అన్వేషించండి

Naga Panchami June 16th: పంచమిని బంధించిన కుటుంబ సభ్యులు, ఎవర్ని వదలనంటూ కోపంతో రగిలిపోతున్న నాగేశ్వరి?

పంచమిని గరుడ పక్షి కరవడంతో అందరిలో అనుమానం మొదలవటం వల్ల సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Naga Panchami June 16th: మోక్ష వాళ్ళ వదిన అందరి ముందు పంచమి గురించి నానా రకాలుగా మాట్లాడుతుంది. తన ఇంట్లో ఉండటం వల్ల పాములు వస్తున్నాయని.. తన వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి అని చెబుతుంది. అంతేకాకుండా ఏమీ లేని ఆ పిల్ల నీకు భార్యగా ఎలా వచ్చింది? అసలు మీ జంట బాగోదు అని మాట్లాడుతుంది. వెంటనే వైదేహి ఇది ఇష్టంగా జరిగిన పెళ్లి కాదని అనుకోకుండా జరిగిన పెళ్లి అని అంటుంది.

మోక్ష మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. వెంటనే వైదేహి భర్త ఇది పెళ్లి అన్నట్లు గానే సపోర్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక చిత్ర మాత్రం తన మాటలతో మరింత రెచ్చిపోతుంది. మోక్షతో నీకు గండం ఏం లేదు ఆ పిల్లను వదిలించుకోని అమెరికాకు వెళ్ళిపో అని సలహా ఇస్తూ ఉంటుంది. ఇక అందరూ చిత్రపై అరుస్తూ ఉంటారు. కట్టుకున్న భార్యని ఎలా వదిలిపెట్టమంటున్నావు అని ప్రశ్నిస్తారు.

ఇక మోక్ష తండ్రి పంచమి మంచి అమ్మాయి అని పొగుడుతూ ఉంటాడు. తన అన్నయ్యలు కూడా మోక్ష గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. కానీ వైదేహి మాత్రం అందరు పొగుడుతుంటే బాగా మండిపడుతుంది. దానికోసం మీరు బోర్డు మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు అంటూ గట్టిగా చెబుతుంది. అదే సమయంలో పంచమి వాళ్ళు అక్కడికి రాగా పంచమి శరీరం మీద ఉన్న గరుడ పక్షి చేసిన గాయాలు చూసి మోక్ష టెన్షన్ పడుతూ అడుగుతాడు.

ఇక జ్వాలా అదో పెద్ద స్టోరీ అని జరిగిన సంఘటన గురించి చెబుతుంది. దాంతో అందరూ బయందోళనకు గురవుతారు. బామ్మ కూడా ఎందుకిలా అయ్యింది అని టెన్షన్ పడుతుంది. వెంటనే జ్వాల అర్థమయ్యేది ఏముంది ఆమె పాములోల పిల్ల అని అలా జరిగిందని అంటుంది. అంతేకాకుండా పంచమికి ఏదో దోషము ఉందని నంబూద్రి చెప్పాడని చెబుతుంది జ్వాల.

వెంటనే బామ్మ జ్వాల పై అరుస్తుంది. చిత్రకూడా బాగా చెలరేగి మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే మోక్ష ఫైర్ అవుతూ.. మనకు తెలియని వారి గురించి కూడా ఎవరు ఇంత చండాలంగా మాట్లాడుకోరు అటువంటిది పంచమి గురించి ఇంత చెడుగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ తన వదినను గట్టిగా ఏకి పారేస్తూ ఉంటాడు.

మీరు పంచమి గురించి మాట్లాడినట్టు నేను మీ గురించి మాట్లాడాలి అంటే సంస్కారం అడ్డుస్తుంది అని వాళ్ల నోరు మూయిస్తాడు మోక్ష. ఇక పంచమి బాధపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు నంబూద్రి తన గురించి పంచమి చెప్పిన విషయాలు తెలుసుకుని తనకు గతం తెలిసిపోయింది అని అనుకుంటాడు.

