Intinti Gruhalakshmi November 16th Today Episode: తల్లిని కాపాడుకోవడానికి పరుగులు పెట్టిన దీపక్!
Gruhalakshmi Serial Today Episode: తన తల్లికి హార్ట్ ఎటాక్ వచ్చి ఐసీయూలో ఉందని తులసికి తెలియకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Gruhalakshmi Serial November 16th Episode : తులసి తల్లికి హర్ట్ ఎటాక్ రావడంతో హాస్పిటల్‌కి తీసుకొస్తారు. డాక్టర్లు ఐసీయూలోకి తీసుకెళ్తారు.
శ్రావణి: చెప్పినా వినకుండా టెన్షన్ అవుతారు ఇప్పుడు చూడండి నెత్తిమీదకు తెచ్చుకున్నారు
దీపక్: అమ్మగురించి తెలిసిందే కదా ఎప్పుడూ అక్క గురించి టెన్షన్ పడుతూనే ఉంటుంది. చెప్తే వినదు కదా
శ్రావణి: కష్టాలను ఎదుర్కొని అక్కడ వదిన బాగానే ఉంది. ఇప్పుడు కష్టపడుతుంది అత్తయ్యగారే.. ఏమండి అత్తయ్య ఇలా ఎడ్మిట్ అయిన విషయం వదినకు ఫోన్ చేసి చెప్పండి. ఇవన్నీ సున్నితమైన విషయాలు. మనం ఒకలా ఆలోచిస్తే ఎదుటి వాళ్లు ఇంకోలా ఆలోచిస్తారు. ఏమైనా తేడా వస్తే మొహమాటం లేకుండా మొఖం మీదే మాట అనేస్తారు.
దీపక్: అక్క అలా అనుకోదు. నన్ను టెన్షన్ పెట్టకు ఓ 5 నిమిషాలు ఆగు
మరోవైపు నందు, తులసి వైజాగ్ చేరుకుంటారు. ఈ మీటింగ్ తమకు చావుబతుకుల సమస్య లాంటిదని.. కచ్చితంగా శ్రీనివాస్‌గారిని మనవైపునకు తిప్పుకోవాలని తులసి అంటుంది. ఒకవిధంగా ఇది రత్న వాళ్లు విసిరన ఛాలెంజ్ కంటే పెద్ద సమస్య అంటుంది. మరోవైపు ఆర్కే కూడా శ్రీనివాస్‌తో మాట్లాడటానికి అక్కడికి వచ్చుంటారు. తులసి వాళ్లకు పరిచయం చేసుకుంటారు. శ్రీనివాస్ గారు షేర్ల విషయంలో తనకు ముందే మాట ఇచ్చారని ఆర్కే చెప్తాడు. నువ్వు అడ్డం పడిన ఏం చేయలేవని ఆర్కే తులసిని అంటాడు. ఇంతలో పీఏ వచ్చి ఆర్కేతో శ్రీనివాస్ గారు సాయంత్రం మాట్లాడుతారని చెప్తాడు. దీంతో ఆర్కే వెళ్లిపోతాడు. ఇక పీఏతో తాము వచ్చిన విషయం శ్రీనివాస్ గారికి చెప్పమని తులసి చెప్తుంది. ఇక తులసి, నందూ రెస్టారెంట్‌కు వెళ్తారు.
దీపక్: డాక్టర్ గారు మా అమ్మకు ఎలా ఉంది
డాక్టర్: సీరియస్ హార్ట్‌ఎటాక్. చాలా బ్లాక్స్ కనిపిస్తున్నాయి. పొజిషన్ చాలా సీరియస్‌గా ఉంది. అర్జెంట్‌గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఎక్కువ సమయం లేదు. పేషెంట్‌కు ఇన్సూరెన్స్ ఉందా. సరే అది మీ తలనొప్పి నాకెందుకు ఆపరేషన్‌కు 10 లక్షల రూపాయలు అవసరం. వెంటనే పే చేయండి. ఇది ప్రాణాలకు సంబంధించింది. చెప్పాను కదా పేషెంట్ కండీషన్ క్లిటికల్ అని సాధ్యమైనంత వరకు డబ్బు సర్దుబాటు చేసుకోండి. తర్వాత మమల్ని ఏం అనొద్దు
మరోవైపు తులసి, నందు రెస్టారెంట్‌లో అన్ని టెన్షన్లు పక్కన పెట్టి, సరదాగా మాట్లాడుకుందాం అనుకుంటారు.
