Gruhalakshmi October 4th: రత్నప్రభ నిజస్వరూపం తెలుసుకున్న తులసి- దివ్యని బుజ్జగించే పనిలో విక్రమ్!
విక్రమ్, దివ్య ఒక్కటి కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Gruhalakshmi Serial October 4th Episode :తులసి ఆంటీ భోజనం పంపించిందని ఫోన్ చేసి చెప్పారు ఈరోజు అయినా తిననివ్వమని హనీ దీనంగా అడుగుతుంది. సరే స్పూన్ తెచ్చుకోమని ధనుంజయ్ చెప్పి హనీ చేతిలో కాస్త పెట్టేసి పంపించేస్తాడు. వాళ్ళు చేసిన పనికి హనీ చాలా బాధపడుతుంది. సామ్రాట్ ఫోటో దగ్గరకి వెళ్ళి ఏడుస్తుంది. తులసి పనులు చేస్తుందని నందు తిడతాడు. హనీ ఫోన్ ఏమైనా చేసిందా అని అడుగుతుంది. అసలు వాళ్ళు క్యారేజ్ హనీకి ఇచ్చారో లేదోనని నందు డౌట్ గా అంటాడు. వాళ్ళు హనీని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నారు ఎందుకు అనుమానం అంటుంది.
నందు: లాకర్ కోడ్ ఎందుకు ఇచ్చావ్
తులసి: వాళ్ళు అన్నీ వదులుకుని వచ్చి హనీ కోసం ఉంటున్నారు. ఆ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అంకుల్ చెప్పేవాళ్ళు కదా
Also Read: శకుంతలని అవమానించిన ముకుంద- కృష్ణ ఉగ్రరూపం!
హనీకి జ్వరం వచ్చిందని కృష్ణవేణి చెప్తుంది. రత్నప్రభ డ్రైవర్ ని పిలిచి పెద్దాయన్ని హనీని హాస్పిటల్ కి తీసుకెళ్లు, వాళ్ళు తులసిని కలవకుండా చూడమని హెచ్చరిస్తుంది. బసవయ్య తాగిన మైకంలో విక్రమ్ గదికి వెళ్ళి చవితి చంద్రుడి వల్ల నిందలు పడకూడదంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ మాయం చేయాలని అనుకుని వాటిని కొట్టేసిన విషయం గుర్తు చేసుకుంటాడు. వాటిని తీసుకెళ్ళి రాజ్యలక్ష్మి చేతిలో పెడతాడు. అవి చూసి టెన్షన్ గా ఇవి ఎందుకు నీ దగ్గర ఉన్నాయని అంటుంది. జరిగింది మొత్తం చెప్తాడు. మంచి పని చేశావని మెచ్చుకుంటుంది. ఇప్పుడు వీటిని ఏం చేయాలో చెప్పమని అంటాడు. ఎక్కడ నుంచి తీశావో అక్కడే పెట్టమని రాజ్యలక్ష్మి సలహా ఇస్తుంది. ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కడికి పోలేదు సంతోషం లేకుండా చేయడం కోసం డాక్యుమెంట్స్ దివ్య దాచి పెట్టిందని విక్రమ్ ని నమ్మించవచ్చని చెప్తుంది.
దివ్య విక్రమ్ కి కాఫీ తీసుకొస్తే అవసరం లేదని అంటాడు. అప్పుడే జానూ వచ్చి కాఫీ ఇస్తే మాత్రం తీసుకునేసరికి దివ్య బాధపడుతుంది. హనీ భయపడుతుంది. వేరే ఇంటికి వెళ్లిపోదాం ఆ ఇంట్లో ఉండొద్దని తాతయ్యని అడుగుతుంది. కానీ అది జరిగే పని కాదని సర్ది చెప్తాడు. డాడీ తనతో పాటు నన్ను తీసుకుని వెళ్ళి ఉంటే బాగుండేదని బాధపడుతుంది. బసవయ్య మెల్లగా విక్రమ్ గదిలోకి వెళతాడు. హాల్లో ఉన్న విక్రమ్ ఫోన్ కనిపించడం లేదని రాజ్యలక్ష్మి ఫోన్ నుంచి ఫోన్ చేస్తాడు. బసవయ్య ఫోన్ లిఫ్ట్ చేసి విక్రమ్ గదిలో ఉన్నానని నోరు జారతాడు.
విక్రమ్: నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావ్. నా మొబైల్ నీ దగ్గర ఎందుకు ఉందని గబగబా గదికి వెళతాడు
బసవయ్య చేతిలో నుంచి డాక్యుమెంట్స్ జారిపడిపోతాయి. అవి ఎందుకు నీ దగ్గర ఉన్నాయని నిలదీస్తాడు. నువ్వే తీసి దాచి పెట్టావా?
Also Read: అనామిక, కళ్యాణ్ పెళ్లి ఫిక్స్- రాజ్ రహస్యం తెలుసుకున్న కావ్య మనసు ముక్కలు
బసవయ్య: నేను తీసిన మాట నిజమే కానీ కావాలని తీయలేదు నిన్న తాగిన మత్తులో చవితి చంద్రుడిని చూశాను. నిందలు తప్పవని ఎందుకైనా మంచిది జాగ్రత్త చేద్దామని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాను. తర్వాత వాటి సంగతి మర్చిపోయాను. ఇందాక గదిలోకి వెళ్తే ఇవి కనిపించాయి. ఎవరికైనా చెప్తే నిందలు వేస్తారని మళ్ళీ తెచ్చి గదిలో పెట్టబోయాను
విక్రమ్: నీమీద నిందలు పడటం కాదు చేయని తప్పుకి దివ్య నిందలు మోస్తుంది. నాతో మాటలు పడింది సోరి దివ్య. ఎప్పటిలాగానే నిన్ను మళ్ళీ అనుమానించాను. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు
దివ్య: ఇప్పటికైనా డాక్యుమెంట్స్ వినాయకుడి ముందు పెట్టి దణ్ణం పెట్టుకుందాం
హనీ వాళ్ళు గుడికి వస్తారు. గుడికి వచ్చామని తెలిస్తే కొత్త ఆంటీ తిడుతుందని భయపడుతుంది. గుడిలో ప్రసాదంతో అయినా కడుపు నింపుదామని తీసుకొచ్చానని పెద్దాయన చెప్తాడు. సరిగా అదే టైమ్ కి నందు, తులసి గుడికి వస్తారు. వాళ్ళని చూసి డ్రైవర్ మొహం చాటుగా పెట్టుకుంటాడు. పెద్దాయన పెద్ద ప్లాన్ వేశాడు తులసిని గుడికి పిలిపించారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమోనని టెన్షన్ పడతాడు. తులసిని చూసి హనీ వాళ్ళు కావాలని గబగబా వెళ్లిపోతుంటారు. వాళ్ళని తులసి ఆపుతుంది. హనీ తులసి దగ్గర ఉన్న ప్రసాదం వైపు చూస్తుంటే తింటావా అని ఇవ్వబోతుంటే పెద్దాయన ఆపుతాడు.
తరువాయి భాగంలో..
తులసి ఆవేశంగా ధనుంజయ్ వాళ్ళ దగ్గరకి వస్తుంది. హనీ ఎందుకు దడుచుకుంది, తనకి జ్వరం ఎందుకు వచ్చిందని నిలదీస్తుంది. ఇక నుంచి హనీ మీ దగ్గర ఉండదు, ఏం చేస్తారో చేసుకోండి తను నా దగ్గర ఉంటుందని తులసి రత్నప్రభతో ఛాలెంజ్ చేస్తుంది.