Gruhalakshmi October 10th: దివ్య జీవితంలో చిచ్చుపెట్టిన జాహ్నవి- హనీ జోలికి రావొద్దని నందుకి తులసి వార్నింగ్
రత్నప్రభ లాస్య చేతులు కలపడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
విక్రమ్‌ని బుట్టలో వేసుకోవడం కోసం జాహ్నవి కావాలని భోజనం చేయకుండా కూర్చుంటుంది. బాధతో తిండి తినడం మానేసిందని రాజ్యలక్ష్మి కావాలని కొడుకుని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. దీంతో విక్రమ్ వెళ్లి జానూని భోజనానికి రమ్మని పిలుస్తాడు. అందరితో కలిసి భోజనం చేయాలంటే ఏం చేయాలని విక్రమ్ అడుగుతాడు. దివ్య చెంప పగలగొట్టాలని అడుగుతాను చేస్తావా ఏంటని అంటుంది. దివ్యతో సారి చెప్పిస్తే సరిపోతుందా అనేసి తన చేతిని పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకి తీసుకొస్తాడు. పెళ్లాం చూసేసరికి చెయ్యి వదిలేస్తాడు. కానీ జానూ మాత్రం కావాలని విక్రమ్ చేతిని వదలకుండా అలాగే పట్టుకుని ఉంటుంది. అది చూసి దివ్య కోపంగా వెళ్లిపోతుంటే విక్రమ్ ఆపుతాడు.
విక్రమ్: ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే కొట్టినందుకు సారీ చెప్పు
దివ్య: సారీ చెప్తే నేను తప్పు చేసిన దాన్ని అవుతాను
విక్రమ్: మనకి బంధాలు ముఖ్యం. తను మన గెస్ట్
Also Read: కృష్ణనా మజాకా.. ముకుందని చిటికెలో ఓడించేసిన తింగరి పిల్ల!
దివ్య: సారీ అనేసి తినకుండా వెళ్లిపోతుంది. తాను హ్యాపీగా ఉన్నానని పార్టీ కావాలని అడిగితే సరే అంటాడు. వెనుకాలే రాజ్యలక్ష్మి వెళ్లి జానూ గురించి పొగుడుతుంది. అనసూయ ఏడుస్తూ దివ్యకి ఫోన్ చేస్తుంది. కానీ కోపంగా ఉన్న దివ్య కాల్ కట్ చేస్తుంది. పదే పదే ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేస్తుంది. తాతయ్యని ఎవరో కొట్టారని భయంగా ఉందని ఏడుస్తూ చెప్పేసరికి దివ్య కంగారుగా పుట్టింటికి బయల్దేరుతుంది. తులసి దగ్గరే ఉంటానని హనీ అంటుంది. ఇక్కడే ఉంటావని చెప్తుంది. నందు వచ్చి తులసితో మాట్లాడతాడు.
నందు: హనీని రెడీ చేస్తే తీసుకెళ్లి దింపేసి వస్తాను
తులసి: ఇక నుంచి హనీ ఇల్లు ఇదే. ఇక్కడే మనతోనే ఉంటుంది
నందు; తన మీద మనకి అధికారం లేదు
తులసి: కానీ నాకు బాధ్యత ఉంది
నందు: ఎవరు మనం చేసే పని సమర్థించరు
తులసి: హనీ గురించి నేను చూసుకుంటాను సమాజానికి నేను సమాధానం చెప్పుకుంటాను
నందు: ఏ హక్కుతో మన దగ్గర ఉంచుకుంటాం
తులసి; దత్తత తీసుకోమంటారా? నాకు ఏ అభ్యంతరం లేదు. పసి మనసు బాధపెట్టొద్దు. ఇక్కడైన ప్రశాంతంగా ఉండనివ్వండి. అసలు ఏంటి మీ ప్రాబ్లం. హనీని స్కూల్ లో జాయిన్ చేస్తున్నా గార్డియన్ గా నేను సంతకం చేస్తున్నా
Also Read: రాజ్ నాటకం తెలుసుకున్న సీతారామయ్య ఏం చేయబోతున్నారు - వియ్యాలవారిని కడిగిపడేసిన కనకం!
అనసూయ: ఎందుకు తులసి వెంట పడుతున్నావ్
నందు: అవతల రత్నప్రభ నా వెంట పడుతుంది. హనీని ఇంటికి పంపించమని అంటుంది
అనసూయ: పంపించమని చెప్పు
నందు; అలా మొండిగా మాట్లాడినందుకే నాన్నని కొట్టించింది
అనసూయ: ఈ విషయం తులసికి చెప్పవచ్చు కదా
నందు: మొండితనానికి పోయి గొడవ పెట్టుకుంటుంది. తులసికి దగ్గర అవాలని తంటాలు పడుతుంటే మధ్యలో ఇదొక గొడవ
దివ్య ఇంటికి వచ్చి తాతయ్యని చూసి బాధపడుతుంది. ఎవరో కావాలని కొట్టి ఉంటారని తులసి అనుమానపడుతుంది. పార్టీ కోసం విక్రమ్ రెడీ అవుతూ ఉండగా జానూ వస్తుంది. దివ్య వచ్చిన తర్వాత పార్టీ ఇద్దామని అంటే కాదు తనే ఆరెంజ్ చేశానని చెప్పి విక్రమ్‌ని బలవంతంగా తీసుకుని వెళ్తుంది. అక్కడ ఏర్పాట్లు చూసి ఏంటి ఇదంతా అంటుంది. మందు సెటప్ చేస్తుంది. తనకి మందు అలవాటు లేదని అంటాడు. తాగకపోతే మాట్లాడనని బ్లాక్ మెయిల్ చేసి విక్రమ్‌తో మందు తాగేలా చేస్తుంది.
రత్నప్రభ మళ్లీ నందుకి ఫోన్ చేసి బెదిరిస్తుంది. మర్యాదగా హనీని తీసుకొచ్చి అప్పగించమని అంటుంది. తులసి వదిలి పెట్టడం లేదని చెప్తాడు. తన మాట వినకపోతే ఎంతకైనా తెగిస్తానని బెదిరిస్తుంది.