Gruhalakshmi July 7th Update : ప్రేమ్ ని అక్కున చేర్చుకున్న తులసి, అంకిత-అభిల మధ్య గొడవ
పాటల పోటీకి ప్రేమ్ ని ఎలాగైనా పంపించాలని అటు తులసి ఇటు శ్రుతి తాపత్రయపడుతూ ఉంటారు. కాని ప్రేమ్ మాత్రం వెళ్లేందుకు ఆసక్తి చూపించడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
బావగారు నీ మాటలు నమ్మి నిన్ను దగ్గరకి తీసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే నీ పరిస్థితి ఏంటి లాస్య. నలుగురిలో నువ్వు నవ్వుల పాలు అయ్యేదానివి కదా. బావగారు వచ్చి నీ చేతిలో పాయిజన్ బాటిల్ విసిరేసేదాక నా ప్రయాణం కుదుట పడలేదని భాగ్య అంటుంది. తులసక్కది మామూలు తెలివి కాదు. నిన్ను ఇక్కడ నన్ను అక్కడ పెట్టి ఒక ఆట ఆడేసుకుందిగా అని భాగ్య అనేసరికి లాస్య కోప్పడుతుంది. నా టైమ్ బాగోలేదు కాబట్టి తులసికి దొరికిపోయానని లాస్య అంటుంది. నీకు అలా అనిపించినా నాకు ఎలా అనిపించిందో చెప్పనా నీ టైమ్ బాగుంది కాబట్టి తులసి చేతిలో నుంచి బయట పడ్డావని అంటుంది. ఇప్పుడు ఆ విషయం అవసరమా అని లాస్య తిడుతుంది. నన్ను ఇరికించినందుకు తులసక్క మీద పీకల దాకా కోపంగా ఉందని ఛాన్స్ దొరికితే అప్పుడు చూపిస్తాననని భాగ్య అంటుంది.
Also Read: డాక్టర్ సాబ్ తో పెళ్లిచేసే బాధ్యత నాదంటూ మళ్లీ మాటిచ్చిన హిమ, ఇకనైనా జ్వాల(శౌర్య) కోపం తగ్గుతుందా!
అంకిత తులసి దగ్గరకి వచ్చి ఇంతక ముందు జాబ్ లోనే చెరణాని చెప్తుంది. ఈ విషయం అభికి చెప్పావా అని అడుగుతుంది. అభి నాతో బంధానికి విలువ ఇవ్వడం లేదని అంకిత బాధపడుతుంది. అందుకని అభిని దూరంగా ఉంచుదామని అనుకుంటున్నవా, భార్య భర్తల బంధం ఊగుడు బల్ల లాంటిది ఒకసారి భర్తది పై చెయ్యి అయితే మరో సారి భార్యది అవుతుంది జీవితాంతం ఈ బంధం ఇలాగే ఉంటుంది సర్దుకుపోవాలని చెప్తుంది. దాంతో అంకిత సరే అభిని కలుస్తానని చెప్పడంతో తులసి సంతోషపడుతుంది. అనసూయకి ఏదో కొరియర్ వస్తుంది. అందులో ఏముందో అని ఆత్రంగా చూస్తారు నానమ్మ నీకు ఏదో షీల్డ్ గిఫ్ట్ గా వచ్చిందని దివ్య చూపిస్తుంది. షీల్డ్ తో పాటు అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది. నానమ్మ కిచెన్ లో మీ వంటకాలు చూసి ఈ షీల్డ్ పంపించకుండా ఉండలేకపోతున్నానని సతీష్ అనే వ్యక్తి ఆ లెటర్ లో రాస్తాడు. అది విని పరంధామయ్య నీ వంటలు నాకే నచ్చడం నీకు షీల్డ్ రావడమెంటే అని అయోమయంగా అంటాడు. మీ వంటలు చూసి మా ఆవిడ చేసి పెట్టింది ఇంట్లో అందరం హాస్పిటల్ పాలయ్యాము, మీరు ఇంకోసారి వంటలు చేసి యూ ట్యూబ్ లో పెట్టకండి అనుకు గుర్తుగా మీకు ఈ షీల్డ్ పంపిస్తున్నాను అని ఆ లెటర్ లో రాస్తాడు. అది విని అందరూ పగల బడి నవ్వుతారు.
