Gundeninda Gudigantalu Today మే 29 ఎపిసోడ్: ముళ్లకంపని మెచ్చుకున్న పూలగంప, సంజూ మెడపై కత్తి పెట్టిన బాలు - గుండె నిండా గుడి గంటలు మే 29 ఎపిసోడ్
Gundeninda GudiGantalu Today episode: బాలు కారు అమ్మేయడంతో కథ మలుపుతిరిగింది.. స్టోరీ మొత్తం బాలు వర్సెస్ శివలా మారింది. గుండెనిండా గుడిగంటలు ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుండెనిండా గుడిగంటలు మే 29 ఎపిసోడ్
గుణతో గొడవవల్లే కారు అమ్మేసి ఆటో నడుపుకుంటున్నట్టు తెలుసుకుంటుంది మీనా. క్యాబ్ డ్రైవర్లు అప్పులు కట్టలేదని బాలు తన కాళ్లు పట్టుకోవాలని గుణ కండిషన్ పెడతాడు..అందుకే బాలు గుణ మధ్య గొడవ జరిగింది, ఆ గొడవలో శివ ఉండడంతో శివను కొట్టాల్సి వచ్చిందని తెలుసుకుంచుంది. గుణ దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇస్తుంది. అక్కా అక్కా అని కూల్ గా మాట్లాడిన గుణ..మీనాను ఆమె భర్తను విడగొట్టడమే తన లక్ష్యం అంటాడు. మీనా ఇంటికి వెళుతుండగా దారిలో సుమతి కనిపిస్తుంది. జరిగిన విషయం మొత్తం చెప్పడంతో బాలుపై అపార్థం తొలగిపోతుంది. శివను ఇక గుణ దగ్గరకు వెళ్లకుండా ఆపాలని నిర్ణయించుకుంటారు.
ఇంటికి వెళ్లిన మీనా మావయ్య సత్యంతో జరిగిన విషయం చెబుతుంది. ఏ పరిస్థితుల్లో కారు అమ్మాల్సి వచ్చిందో రాజేష్ ద్వారా తెలిసిన నిజం వివరించడంతో సత్యం కూడా తన కొడుకు దయాగుణం చూసి పొంగిపోతాడు. ఇంతలో బాలు ఇంటికిరావడం చూసి మెచ్చుకుంటాడు. ఏం జరిగిందో అర్థంకాక బాలు దిక్కులుచూస్తుంటాడు. బాలు వెనుకే వెళ్లిన మీనా అన్ని విషయాలు తనకు తెలిశాయంటుంది. కారు అమ్మేయడానికి గుణ కారణం అని, వాడు నీళ్లు కాళ్లు పట్టుకోమని చెప్పడంతో మీరు కారు అమ్మేశారని..గుణ ఆఫీస్ కి వెళ్లి వార్నింగ్ ఇచ్చి వచ్చానంటుంది. వాడు వెధవ, రౌడీ ఒక్కదానివే ఎందుకు వెళ్లావని ఫైర్ అవుతాడుబాలు. అయినా నాకు వాడికి మధ్య ఉన్న గొడవలో నువ్వు దూరొద్దని చెప్తాడు.
మౌనికను టార్చర్ పెట్టడమే ధ్యేయంగా సంజూ ప్రవర్తిస్తాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన స్నేహితులను తీసుకొచ్చి రచ్చ రచ్చ చేస్తాడు. మందు తాగుతాడు, నిందలు వేస్తాడు, వంటలన్నీ చేయిస్తాడు.మౌనికతో స్నేహితులకు మందు పోయిస్తాడు. కింద కార్లో మందు బాటిల్ ఉంది తీసుకురా అని పంపిస్తాడు. డ్రైవర్ ను పిలిచి బాటిల్ తెప్పిస్తుంది మౌనిక. డ్రైవర్ తో బిజీ అయ్యావా అని నిందలు వేస్తాడు. మధ్యలో సంజయ్ తల్లి వచ్చి అడ్డుకున్నా కానీ వినడు. తాగి తాగి సంజూ పడిపోయిన తర్వాత మౌనిక ఇంట్లోంచి వెళ్లిపోతుంది. హమ్మయ్య నా టార్చర్ తట్టుకోలకే ఇంట్లోంచి వెళ్లిపోయింది అనుకుంటాడు సంజయ్. తండ్రి కూడా సంతోషించి హమ్మయ్య అనుకుంటాడు. గొప్పింటి సంబంధం తీసుకొచ్చి సంజూకి పెళ్లిచేయాలి అనుకుంటాడు.
ప్రభావతి కాల్ చేసి తన కూతురు మౌనికతో మాట్లాడాలి అనడంతో ఇంట్లో అంతా షాక్ అవుతారు. మౌనిక పుట్టింటికి వెళ్లలేదా? ఎక్కడికైనా వెళ్లి లెటర్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంటే తనపైకే వస్తుందని కంగారుపడతారు సంజయ్, తండ్రి. దాంతో మౌనిక ఆచూకీ కోసం వెతకం ప్రారంభిస్తాడు. రోడ్డుపై తిరుగుతూ మౌనిక ఫొటో చూపించి ఈమెను చూశారా అని అందర్నీ అడుగుతాడు. అది గమనించిన బాలు..ఆ వ్యక్తి ఎవరి ఫొటో చూపిస్తున్నాడు? అని అడుగుతాడు. ఓ అమ్మాయి ఫొటో చూపించి అడుగుతున్నాడని తెలుసుకుని తన ఫోన్లో ఉన్న చెల్లెలి ఫొటో చూపించి ఈమెనేనా అని అడుగుతాడు. అవును అని తెలియడంతో ఆవేశంతో ఊగిపోతాడు
గుండెనిండా గుడిగంటలు మే 30 ఎపిసోడ్ లో...మౌనిక కనిపించడం లేదని తెలిసి నేరుగా సంజూ ఇంటికెళ్తాడు బాలు. ఆవేశంగా మాట్లాడుతాడు, సంజూ కాలర్ పట్టుకుని నిలదీస్తాడు..తన చెల్లెలు ఏమైందని అడుగుతాడు..
పాకిస్థాన్ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















