Gruhalakshmi June 27th: బసవయ్య చెయ్యి విరిచేసిన దివ్య- తులసిని తనకి తోడుగా ఉండమన్న నందు
నందు, లాస్యకి విడాకులు కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తన మావయ్య ప్రకాశాన్ని దివ్య బయటికి తీసుకొస్తుంది. అది చూసి రాజ్యలక్ష్మి రగిలిపోతుంది. ఇన్నేళ్లకు నోరు ఎత్తే వ్యక్తి వచ్చిందని ప్రకాశం అంటే ఆ నోరు ఎత్తిన వాళ్ళకి నీకు పట్టిన గతే పడుతుందని రాజ్యలక్ష్మి బెదిరిస్తుంది. మావయ్యకి ప్రపంచం చూపిస్తానంటే ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీకు ఇష్టం లేదా అని దివ్య నిలదీస్తుంది. నీ విషయంలో జోక్యం చేసుకుంటే తనకి కూడా ఒక వీల్ చైర్ వస్తుందని హెచ్చరిస్తుంది. దీంతో భయపడిపోయిన ప్రకాశం లోపలికి తీసుకెళ్లమని చెప్తాడు కానీ దివ్య మాత్రం తనని రెచ్చగొట్టదని అంటుంది. అత్తాకోడళ్ళు ఇద్దరూ మాట మాట అనుకుంటారు. మధ్యలో బసవయ్య నలిగిపోతాడు. మా అక్క నా వెనుక ఉన్నంత వరకు ఏమి కాదని దివ్య మీదకి వెళ్తే తను చెయ్యి మెలి పెట్టెస్తుంది. సరిగ్గా అదే టైమ్ కి విక్రమ్ రావడం చూసి దివ్య తోసేస్తే కింద పడిపోయినట్టు నటిస్తాడు. విక్రమ్ వచ్చి ఏమైందని అడుగుతాడు.
Also Read: మురారీ ప్రపోజల్ ప్రయత్నాలన్నీ తుస్- ఫోటోస్ పంపించిన ముకుంద
మీ ఆవిడ దౌర్జన్యం చేస్తుందని చెప్తాడు. అదంతా నాటకమని దివ్య చెప్పినా కూడా విక్రమ్ నమ్మడు. దివ్యని చెప్పనివ్వకుండా చేసి రాజ్యలక్ష్మి లేనిపోనివి కల్పించి చెప్తుంది. మీ నాన్నని వెలుతురులలోకి తీసుకురావద్దని డాక్టర్ చెప్తే దివ్య మాత్రం వినకుండా బయటకి తీసుకొచ్చింది. తన ఉద్దేశం మంచిదే కానీ అది మంచిది కాదు కదా అని నటిస్తుంది. తల్లి మాటలు నమ్మేసిన విక్రమ్ మావయ్య మీద తిరగబడటం తనకి నచ్చలేదని అనేసరికి దివ్య షాక్ అవుతుంది. బసవయ్య ప్రకాశాన్ని దివ్య చేతుల్లో నుంచి తీసుకెళ్ళి మళ్ళీ చీకటి గదిలో పడేస్తాడు. నందు కేఫ్ అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తులసి వచ్చి ఏం చేస్తున్నారని అడుగుతుంది. అదేంటి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా కేఫ్ అమ్ముతున్నారాని చెప్పేసరికి తులసి వాళ్ళు షాక్ అవుతారు. కేఫ్ అమ్మే ఉద్దేశం లేదని తులసి తెగేసి చెప్తుంది.
Also Read: స్వప్నని చెక్ చేసిన డాక్టర్ - టెన్షన్ లో కావ్య, నిజం బయటపడిపోతుందా?
కేఫ్ నాకు చెప్పకుండా అమ్మేస్తున్నారా? అని తులసి బాధపడుతుంది. సోరి తులసి నీకు చెప్పకుండా అమ్మడం తప్పేనని అంటాడు. కేఫ్ తలుచుకోగానే అక్కడ మనకి జరిగిన అవమానం లాస్య చేసిన గొడవ గుర్తుకు వస్తుంది. పైగా జనం కూడా మన కేఫ్ ని బాయ్ కాట్ చేశారు. ఇప్పుడు దాన్ని పెట్టుకుని మనం ఏం చేస్తామని అంటాడు. ఆ కేఫ్ కూడా తన జీవితం లాంటిదేనని తులసి వేదాంతం మొదలుపెడుతుంది. నందుకి ధైర్యం చెప్పేందుకు ట్రై చేస్తుంది. కేఫ్ వదిలేస్తే ఈ ఏజ్ లో జాబ్ దొరుకుతుందా? దొరక్కపోతే ఏం చేస్తారు. చేతిలో ఉన్నదాన్ని వదులుకుని లేని దాని కోసం ఎందుకు వెళ్లడమని హితబోధ చేస్తుంది. కేఫ్ స్టార్ట్ చేస్తాను నువ్వు నాకు తోడుగా ఉంటావా? దివ్య చెప్పింది నాకు చేతులు కాలిన ప్రతిసారీ నువ్వే అయింట్ మెంట్ రాశావాని. అందుకే నీతోడు కావాలి. కేఫ్ రన్ చేయడంలో నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను ఒప్పుకుంటావా? అని నందు అడుగుతాడు. అందుకు తులసి ఒప్పుకుంటుంది.