 500 మాలలు పని పూర్తిచేశాను అంటుంది మీనా. నీకు 500 ఏంటి మరో వెయ్యి ఇచ్చినా చేసేస్తావ్ అంటాడు. అయితే మరో ఆర్డర్ తీసుకురండి అంటుంది.
బయలుదేరిన పూల వ్యాన్ ని ఫాలో అవుతారు గుణ పంపించిన రౌడీలు. టైర్ పంచరైందని అబద్ధం చెప్పి డ్రైవర్ ని కిందకు దించేసి పూల వ్యాన్ తీసుకెళ్లిపోతారు. అదే విషయం బాలుకి కాల్ చేసి చెప్తాడు డ్రైవర్. కంగారుగా బయలుదేరుతారు బాలు, మీనా.
గుణకి కాల్ చేసిన రౌడీ పూలమాలలు తీసుకొచ్చేశాను అంటాడు. వాటిని ఊరి చివరకు తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేసి నిప్పు పెట్టు.. వాళ్లు పడిన కష్టానికి నేను ఇచ్చిన ఫలితం ఇదే అంటాడు
బాలు-మీనా కంగారుగా వెళ్లి డ్రైవర్ ని అడుగుతారు. అన్నీ మర్చిపోయి ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే ఇలానే జరుగుతుంది అంటాడు. బాలు మీనా కంగారు చూసి ఎంజాయ్ చేస్తుంటాడు గుణ
ఇంతలో రాజకీయ నాయకుడు కాల్ చేసి బాలుపై ఫైర్ అవుతాడు. జరిగింది చెప్తాడు బాలు. అరగంటలో పూలమాలలు తీసుకురాకపోతే నేను రెండు మాలలు కొంటాను..ఒకటి నీకు మరొకటి నీ ఫ్రెండ్ కి అని బెదిరిస్తాడు. నువ్వు అపోజిషన్ వాళ్లతో కలసి కుమ్మక్కై ఇలా చేశావా అని అనుమానిస్తాడు. బాలు ఎంత చెప్పేందుకు ప్రయత్నించినా వినడు. బాలు మీనా కంగారు చూస్తూ వాళ్లను ఫాలో అవుతుంటాడు గుణ. పూల మాలలతో తాను తీయించుకున్న ఫొటో చూపించి ఎంక్వైరీ చేస్తుంటాడు బాలు. దొరికేవరకూ వెతకాలి తప్పదు అంటుంది మీనా. ఎవరైనా తీసుకెళ్లి కావాలని ఎక్కడైనా దాచేస్తే రోడ్లపై ఎంత వెతికినా దొరకదు అంటాడు. కష్టం ఎప్పుడూ వృధాగా పోదని ధైర్యం చెబుతుంది మీనా. తెలిసిన వాళ్లు ఎవరైనా ఆ బండి చూస్తే మనకు చెప్తారు కదా అంటుంది మీనా. అప్పడు అలర్ట్ అయిన బాలు తనకు తెలిసిన వాళ్లు అందరకీ పూల వ్యాన్ ఫొటో పంపిస్తాడు. క్యాబ్ డ్రైవర్ల గ్రూపులో ఫొటో పెట్టి మెసేజ్ పెడతాడు. మొత్తం క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అంతా అలర్ట్ అవుతారు. పూల వ్యాన్ దొరుకుతుందేమో అని ఫోకస్ చేస్తారు.
ఇకపై పూల వ్యాపారం చేయలేం, ఆటో తోలలేను..రాజకీయ నాయకులతో వ్యవహారం ఇళానే ఉంటుంది అంటాడు బాలు. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ కాల్ చేసి బండి డంపింగ్ యార్డ్ కి వెళ్లే రూట్లో ఉందని చెబుతాడు. అర్జెంటుగా లైవ్ లొకేషన్ పెట్టు అంటాడు బాలు. ఇంత సేపు కంగారుపడి ఇప్పుడు కూల్ గా ఉన్నాడేంటని గుణ ఫాలో అవుతుంటాడు. ఆ వ్యాన్ ని బాలు స్నేహితుడు కూడా చూసి ఫాలో అవుతాడు. మొత్తం ఆటోలు, కార్లు అందరూ ఆ వ్యాన్ ని ఫాలో అయి ఆపేస్తారు. వాడిని పట్టుకుని చితక్కొడతాడు బాలు. ఎవరు ఈ పని చేయించారో చెప్పు అని చితక్కొడతాడు బాలు. గుణ అక్కడి నుంచి తప్పించుకుని పోతాడు.






















