Prema Entha Madhuram June 17th: ఆర్యను టార్గెట్ చేసిన మాన్సీ-జోగమ్మ మాటలకు షాకైన కుటుంబ సభ్యులు?
మాన్సీ ఆర్యను టార్గెట్ చేసి జోగమ్మ చేత అన్ని అబద్ధాలు చెప్పించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం
Prema Entha Madhuram June 17th: మాన్సీ గురించి అంజలి నిజం బయట పెట్టడంతో వెంటనే శారదమ్మ షాక్ అవుతుంది. మాన్సీ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటే నేను స్వయంగా విన్నానని అంటుంది. కానీ మాన్సీ అంత అబద్ధమంటూ అనటంతో వెంటనే అంజలి గట్టిగా నిలదీస్తుంది. దాంతో మాన్సీ నువ్వు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి నిందలు వేస్తున్నావంటూ అంజలిపై ఫైర్ అవుతుంది.
ఇక ఆర్యను కూడా నమ్మమని అంటుంది అంజలి. అను ఎక్కడుందో తనకు తెలుసని అనడంతో వెంటనే మాన్సీ నేనెందుకు పంపిస్తాను నాకేం అవసరమని అంటుంది. దాంతో అంజలి.. ఎందుకంటే ఈ ఇంట్లో అనుకు ఉండే మర్యాద చూసి తట్టుకోలేకపోతున్నావు. అందుకే తనను మాయ చేసి ఇంట్లో నుంచి పంపించావు.. అంతేకాకుండా ఆస్తులు నీకు కావాలని ఇలా చేస్తున్నావని అంటుంది.
ఇక మాన్సీ మా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉండేవి కానీ ఇంత పెద్దవి ఏమి లేవంటూ.. నువ్వే ఆస్తుల కోసం నీరజ్ ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు అని అంటుంది. ఇక వెంటనే ఆర్య మాన్సీ ని నువ్వు ఫోన్ లో అలా అన్నవా లేదా అని అనటంతో వెంటనే అన్నాను అంటుంది మాన్సీ. కానీ కళ అనే పనిమనిషితో ఇంట్లోకి రానివ్వను అన్నానంటూ కవర్ చేస్తుంది. ఈ అంజలినే కావాలని లేనిపోనివన్నీ నా మీద క్రియేట్ చేస్తుందని అంటుంది.
కావాలంటే నా ఫోన్ చెక్ చేయండి అనటంతో అందులో అప్పటికే నెంబర్ మార్చేసి ఉంటుంది. ఇక అందరి ముందు బాగా డ్రామా చేస్తుంది. ఇక ఆర్య గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అంజలి చెప్పింది నిజమైతే మరోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక అందరూ వెళ్లిపోగా.. అంజలి మాన్సీతో త్వరలోనే నిజం తెలుస్తుందని అంటుంది.
మరోవైపు పిల్లలు ఇద్దరు ఏడుస్తూ ఉండటంతో వెంటనే అను ఆర్య లాగా మాట్లాడి వాళ్ళని ఊరుకోబెడుతుంది. ఇక ఊరుకున్న పిల్లలను చూసి బామ్మ ఆశ్చర్యపోతుంది. అలా కాసేపు పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఉండగా.. పిల్లలను ఆర్యకు దూరం చేశానని బాధపడుతుంది అను. ఇక మాన్సీ ఆర్య ఎక్కడ అనుని తీసుకొస్తాడో అని టెన్షన్ పడుతూ కనిపిస్తుంది.
ఎలాగైనా అను ఇంటికి రావద్దని అనుకుంటుంది. ఇక అనుపై చేసినట్లే జోగమ్మ ప్లాన్.. ఆర్య మీద కూడా చేయాలని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇక ఆర్య అను గురించి ఎంక్వైర్ చేయాలని మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి మాన్సీ పంపిన జోగమ్మ వస్తుంది. మీ ఇంటి గృహస్థితులు బాలేవని.. కల్లోహాలు ఉన్నాయని అనటంతో వెంటనే శారదమ్మ అవునంటూ ఎమోషనల్ అవుతుంది.
ఇక ఆ జోగమ్మ మాన్సీ చెప్పినట్టు అన్ని నిజాలు చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక తనకోసం మీరు ఎంత వెతికితే అంత దూరం పోతుందని చెబుతుంది. అంతేకాకుండా ఆర్యకు మరణ గండం కూడా ఉందని చెప్పటంతో అందరూ షాక్ అవుతారు. ఆర్య కూడా గతంలో తనకు జరిగిన ప్రమాదాలను తలుచుకుంటాడు. మరోవైపు ఇదంతా చూస్తున్న మాన్సీ సంతోషపడుతుంది.