ఇక పంచమి గదిలో జరిగిన విషయాలను తలచుకొని బాధపడుతూ ఉండగా అప్పుడే.. లక్కీ వచ్చి బాధపడకు పిన్ని అంటూ ధైర్యం ఇస్తుంది. ఇక లక్కీ నేను గాయాలకు పసుపు రాస్తాను అనడంతో పంచమి వద్దు అని చెబుతుంది. కానీ వినకుండా లక్కీ గాయాలకు పసుపు పెడుతుంది.

ఇక లక్కీ మీ ఇంటికి వెళ్లొచ్చు కదా అని ఇక్కడ ఎందుకు ఉన్నావు అనటంతో.. తనకు పుట్టినిల్లు అయిన అత్తిలు అయినా ఇదే అంటూ పంచమి చెబుతూ ఉంటుంది. లక్కీ కి పంచమి చెబుతున్న మాటలు విని మోక్ష సంతోషంగా ఫీల్ అవుతుంటాడు. అంతేకాకుండా మూడుముళ్ల గురించి లక్కీకి వివరిస్తూ ఉంటుంది పంచమి.

మోక్ష వచ్చి పంచమిని హాస్పిటల్ కి వెళ్దాం పద అనడంతో.. అప్పుడే లక్కీ నువ్వెందుకు పిన్ని మీద ప్రేమ చూపించడం లేదు.. అందరూ అన్ని మాటలు అంటుంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావో అంటూ ప్రశ్నిస్తుంది. తనని మంచిగా చూసుకుంటానని చెప్పి ప్రామిస్ చేయు అని అంటుంది లక్కీ. ఇక వారిద్దరి చేతులను కలుపుడంతో మోక్ష పంచమిని పొగుడుతూ ఉంటాడు.

నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఏమైనా పని చేస్తానని మాట ఇస్తాడు. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్తారు. ఇక గదిలో నిద్రిస్తున్న పంచమి దగ్గరికి నాగేశ్వరి మరి కొంతమంది నాగదేవతలతో పంచమిని మీద పడుకోబెట్టుకొని తగిలిన గాయాలను చూసి బాధపడుతుంది. తను నాగజాతికి కాబోయే రాణీయే కాదు నా బిడ్డ కూడా అని అంటుంది.

పంచమికి ఏ కష్టం రాకుండా తన తల్లికి మాట ఇచ్చాను అని చెబుతుంది. తనను బిడ్డ లాగా చూసుకునే బాధ్యత నాది అని అంటుంది. రాణి లాగా బతకాల్సిన పంచమి ఇలా బతుకుతుంది అని బాధపడుతుంది. తనకు ఇలా గతి పట్టడానికి కారణమైన వాళ్లను అస్సలు వదలను అని అంటుంది నాగేశ్వరి. తన ప్రాణాలను పణంగా పెట్టైనా సరే నాగా లోకానికి రాణిని చేసి నీ తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని అంటుంది.

ఇక మరుసటి రోజు అందరూ ఒకే దగ్గర ఉండగా పంచమి గురించి అడుగుతుంది బామ్మ. ఇక మోక్ష వాళ్ళ అత్త పంచమి కి ఇలా జరిగిందని బాధపడుతూ ఉండగా.. వెంటనే జ్వాల నన్ను, బామ్మను కాకుండా పంచమిని ఎందుకు ఆ గరుడ పక్షి కరిచింది అని ఆలోచిస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుమానం పడుతూ ఉంటారు. ఇక తరువాయి భాగంలో నంబూద్రి పంచమి బంధించమని చెప్పటంతో వెంటనే చిత్ర పంచమిని ఒక గదిలో బంధిస్తుంది. ఇక పంచమి బాధపడుతూ వీళ్ళందరికీ నాలో పాము లక్షణాలు కనిపిస్తున్నాయా అని బాధపడుతుంది.

Also Read:Trinayani June 16th: ‘త్రినయని’ సీరియల్: ముత్తైదుల తిండిని చూసి షాకైన కుటుంబ సభ్యులు, వెటకారం చేస్తున్న సుమన?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
Embed widget