Ennallo Vechina Hrudayam Serial Today May 6th: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలని అరెస్ట్ చేయించిన గాయత్రీ.. ఇంటిళ్లపాది ఏడుపు!
Ennallo Vechina Hrudayam Today Episode గాయత్రీకి అనంత్ నిజం చెప్పడం గాయత్రీ బాలని అరెస్ట్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ennallo Vechina Hrudayam Serial Today Episode గాయత్రీని ఫస్ట్‌నైట్ గదికి పంపిస్తారు. గాయత్రీ పాల గ్లాస్ తీసుకొచ్చి ఇస్తుంది. బయట నుంచి వాసుకి, నాగభూషణం, రమాప్రభ, ఊర్వశిలు త్రిపుర తమ ప్లాన్ వేస్ట్ చేసేసిందని అనుకుంటారు. ఇంతలో అక్కడే ఉన్న వాసుకి కళ్లు తిరుగుతూ మత్తు మత్తుగా ఉంటుంది. ఏమైందని రమాప్రభ అడుగుతుంది. దాంతో ఇందాక ఎక్కిళ్లు వస్తే బాల పాలు తాగించాడని చెప్తుంది.
త్రిపుర ఫస్ట్‌నైట్ కోసం పాలు తీసుకెళ్తుంటే బాల ఆపి ఎక్కిళ్లు వస్తున్న వాసుకికి తాగిస్తాడు. రమాప్రభ తన ప్లాన్ చెడగొట్టారని తిట్టుకుంటుంది. ఏమైందని అడుగుతారు. ఫస్ట్‌నైట్ కోసం కలిపిన పాలలో మత్తు మందు కలిపితే మీ ఆవిడ తాగేసింది మీరు ప్లాన్ వేయరు వేస్తే చెడగొడతారు రమాప్రభ ఇద్దరినీ తిడుతుంది. వాసుకి రమాప్రభ మీద పడుకుండిపోతుంది. ఇక ఫస్ట్‌నైట్ గదిలో గాయత్రీ అనంత్‌కి సగం పాలు తాగి ఇవ్వమని అడుగుతుంది.
అనంత్ సగం తాగి గాయత్రీకి ఇస్తాడు. గాయత్రీ తాగబోతే అనంత్ ఆపి నిజం చెప్పాలి అనుకుంటాడు. మీ జీవితాలు తారుమారైన సంగతి గురించి మాట్లాడాలి అంటాడు. అర్థం కాలేదు అని గాయత్రీ అంటే మీ నాన్నగారి యాక్సిడెంట్ గురించి నీకు ఇప్పుడు నిజం చెప్పాలి గాయత్రీ అది తెలిస్తే నేను ప్రశాంతంగా ఉంటాను అంటాడు. మీ నాన్న గారికి యాక్సిడెంట్ చేసింది ఎవరో నాకు తెలుసు అని అంటాడు. మీ నాన్నని కారుతో యాక్సిడెంట్ చేసింది మా అన్నయ్యే అని అనంత్ గాయత్రీకి చెప్తాడు. గాయత్రీ షాక్ అయిపోతుంది. తాతయ్య చనిపోవడంతో వేగంగా వస్తున్న మా అన్నయ్య మీ నాన్నని యాక్సిడెంట్ చేశాడని అందుకే మీ నాన్న చనిపోయారని అంటాడు.
గాయత్రీ పాల గ్లాస్ కింద పడేసి షాక్ అయిపోయి ఏడుస్తుంది. తన అన్న తప్పు లేదని అనంత్ చెప్పబోతే గాయత్రీ కోపంతో రగిలిపోతుంది. మీ అన్నయ్య యాక్సిడెంట్ చేశాడని ముందే తెలిసి ఇప్పుడు చెప్తున్నారు అంటే ఇదంతా కావాలనే చేశారని అంటుంది. మీ అన్నయ్య గురించి మేం తప్పుగా అనుకోకూడదు అని మీరు ప్రేమ పేరుతో నన్ను పెళ్లి చేసుకొని నన్ను కట్టిడి చేయాలని మీ ఫ్యామిలీ ప్రయత్నించారని అంటుంది. మీరు చేసినప మోసానికి మీ అన్నయ్య చేసిన నేరానికి శిక్ష పడేలా చేస్తానని అంటుంది. బయటకు వెళ్లి అందర్ని పిలుస్తుంది.
త్రిపురని పిలిచి అక్క మన నాన్నని యాక్సిడెంట్ చేసి చంపింది ఎవరో కాదు ఈ బాలగారు అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఈ విషయం వీళ్లందరికీ తెలిసి మనల్ని నన్ను కోడల్ని చేసుకున్నారు. ఇంత నీచమైన పని ఏంటి అంటే మన నాన్నని చంపిన హంతకుడినే నీతో వీళ్లు సేవలు చేయిస్తున్నారు. ఇంట్లో అందరూ తమకు ఈ విషయం తెలీదు అంటారు. గాయత్రీ అనంత్‌ని నిలదీస్తుంది. అనంత్‌ని ఏం అనొద్దు గాయత్రీ అని బాల అంటాడు. దానికి గాయత్రీ మీరు మనుషుల్ని చంపేస్తే ఎలా ఊరుకుంటానని అంటుంది. ఇలాంటి వాడినా నేను ప్రేమించింది అని గాయత్రీ అంటుంది.
అనంత్ నిజమే అని చెప్తాడు. త్రిపుర కుప్పకూలిపోతుంది. మా నాన్న కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉందని గాయత్రీ పోలీసులకు ఫోన్ చేస్తుంది. తాతయ్య, త్రిపుర ఎవరు ఆపినా ఆగకుండా పోలీసులకు ఫోన్ చేస్తుంది. యశోద, బామ్మ అందరూ అరెస్ట్ చేయించొద్దని బతిమాలుతారు. బాల గాయత్రీతో నా మీద ఎందుకు అంత కోపం అని అడిగితే నువ్వు ఒక హంతకుడివి అని అంటుంది. త్రిపుర అందరూ కోప్పడతారు. అందరూ గాయత్రీని బతిమాలుతారు కానీ గాయత్రీ వెనక్కి తగ్గదు.
పోలీసులు రావడం చూసిన బాల ఏడుస్తాడు. నేను కాదు నేను కాదు అని ఏడుస్తాడు. త్రిపుర కూడా ఏడుస్తుంది. తీరా చూస్తే ఇదంతా అనంత్ కల. గాయత్రీ బావగారి గురించి ఒక విషయం చెప్తానని బావగారు ఇలా ఉండగా మనం సంతోషంగా ఉండటం కరెక్ట్ కాదని బావగారికి నయం అయిన వరకు మనం కార్యం చేసుకోవద్దని అంటుంది. దాంతో గొప్ప ఆలోచన అని అంటాడు. మా అక్క నయం చేస్తుందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!





















