![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Madhuranagarilo June 17th: పండుకు మాట ఇచ్చిన శ్యామ్-పెళ్లి కార్డులో తన ఫోటో ఉందని నిజం చెప్పిన రాధ?
రాధ స్పెషల్ కార్డు తీసి అందులో తన ఫోటో చూసి అందరికీ చెప్పటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
![Madhuranagarilo June 17th: పండుకు మాట ఇచ్చిన శ్యామ్-పెళ్లి కార్డులో తన ఫోటో ఉందని నిజం చెప్పిన రాధ? Shyam assures pandu about his marriage in madhuranagarilo june 17th episode Madhuranagarilo June 17th: పండుకు మాట ఇచ్చిన శ్యామ్-పెళ్లి కార్డులో తన ఫోటో ఉందని నిజం చెప్పిన రాధ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/70de6eaed06b871529c226c1ef9625781686981161598768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Madhuranagarilo June 17th: శ్యామ్ పెళ్లి కార్డు ప్రింట్ చేసే వ్యక్తికి తనతో కలిపి రాధతో ఉన్న ఒక పత్రికను స్పెషల్ గా కొట్టమని.. మిగతావన్నీ సంయుక్త ఫోటోతో కొట్టమని చెబుతాడు. దాంతో ప్రింట్ చేసే వ్యక్తితో పాటు తన ఫ్రెండ్ కూడా షాక్ అవుతాడు. ఇక అక్కడి నుంచి బయటికి వెళ్ళగా తన ఫ్రెండ్ ఎందుకిలా అని అడగటంతో.. తనకు సంయుక్త ఇష్టం లేదు అని.. ఈ పెళ్లి జరగదు అంటూ.. రాధ మాత్రమే ఇష్టమని అంటాడు. మరి ఎందుకు ఈ కార్డ్స్ కొట్టిస్తున్నావు అని అడగటంతో.. కేవలం అమ్మా నాన్న సంతోషం కోసమే అని అంటాడు.
మరోవైపు రాధ కృష్ణ కి ఫోన్ చేస్తూ ఉండటంతో ఆ ఫోన్ కలవక పోయేసరికి టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. ఎలాగైనా ఈ విషయాన్ని మధుర మేడంకి చెప్పాలి అని అనుకుంటుంది. శ్యామ్ కు ఈ పెళ్లి ఇష్టం లేదని.. అంతేకాకుండా శ్యాం ప్రేమిస్తున్న అమ్మాయిని కూడా పట్టుకోవాలి అని అనుకుంటుంది. ఇలా అయితే కాదు అని నేరుగా మధుర దగ్గరికి వెళ్తుంది.
మీకు ఒక విషయం చెప్పాలి అని రాధ మధుర తో అంటూ విషయం చెబుతూ ఉండగా అదే సమయంలో మధురకు తన ఫ్రెండ్ కాల్ చేస్తుంది. తన ఫ్రెండ్ తో తన కొడుకుకు పెళ్లి కుదిరింది అని కబుర్లు చెబుతూ ఉంటుంది. ఇక ఈ మధ్య ఎక్కువ సంతోషం వచ్చినా, ఎక్కువ బాధ వచ్చిన తట్టుకోలేకపోతున్నాను అని దాంతో గుండె నొప్పి వస్తుంది అని ఫోన్ కట్ చేయగా ఆ మాటలు విని.. రాధ నిజం చెప్పలేక పోతుంది.
ఇక గన్నవరం కాసేపు తన గ్యాంగ్ తో కబుర్లు చెబుతూ ఉంటాడు. ఇక శ్యామ్ పండుతో కలిసి ఆడుకుంటూ ఉండగా.. వెంటనే పండు తనకు తన నాన్నను వెతికి ఇవ్వమని కోరుతాడు. దాంతో శ్యామ్ తన మనసులో త్వరలో నేనే నీ తండ్రిని అవుతాను అని అనుకోని ఆ తర్వాత పండు కి కచ్చితంగా వెతికి తీసుకొస్తాను అని మాట ఇస్తాడు.
ఆ తర్వాత మధుర ఇంట్లో రాధ, సంయుక్త లు ఉండగా అదే సమయంలో కార్డ్స్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే అక్కడికి శ్యామ్ రావడంతో పెళ్లి కార్డ్స్ గురించి అడుగుతారు. దాంతో ఇప్పుడు వెళ్లి తీసుకొస్తాను అనడంతో సంయుక్త నేను కూడా వస్తాను అని అంటుంది. కానీ అప్పుడే ప్రింటింగ్ చేసే వ్యక్తి వచ్చి గంట నుంచి మీ ఫోన్ కలవట్లేదు అని చెప్పి అందుకే కార్డ్స్ తీసుకొని వచ్చాను అని అంటాడు.
ఇక మధురవాళ్ళు కార్డ్స్ ఓపెన్ చేస్తూ ఉండగా.. శ్యాం వద్దు అని అంటాడు. ఇక కార్డ్స్ తీస్తుండగా అందులో స్పెషల్ కార్డు కనిపిస్తుంది. వెంటనే సంయుక్త అది తీసి చూస్తూ ఉండగా శ్యామ్ లాక్కుంటాడు. ఇక వీరిద్దరు కార్డు గురించి గొడవ పడుతుంటే వెంటనే రాధ వచ్చి ఆ కార్డు చూస్తుంది. తర్వాయి భాగంలో రాధా ఆ కార్డు చూసి ఆశ్చర్య పోతుంది. అందులో తన ఫోటో ఉందని చెప్పటంతో అందరూ షాక్ అవుతారు.
Also Read: Prema Entha Madhuram June 17th: ఆర్యను టార్గెట్ చేసిన మాన్సీ-జోగమ్మ మాటలకు షాకైన కుటుంబ సభ్యులు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)