శ్రావణి: ఏది అయితే జరగొద్దని అనుకున్నామో అదే జరిగింది. అత్తయ్య చెప్పిన మాట విని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు
దీపక్: ఇప్పుడు అవన్నీ తలచుకోవడం కాదు వాటి వల్ల లాభం కూడా లేదు. అమ్మను దక్కించుకోవాలి అంటే అర్జెంటుగా 10 లక్షలు కావాలి. ఎవరు ఇస్తారు.
శ్రావణి: ఏవండీ వదినను అడుగుదాం అండీ. అయ్యో ఇది మొహమాట పడే సమయం కాదండీ
దీపక్: ఒక్కసారిగా అంత డబ్బు అంటే తను మాత్రం ఎలా చేస్తుంది
శ్రావణి: తను ఇప్పుడు సామ్రాట్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సీఈవో అండీ ఒకప్పటి తులసి కాదు. తను ఒక్కసారి ఫోన్ చేసి హాస్పిటల్ వాళ్లకి చెప్తే వెంటనే ఆపరేషన్ చేస్తారు.
దీపక్ అవును అదీ నిజమే అని తులసికి ఫోన్ చేస్తాడు. అయితే నందూ ఆ ఫోన్ చూసి తులసికి లిఫ్ట్ చేయనివ్వడు. ఫోన్ చూడద్దు అనుకున్నాం కాబట్టి ఎవరు ఫోన్ చేసినా మనకెందుకు అంటాడు. తులసి సరే అని ఫోన్ గురించి వదిలేస్తుంది. ఇద్దరూ టిఫెన్ ఆర్డర్ చేస్తారు. ఇంతలో శ్రావణి నందూకి ఫోన్ చేయమంటుంది. దీపక్ నందూకి ఫోన్ చేస్తాడు. పక్కకు వెళ్లి నందూ ఫోన్ ఎత్తి తిడతాడు. దీపక్ చెప్పేది వినడు. తులసి ఫోన్‌తో పాటు తన ఫోన్ కూడా స్విఛ్ ఆఫ్ చేసేస్తాడు. దీంతో దీపక్ తులసి వాళ్ల ఇంటికి బయలుదేరుతాడు. అక్కడ తులసిని పిలుస్తాడు పరందామయ్య, అనసూయ ఏమైందని అడుగుతారు. అక్కలేదు అని చెప్తారు. రాత్రి వరకూ రాదని చెప్తారు. ఏమైందని అడిగితే తన తల్లి పరిస్థితి చెప్తాడు దీపక్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని దీపక్ ఏడుస్తాడు. పరందామయ్య దివ్య, విక్రమ్‌లకు ఫోన్ చేస్తే వాళ్లు కూడా స్విఛ్ ఆఫ్ చేసుంటారు. అమ్మను బతికించుకోవడం కోసం డాక్టర్లను బతిమాలుకుంటానని దీపక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దివ్య: ఫోన్ పని చేయడం లేదు. స్విఛ్ ఆఫ్ చేశాను మళ్లీ ఆన్ చేస్తే పనిచేస్తుందో లేదో. అంతా నీవల్లే. ముందు వెనక చూసుకోకుండా నువ్వు స్విమ్మింగ్ ఫూల్ లోకి దూకడమే కాకుండా వద్దంటే వినకుండా నన్నూ లోపలికి లాగావు.
విక్రమ్: మనం వచ్చింది ఎందుకు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మడి కట్టుకుని కూర్చొడానికి కాదు. స్విమ్ చేసి చాలా రోజులు అయింది. నీతో కలిసి స్విమ్ చేయాలి అనిపించింది అంతే అని విక్రమ్ అంటాడు. ఇద్దరూ ఇలా వాదించుకుంటూ ఒకర్ని ఒకరు వెంటపడతారు.
దీపక్ ఇంకా రావడం లేదని శ్రావణి అనుకుంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి ఎందుకు ఇంకా డబ్బు కట్టలేదు అని అడుగుతుంది. అదే పనిలో నా భర్త ఉన్నారని శ్రావణి చెప్తే పేషెంట్ విషయంలో మీకంటే మేము ఎక్కువ టెన్షన్ పడుతున్నామని చెప్పారు డాక్టర్. ఆపరేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని డబ్బు కట్టమని చెప్తారు. ఇంతలో దీపక్ అక్కడికి వస్తాడు. డబ్బు కట్టమని శ్రావణి చెప్తే అక్క ఊర్లో లేదు వైజాగ్ వెళ్లిందని దీపక్ చెప్తాడు. ఇక దీపక్ డాక్టర్‌తో తన అక్క సామాట్ర్ గ్రూప్స్‌కు సీఈవో అని తను వచ్చి డబ్బు కడుతుంది ఆపరేషన్ చేయమని చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.