Krishna Mukunda Murari June 27th: మురారీ ప్రపోజల్ ప్రయత్నాలన్నీ తుస్- ఫోటోస్ పంపించిన ముకుంద
కృష్ణని మురారీ ప్రేమిస్తున్నాడని ముకుందకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ, మురారీ ఫామ్ హౌస్ లో సరదాగా గడుపుతారు. వాళ్ళని చాటుగా గమినిస్తున్న ముకుంద జలస్ ఫీలవుతుంది. డైరెక్ట్ గా ప్రేమ విషయం చెప్పాలంటే ధైర్యం చాలడం లేదని ఉల్లిపాయలతో హార్ట్ సింబల్ వేసి కృష్ణ చూడాలని కోరుకుంటాడు. కృష్ణ అటూ ఇటూ చేసి ఆ ప్లేట్ లోని ఉల్లిపాయలు చెడిపోయేలా చేస్తుంది. దీంతో మురారీ మొహం మాడిపోతుంది. కృష్ణ కోసం ఫిష్ కర్రీ చేసి దాన్ని కూడా హార్ట్ సింబల్ గా పెడతాడు. ముకుంద రాజ్ నర్స్ కి ఫోన్ చేసి మురారీ చేసిన ఫిష్ కర్రీ తనకి కావాలని చెప్తుంది. దీంతో మురారీ వేరే వైపు ఉన్న టైమ్ లో ఒక వ్యక్తి వచ్చి ఆ ఫిష్ పీస్ తీసేసుకుని రాజ్ నర్స్ తెమ్మని చెప్తాడు. ముకుంద అనుకున్నట్టుగానే మురారీ చేసిన ఫిష్ కర్రీ తన దగ్గరకి తెప్పించుకుంటుంది. మురారీ వంట చేస్తూ చెయ్యి కాల్చుకుంటాడు. దీంతో కృష్ణ అల్లాడిపోతుంది. చేప ముక్క తీసుకురమ్మంది తెప్పించి ఇచ్చాను కానీ దాన్ని నేలకు వేసి కొట్టింది ఎందుకు తోడి కోడళ్ళ మధ్య ఈ పోరు అనుకుని రాజ్ నర్స్ ఆలోచిస్తుంది.
Also Read: చిత్రకి అభిమన్యు వార్నింగ్- యష్ కొంటె వేషాలు కనిపెట్టేసిన వేద
ఎలా నీకు నా ప్రేమ చెప్పాలి. నా ప్రేమ నీకు అర్థం కావాలని ప్రయత్నిస్తున్నా కానీ కుదరడం లేదని మురారీ బాధపడతాడు. ఎందుకు కృష్ణ ప్రేమలో పడిపోయావ్, అలా ఎలా మారిపోతావు. నువ్వు తనని ప్రేమిస్తున్నావని అంటే తట్టుకోలేకపోతున్నానని ముకుంద కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఏసీపీ సర్ మనసులో ఇంకా ఆ డైరీ అమ్మాయే ఉందా?ఒకవేళ ఉంటే నా పరిస్థితి ఏంటని కృష్ణ ఆలోచిస్తుంది. ఇప్పుడే తన మనసులో ప్రేమ చెప్పేయాలని మురారీ మరో ప్రయత్నం చేస్తాడు. నువ్వు తనకి నీ ప్రేమ ఎలా చెప్తావో నేను చూస్తానని ముకుంద అనుకుంటుంది. మురారీ నీళ్ళలో గులాబీ పువ్వులతో ఐలవ్యూ అని రాస్తాడు. ఇప్పుడు కృష్ణ వస్తే తన మనసులో సంగతి తెలుస్తుందని అనుకుంటాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. సరిగ్గా దాని దగ్గరకి వచ్చే టైమ్ కి అది కూడా చెడిపోతుంది. దీంతో మురారీ చాలా బాధపడతాడు.
Also Read: తప్పు తెలుసుకుని రిషి కాళ్ళ మీద పడిన కేడీ బ్యాచ్- కాలేజ్ లో మహేంద్రని చూసి దాక్కున్న వసు
ముకుంద ఫోటోలు తెప్పించి వాటిని మురారీకి పంపించాలని చూస్తుంది. ఇక్కడే ఉన్నానని తెలిస్తే కృష్ణతో పిచ్చి వేషాలు వేయకుండా ఉంటావని డిసైడ్ అవుతుంది. రాజ్ నర్స్ కి ఫోన్ చేసి ఫోటోస్ పంపించే ఏర్పాటు చేస్తుంది. పెద్దత్తయ్య రాగానే విషయం చెప్తే రేవతి అత్తయ్యలాగా నెగిటివ్ గా తీసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటని అనుకుంటుంది. ఫోటోస్ మురారీ చేతికి చేరతాయి. వాటిని చూసి టెన్షన్ పడతాడు. ఇదంతా ముకుంద కావాలనే చేస్తుంది నేను కృష్ణని ప్రేమిస్తున్నానని చెప్పి నాపై ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దని చెప్పేస్తానని అనుకుంటాడు. అప్పుడే కృష్ణ రావడంతో ఫోటోస్ దాచి పెట్టేస్తాడు.