ఇక అంకిత కోసం హాస్పిటల్ లో అభి వెయిట్ చేస్తూ ఉంటాడు. లోపలికి వచ్చిన అంకిత అభిని పట్టించుకోకుండా ఫైల్ పట్టుకుని చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఎందుకు ఈ చిన్న హాస్పిటల్ లో జాయిన్ అయ్యావని అడుగుతాడు. ఎవరో చెప్తే నేను చేయను నాకు నచ్చితేనే చేస్తానని అంకిత అంటుంది. మనసులో ప్రేమ ఉంచుకుని ఎందుకు నన్ను దూరం చేసుకుంటున్నావని అభి అంటే దూరం చేసుకుంటుంది నేను కాదు నువ్వుని అంకిత అంటుంది. మీ ఆంటీనే నాకు నిన్ను దూరం చేస్తుందని అభి అనడంతో అంకిత సీరియస్ అవుతుంది. ఆవిడకి నేనంటే ప్రేమ లేదు, నేనంటే ద్వేషం నేను సంతోషంగా ఉంటే చూడలేదు అందుకే మనిద్దరి మధ్య నిప్పు పెట్టిందని అరుస్తాడు. కాసేపు ఇద్దరి మద్య వాదన జరుగుతుంది.
Also Read: క్లాస్ రూమ్ లో రిషి కోసం వసుధార తపస్సు, రిషి చూస్తుండగా క్లాస్ నుంచి పంపించేసిన జగతి
శ్రుతి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కాగితాలు పడేసి ఉంటాయి. ఏమైంది పాట రాయడానికి కూర్చున్నావా అని సరదాగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతక ముందు నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని చిటికెలో పాత రాసేవాడివి ఇప్పుడు ఏమైందని అంటుంది. ఆ మాటకి ప్రేమ్ కోపంగా అరుస్తాడు. 'నేను ఎదగను చేతకాని వాడిని. నా వల్ల కావడం లేదు కాంపిటీషన్ కి వెళ్లనని చెప్పినా ఒత్తిడి చేసి ఒప్పించావ్ ఇప్పుడు చూడు పాట రాయడానికి ఎంత ట్రై చేసిన రావడం లేదు నా వల్ల కాదు నన్ను వదిలెయ్యి' అని గట్టిగా అరుస్తాడు. దీంతో ఇద్దరు బాధగా కూర్చుని ఉంటారు. అప్పుడే తులసి శ్రుతికి ఫోన్ చేస్తుంది. ప్రేమ్ పాటల పోటీలో పార్టిసిపేట్ చేస్తాడని నాకు నమ్మకం లేదని బాధ పడుతుంది. సరదాగా అన్న మాటలకి కూడా నా మీద సీరియస్ అయ్యాడు. నేను మీరు ఆశపడినట్లు ప్రేమ్ ని మార్చలేకపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇంట్లో నందు దిగాలుగా ఉండటం చూసి లాస్య ఏమైందని అడుగుతుంది. నా ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళాను కంపెనీ కొనే సత్తా లేకుండా ఎందుకురా నాదగ్గరకి రావడం నా టైమ్ వెస్ట్ చెయ్యడం అని క్లాస్ పీకాడని చెప్తాడు.
తరువాయి భాగంలో..
ఎందుకో తెలియకుండా నాలోని శక్తి అంతా హరించుకుపోయినట్టు అనిపించిందమ్మా. ఒక్కసారి నీ బుజం మీద తల పెట్టుకోవచ్చా, నీ దగ్గరకి రావొచ్చా అని ప్రేమ్ ఎమోషనల్ గా తులసిని అడుగుతాడు. ఆ మాటకి కరిగిపోయిన తులసి కొడుకుని అక్కున చేర్చుకుంటుంది. తల్లిని కౌగలించుకుని చిన్న పిల్లడిలా ఏడుస్తాడు.