Neethone Dance Show: స్టేజ్ మీదనే రొమాన్స్‌తో రెచ్చిపోయిన తేజు, అమర్ దీప్ - ఇంట్లో దొరకట్లేదా అంటూ ట్రోల్స్!
తాజాగా సీరియల్ ఆర్టిస్టులు, రియల్ కపుల్ అమర్ తేజ్, తేజస్విని కూడా డాన్స్ పేరుతో బాగా రొమాన్స్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం స్టార్ మా లో
Neethone Dance Show: బుల్లితెరపై రకరకాల ఎంటర్టైన్మెంట్ షోలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా సందడి చేస్తూ ఉంటాయి. ఇప్పటికే డాన్స్, కామెడీ, రియాలిటీ వంటి షోస్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యాయి. కానీ ఈమధ్య ఈ షోలలో పాల్గొనే కంటెస్టెంట్లు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా డాన్స్ ప్రోగ్రామ్స్ లలో మాత్రం డాన్స్ కంటే ఎక్కువగా రొమాన్స్ చేస్తున్నారు. ఎక్కడ కూడా వారు స్టెప్పులు చేసినట్లు కనిపించడం లేదు. మాస్ పాట కైనా సరే రొమాన్సే చేస్తున్నారు. దీంతో చూసే ప్రేక్షకులు డాన్స్ షోలపై బాగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో డాన్సర్లంత స్టెప్పుల కంటే ఎక్కువగా రొమాన్స్ లు చేస్తున్నట్లు కనిపిస్తుంటారు. రీల్ కపుల్స్ అయినప్పటికీ కూడా ఏమాత్రం మొహమాటం పడకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసుకొని అందరి ముందు తెగించేస్తున్నారు.
రీల్ కపుల్సే అలా ఉంటే ఇక రియల్ కపుల్స్ ఎలా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సీరియల్ ఆర్టిస్టులు, రియల్ కపుల్ అమర్ తేజ్, తేజస్విని కూడా డాన్స్ పేరుతో బాగా రొమాన్స్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ‘స్టార్ మా’లో ‘నీతోనే డాన్స్’ అనే రియాలిటీ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. సీరియల్ రియల్ కపుల్స్ తో ఈ షోను నడిపిస్తున్నారు.
ఇప్పటికే ఈ ప్రోగ్రాం కి సంబంధించిన చాలా ప్రోమోస్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అమర్, తేజు కలిసి డాన్స్ చేస్తున్న ప్రోమో విడుదల అయింది. అందులో వారిద్దరు స్టేజి మీద ఒక రొమాంటిక్ పాటకు స్టెప్పులు వేస్తూ కనిపించారు. పైన ముసుగు వేసుకొని మరి రచ్చ రచ్చ చేస్తూ కనిపించారు. ఇక వీరి పర్ఫామెన్స్ చూసి జడ్జిలు కూడా షాక్ అయ్యారు. రాధా సైతం ఇక చాలని అంటే.. సదా మాత్రం ఇంట్లో ఇవన్నీ చేయడానికి ఛాన్స్ దొరకడం లేదా అని వారిని ప్రశ్నించింది. దీనికి అమర్ ‘నో’ అని సమాధానం ఇవ్వడంతో నవ్వులు విరిశాయి.
ఇక దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా.. వారిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ చూసి జనాలు బాగా ట్రోల్స్ చేస్తున్నారు. మీకు ఇంట్లో సమయం దొరకట్లేదా.. అందుకే అందరూ ఉన్నారని కూడా చూడకుండా అలా ప్రవర్తిస్తున్నారేంటి అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది వారి డాన్స్ స్టెప్పులను చూసి ఫీదా అవుతున్నారు.
ఇక అమర్ ఇప్పటికే పలు సీరియల్స్ లలో చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ తో పాటు మరో రెండు మూడు సీరియల్ లో బిజీగా ఉన్నాడు. తన భార్య తేజ కూడా తెలుగులో పలు సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం మరో సీరియల్ లో కూడా బిజీగా ఉంది. ఇక వీరిద్దరూ గతంలో కొంతకాలం ప్రేమాయణం నడిపి ఆ మధ్యనే కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయినప్పటి నుంచి ఈ జంట సోషల్ మీడియాలో మరింత హల్చల్ చేస్తున్నారు. ఇక వీరికి అభిమానులు కూడా చాలా ఎక్కువే.