News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ennenno Janmalabandham July 20th: డబుల్ ట్విస్ట్- వేదకి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్- అభి, మాళవికకి అదిరిపోయే షాక్

మాళవిక మళ్ళీ యష్ ఇంటికి తిరిగి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

వేద కిచెన్ లో ఉండగా మాళవిక వచ్చి “షాక్ అయ్యావా? నేను సోరి చెప్పినందుకు. ఇవాళ చూశావు కదా అందరి ముందు నువ్వు దోషిలా తల దించుకున్నావ్. ఎప్పటికైనా గెలిచేది నేను, ఓడెది నువ్వు. నువ్వు అంటావ్ కదా బంధాలు అనుబంధాలు అని అవన్నీ కరెక్ట్. మాతో బంధం పెంచుకుంటున్న అత్తయ్య నిన్ను దూరంగా ఉండమని అంటున్నారు. అది చాలు నువ్వు దూరంగా వెళ్లిపోతున్నావ్ అనేందుకు. యష్ నా మొగుడు కాదా? మేము కాపురం చేయలేదా అని అంటుంటావ్ కదా. మరి ఎందుకు మేము ఇక్కడ లేకపోతే మాకోసం యష్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నీకు అర్థం కానిది ఒక్కటే.. నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. మేం వసంత్ ఇంటికి వెళ్తున్నప్పుడు చూస్తూ ఉన్నావ్ కదా అది నువ్వు చేసిన తప్పు. వీటన్నింటికీ మించి నువ్వు సవతివి అయినా నన్ను సవతిగా చిత్రీకరించావు చూడు అది నువ్వు చేసిన పెద్ద మిస్టేక్. నువ్వు నన్ను బ్యాడ్ చేయాలని ఎంత ట్రై చేసినా.. దేవుడు దిగి వచ్చినా కూడా జరగదు. ఎవరూ ఏం చేయలేరు. ఖుషి పెంపకం నీది కావచ్చు. కానీ ఆదిత్యలో ఉన్న డీఎన్ఏ నాది. ఈ ఇంటి కోడలి స్థానం నాది. అది ఎప్పటికీ మాళవికదే అర్థం అయ్యిందా? సిద్ధంగా ఉండు నా ముందు తలదించుకుని బయటకి వెళ్ళడానిక”ని ఛాలెంజ్ చేస్తుంది.

Also Read: ఒక్కటైన విక్రమ్, దివ్య- తులసి దేవత అంటూ పొగిడిన నందు

వేద: ఇన్ని చెప్పావు మరి ఎక్కడా నీ బాధ్యత గురించి చెప్పలేదే? నా దగ్గర మాటలు లేవన్నావ్ కానీ ఒక విషయం మర్చిపోయావ్ ఏమి లేని విస్తరాకు ఎగిరేగిరి పడుతుంది. కుప్ప తొట్టి దగ్గర ఉంటే నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది నేను. అసలు నువ్వు ఎలాంటి ఆడదానివో నీకు అర్థం అవుతుందా? భర్తని వదిలేశావ్, వేరే వాడి దగ్గరకి వెళ్లావ్ వాడు తన్ని తగలేస్తే ఇక్కడికి చేరావు. ఇప్పుడు నీ స్థానం గురించి మాట్లాడుతున్నావ్ ఛీ సిగ్గులేదా నీకు. అంతిమంగా గెలిచేది మంచే.. అది తెలుసుకో ఇకనైనా బాగుపడతావ్  

యష్ వేదని బాధపెట్టినందుకు ఫీల్ అవుతూ ఉంటాడు. ఖుషి అర్థం చేసుకున్నట్టు వేదని అర్థం చేసుకోలేకపోయాను. ఆదిత్య మీద ఉన్న ప్రేమతో వేదని చాలా మాటలు అనేశాను. ఇంట్లో నుంచి పంపించేసిందని నోటికొచ్చినట్టు మాట్లాడాను. కేవలం నాకోసం మాళవికకి సోరి చెప్పడానికి ప్రిపేర్ అయిపోయింది. కనీసం ఇంటికి వచ్చిన తర్వాత కూడా వేదకి క్షమాపణ చెప్పలేకపోయాను. అయినా వేద మాళవికకి సోరి చెప్పడం ఏంటి? ఏదోలా కన్వీన్స్ చేసి వాళ్ళని ఇంటికి తీసుకుని రావాలి కదా. వాళ్ళకి వేద చేసిన సాయం కూడా మర్చిపోయానని బాధపడతాడు.

గదిలోకి వచ్చిన వేదకి క్షమాపణ చెప్పాలని అనుకుంటాడు కానీ మౌనంగా ఉండిపోతాడు. తను నిద్రపోయాక తన పక్కన కూర్చుని ఓ సాంగ్ వేసుకుంటాడు. ఇక యష్ నిద్రపోయిన తర్వాత వేద తన పక్కకి వెళ్ళి కూర్చుని సాంగ్ కంటిన్యూ చేస్తుంది. అభిమన్యు తల పట్టుకుని కూర్చుంటే ఖైలాష్ వచ్చి ఏమైందని అడుగుతాడు.

అభి: కడుపు గురించి గట్టిగా నిలదీద్దామంటే కోపం వచ్చి మళ్ళీ జైలుకి పంపిస్తుందేమో భయం

ఖైలాష్: నిజం చెప్పు బ్రో సిస్టర్ తల్లి కావడానికి నువ్వే కారణం కదా అనేసరికి లాగిపెట్టి కొడతాడు

Also Read: కృష్ణని సర్ ప్రైజ్ చేసిన మురారీ- భవానీతో షికార్లు కొట్టిన తింగరిపిల్ల

అభి: నా వల్ల తల్లి అయితే ఇలా మింగలేక కక్కలేక ఉంటానా

ఖైలాష్: నువ్వే నిజం తెలుసుకో

అభి: అడిగితే కొట్టినా కొడుతుంది అవసరమా

ఖైలాష్: అమ్మాయిలని లైన్లో పెట్టె నీకు వేరే వాళ్ళు చెప్పాలా అనేసరికి అభి నీలాంబరి దగ్గరకి వెళతాడు.

అభి: మనకి శోభనం జరగలేదు కదా మరి నువ్వు తల్లివి ఎలా అయ్యావు నీలా అనేసరికి ఏడుపు మొదలుపెడుతుంది.

నీలాంబరి: నాకు గతం ఉంది. అందులో నాకొక మాజీ లవర్ ఉన్నాడు. ఇద్దరం అమర ప్రేమికుల్లాగా బతికాం. తన దగ్గర సంగీతం కూడా నేర్చుకున్నా. మీరు నా గతం గుర్తు చేసి ఏడిపించారని సగం చెప్పేసి వెళ్ళిపోతుంది.

Published at : 20 Jul 2023 01:14 PM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial July 20th Episode

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!