అన్వేషించండి

Karthika Deepam 2: ‘కార్తీక దీపం’ సీక్వెల్‌పై డాక్టర్ బాబు క్లారిటీ, మళ్లీ వంటలక్కతో జతకట్టనున్నాడా?

బుల్లితేరాపై కార్తీకదీపం సీరియల్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అలాంటి ఈ సీరియల్ పార్ట్ 2 మళ్ళీ త్వరలో రావడానికి సిద్ధంగా ఉందని తాజాగా డాక్టర్ బాబు ఒక చిన్న హింట్ ఇచ్చాడు.

Karthika Deepam 2: ‘కార్తీకదీపం’ సీరియల్ ముగిసి కొన్ని నెలలు అయినప్పటికీ కూడా ప్రేక్షకులు ఈ సీరియల్ పై ఉన్న అభిమానాన్ని చంపుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను అస్సలు మర్చిపోలేకపోతున్నారు. అయితే ఈ కాంబినేషన్ మళ్ళీ త్వరలో రావడానికి సిద్ధంగా ఉందని తాజాగా డాక్టర్ బాబు ఒక చిన్న హింట్ ఇచ్చాడు. 

ఐదు సంవత్సరాల కిందట స్టార్ మాలో ప్రారంభమైన ఈ సీరియల్ తమ కంటెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగిన ఈ కథకు ప్రేక్షకులు బాగా ఫిదా అయ్యారు. చాలావరకు ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో చాలా సీరియల్స్ వస్తూ ఉంటాయి. కానీ ఏ సీరియల్ కు కనెక్ట్ కానీ ప్రేక్షకులు ‘కార్తీకదీపం’కు కనెక్ట్ అయ్యారు. అంతలా ఈ సీరియల్ వారికి అభిమాన సీరియల్ గా మారిపోయింది. కేవలం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు సైతం ఈ సీరియల్స్ కు వాలిపోయారు.

అంతే కాదండోయ్ కొంతమంది స్టార్ సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ ను చూసేవారు. అలా ప్రతి ఒక్కరికి ఈ సీరియల్ కథ కనెక్ట్ అవ్వడమే కాదు ఈ సీరియల్ లో నటించిన పాత్రలు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు పాత్ర. ఈ సీరియల్ లో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించగా వీరి మధ్య వచ్చిన ఆటుపోట్లే ఈ సీరియల్ కథ. చాలా వరకు అందరికీ ఈ సీరియల్ స్టోరీ తెలిసిందే. ప్రేమించిన వ్యక్తికి పెళ్లయి, పిల్లలు పుట్టినప్పటికీ కూడా ప్రేమ తగ్గించుకోకుండా చివరి వరకు అంతే ప్రేమతో తుది శ్వాస విడిచి గొప్ప ప్రేమికురాలుగా నిరూపించింది మోనిత పాత్ర.

అంతేకాకుండా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా చివరికి భర్త తనను కాదని గెంటేసిన కూడా తిరిగి తన భర్త ప్రేమను పొంది మంచి భార్యగా అనిపించుకుంది దీప. అలా కొనసాగిన ఈ సీరియల్ రొటీన్ స్టోరీ అయినప్పటికీ కూడా డైరెక్టర్ బోర్ కొట్టకుండా ప్రేక్షకులకు సీరియల్ కు వాలేలా చేశాడు. అయితే చివరికి ఏం చేయాలో తెలియక సీరియల్ ను మొత్తానికి ఆ విధంగా ముగించేశాడు. అయితే ఈ సీరియల్ అభిమానులు మాత్రం ఈ సీరియల్ శుభం కార్డు పలకటంతో అసలు తట్టుకోలేకపోయారు.

కానీ ఆ సమయంలో డైరెక్టర్ సీజన్ 2 ఉంటుంది అన్నట్లుగా ఒక హింట్ అయితే ఇచ్చాడు. అప్పటినుంచి ప్రేక్షకులు ‘కార్తీకదీపం’ 2 కోసం తెగ ఎదురు చూస్తున్నారు. అయితే పార్ట్ 2 గురించి ఇప్పటివరకు డైరెక్టర్ కానీ, ‘కార్తీకదీపం’ టీం కానీ హింట్ ఇచ్చినట్లు అనిపించలేదు. కానీ తాజాగా డాక్టర్ బాబు పాత్రల్లో నటించిన నిరూపమ్ పరిటాల పార్ట్ 2 గురించి స్పందించాడు. తాజాగా నిరూపమ్ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఇక ఇప్పటికీ తాను ఎక్కడికి వెళ్లినా కూడా ‘కార్తీకదీపం’, వంటలక్క గురించి అడుగుతుంటారు అని అన్నాడు.

ఇక తన పేరు మర్చిపోయి అందరు డాక్టర్ బాబు అని పిలుస్తుంటారు అని.. తన విశ్లేషణ ప్రకారం ప్రతి ఒక్కరి జీవితాల్లో గొడవలు ఉంటాయని.. అందుకే ప్రతి ఒక్కరికి ‘కార్తీకదీపం’ సీరియల్ కనెక్ట్ అయ్యింది అని అన్నాడు. ఇక తన భార్య మంజులతో బయటికి వెళ్లినా కూడా వంటలక్క గురించి అడుగుతుంటారు అని.. ఇక ఆమెకు పరిస్థితి తెలుసు కాబట్టి నవ్వి ఊరుకుంటుందని అన్నాడు. ఇక ‘కార్తీకదీపం’ 2 ఉంటుందా అని ప్రశ్న ఎదురవటంతో.. తనకు తెలిసి ఉండకపోవచ్చు అంటూ.. ఎందుకంటే ఆ రేంజ్ కథ దొరకాలి. అన్ని కుదిరితే సీజన్ టు చేయాలి.. లేకపోతే టచ్ చేయకపోతేనే బెటర్ ఏమో.. కానీ తమ ఇద్దరి కాంబోలో మరో సీరియల్ చేయొచ్చు అని అన్నాడు. అంటే ‘కార్తీకదీపం’ 2 ఉన్నా లేకపోయినా.. డాక్టర్ బాబు, వంటలక్క కాంబినేషన్లో మరో సీరియల్ ఉండబోతుందని తెలుస్తుంది.

Read Also: ‘స్పై’ to ‘సామజవరగమన’- జూన్‌ చివరి వారంలో థియేటర్లలో సందడి చేసే సినిమాలివే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget