Krishnamma kalipindi iddarini June 17th: అఖిలకు వార్నింగ్ ఇచ్చిన గౌరీ- సునంద తీసుకున్న నిర్ణయానికి షాకైన సౌదామిని?
సునంద తన కొడుకు ఈశ్వర్ కు ప్రేమించిన అమ్మాయి గౌరీని ఇవ్వటానికి సిద్ధమవ్వటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Krishnamma kalipindi iddarini June 17th:గౌరీ ఈశ్వర్ ని తలుచుకుంటూ బాగా ఎమోషనల్ అవుతుంది. మిమ్మల్ని మర్చిపోలేక పోతున్నాను అంటూ ఏడుస్తుంది. ప్రాణం పోతున్నంత బాధగా ఉంది అని కుమిలిపోతుంది. ఈశ్వర్ తల్లి సునంద చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కష్టంగా ఉన్నా కూడా తట్టుకుంటాను అని బాధపడుతూ ఉంటుంది. నీకు దూరం అవ్వడానికి ప్రయత్నిస్తూ నేనే నరకం అనుభవిస్తాను అని ఏడుస్తూ ఉంటుంది.
అదే సమయంలో తన చెల్లి అఖిల అక్కడికి వచ్చి తను ప్రేమ కోసం ఏడుస్తుంది అనుకొని వెంటనే తన తల్లిని తీసుకొని వచ్చి తను ప్రేమలో ఉందని అందుకే అలా ఏడుస్తుంది అని చెప్పటానికి.. వెంటనే ఆవిడ గౌరీ దగ్గరికి వెళ్లి.. ఎవరా అబ్బాయి అని అంటుంది. నీ మనసు ముక్కలు చేసిన అబ్బాయి ఎవరు అని అడుగుతూ ఉంటుంది. పక్కనే ఉన్న అఖిల కూడా బాగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది.
దాంతో వెంటనే గౌరీ అఖిలపై ఫైర్ అవుతూ నోరు మూయమని అంటుంది. వెంటనే తన తల్లి ఏం జరిగిందో ఈ తల్లికి చెప్పమ్మా అనటంతో నాన్న ప్రమాదం నుండి బయటపడ్డాడు కదా లేదంటే ఏం జరిగేదో అని తలుచుకొని బాధపడుతున్నాను అని చెబుతుంది. అఖిల తన తల్లిని పక్కకు తీసుకొని వెళ్ళి అబద్ధాలు చెబుతుంది అనటంతో.. ఎప్పటికైనా బయట పడుతుంది అప్పుడు చెప్తే దాని పని అంటూ అంటుంది.
ఇక గౌరీ ఒంటరిగా కూర్చొని నీకోసం అమ్మతో అన్ని అబద్ధాలు చెబుతున్నాను అని బాధపడి గతంలో అతనితో గడిపిన క్షణాలను తలచుకుంటుంది. మరోవైపు సునంద కూడా గౌరీ మాట్లాడిన మాటలు, తన కొడుకు గౌరీ గురించి చెప్పిన మాటలు తలుచుకుంటూ బాధపడుతుంది. అప్పుడే తన భర్త వచ్చి అడగటంతో గౌరీ గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది.
సౌదామిని చెప్పిన మాటలు విని గౌరీని బాధ పెట్టాను అని చెప్పి బాధపడుతుంది. దాంతో తన భర్త ఇవన్నీ తుడుచుకుపోవాలి అంటే ఈశ్వర్ తో గౌరీ కి పెళ్లి చేయాలి అని అంటాడు. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మ్యాచ్ కదూ కదా అని అనడంతో.. పెళ్లయ్యాక ఇబ్బందులు వస్తే బాగోదు అని ఏమైనా అవుతే ఈశ్వర్ కూడా తట్టుకోలేడు అని చెప్పటంతో ఆ మాటలు అన్నీ ఈశ్వర్ విని అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు.
మరోవైపు సౌదామిని.. సునంద ఏ నిర్ణయం తీసుకున్నా మనకు లాభం అంటూ.. అంటుంది. శ్రీనిధితో ఈశ్వర్ పెళ్లి కావడం అసాధ్యమని.. అందుకే సునంద తన గౌరీతో ఈశ్వర్ కి పెళ్లి ఒప్పుకునే అవకాశం ఉందని.. అప్పుడు మన ఊరుకోకుండా గట్టిగా నిలదీయాలి అని అందరి ముందు అవమానిస్తాను అని అంటుంది. ఒకవేళ పెళ్లి జరగకున్నా కూడా మనకు లాభమే అని అంటుంది.
తర్వాత అందరూ ఇంట్లో కూర్చొని మౌనంగా ఉంటారు. అదే సమయంలో అక్కడికి సౌదామిని వచ్చి ఇప్పుడు తల్లి కొడుకు మధ్య ఇక్కడ కురుక్షేత్రం అవుతుందని జరగబోయేది చెబుతుంది. ఇంట్లో వాళ్లంతా సునందతో గౌరీ, ఈశ్వర్ ని కలుపుదాము అని అంటుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన సౌదామిని తన తల్లిని గట్టిగా నిలదీస్తుంది.
గౌరీ గురించి నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వదిన మెట్టు దిగి గౌరీ ఇంటి మెట్టు ఎక్కుతుందా అనటంతో ఎక్కుతాను అని సునంద షాక్ ఇస్తుంది. దాంతో సౌదామిని షాక్ అవుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు.
Also Read: Madhuranagarilo June 17th: పండుకు మాట ఇచ్చిన శ్యామ్-పెళ్లి కార్డులో తన ఫోటో ఉందని నిజం చెప్పిన రాధ?