Devatha June 27th (ఈరోజు) ఎపిసోడ్: బయటపడ్డ మాధవ్ నిజస్వరూపం- డైలాగ్స్‌తో రెచ్చిపోయిన రుక్ముణీ
అత్తగారు ఇచ్చిన చీర, గాజులు చూసి మురిసిపోతుంది రుక్మిణి. అత్తయ్య ఎట్లుందో చూద్దామని వెళ్తే పచ్చంగా పది కాలాలు ఉండమని ఈ చీర గాజులు నా చేతికి వచ్చేటట్టు చేసినావా అని దేవుణ్ని అడుగుతుంది.
రుక్మిణీ కోసం పూజలు చేసిన దేవుడమ్మ...గుడిలో అందరికీ వాయినాలు ఇస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా రుక్మిణి కోసం డిస్కషన్ జరుగుతుంది. రుక్మిణి ఎక్కడ ఉన్నా వస్తుందని నమ్మకంతో చెప్తాడు ఆదిత్య. రుక్మిణీ ప్రాణాలతో ఉందని తెలిసాక కూడా ఎక్కడుందో తెలియకపోవడం బాధగా ఉందని... ఆ బాధ కంటే ఉపవాశాలు ఉంటడం బాధ కాదంటుంది. రుక్మిణి వస్తుందని.. కచ్చితంగా వస్తుందని అంటాడు ఆదిత్య. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావని తండ్రి ప్రశ్నిస్తాడు. ఏం చెప్పాలో అర్థం కాక ఏదో సర్ధి చెప్తాడు.
ఇంతలో సత్య వచ్చి గుడ్ న్యూస్ అంటు చెబుతుంది. ఏంటని అడుగుతారంతా. తనకు పిల్లలు పుడతారని అంటుంది. అందుకు దారి ఉందని చెబుతుంది. అమెరికాలో అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేస్తారని వివరిస్తుంది. సమస్యకు పరిష్కారం ఉందని చెబితే అమెరికా ఏంటి ఎక్కడికైనా వెళ్లొచ్చని అంటుంది దేవుడమ్మ. అయితే వాళ్లకు తన రిపోర్ట్స్ పంపించానని.. వాళ్లు ఒప్పుకున్నారని వివరిస్తుంది. పిల్లలు పుట్టే అవకాశం ఉందని అమెరికా వెళ్లాలని అంటుంది. ఇంతలో ఆమె భర్త ఆదిత్య ఆలోచనలో పడతాడు. తాను వెళ్లిపోతే దేవి మరింత దూరం అవుతుందని... బిడ్డ తనకు కాకుండా పోతుందని ఆలోచిస్తాడు. అమెరికా ఇప్పటికిప్పుడు కుదరదని చెప్తాడు. అది పెద్ద ప్రోసెస్ ఉంటుందంటాడు. దానికి అంత కష్టపడాల్సిన పనిలేదని... అందతా తాను చూసుకుంటానని అంటుంది సత్య. తల్లి కూడా ఓకే వెళ్లి అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోమంటారు. ఇదంతా అమ్మవారి దయా అనుకుంటారు.
ఇక్కడ అత్తగారు ఇచ్చిన చీర, గాజులు చూసి మురిసిపోతుంది రుక్మిణి. అత్తయ్య ఎట్లుందో చూద్దామని వెళ్తే పచ్చంగా పది కాలాలు ఉండమని ఈ చీర గాజులు నా చేతికి వచ్చేటట్టు చేసినావా అని దేవుణ్ని అడుగుతుంది.
దేవుడమ్మను కూడా అమెరికా బయల్దేరి వెళ్లమని చెబుతుంది చిన్న కోడలు. వాళ్లకు చేదోడుగా ఉంటుంందని అంటుంది. సర్లే ఆదిత్యను అడుగుతానుంటుంది దేవుడమ్మ.
ఇంతలో ఆదిత్యకు ఫోన్ వస్తుంది. గుడిలో జరిగిన సంఘటన గురించి ఆదిత్యకు రుక్మిణీ చెబుతుంంది. అత్తను చూద్దామని గుడికి వస్తే పూజరి పిలిచి ఆ చీరా జాకెట్ ఇచ్చారని అంటుంది. ఇది వింటుంటే చాలా ఆనందంగా ఉందంటాడు. కానీ సత్య ఆలోచన వింటుంటే బాధగా ఉంటుందని చెప్తాడు. అమెరికా వెళ్లి ఆపరేషన్ చేయించుకుంటానని అంటుందని వివరిస్తాడు. వెళ్తే మంచిదే కదా అంటుంది రుక్మిణీ. దేవి, నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్లమంటావని ప్రశ్నిస్తాడు. తాను వెళ్లిపోతే... ఎప్పటికీ దేవికి దగ్గర కాలేనని అంటాడు. బిడ్డను నీ దగ్గరకు చేర్చే ప్రయత్నం నేను చేస్తానని.. నువ్వు మాత్రం అమెరికా వెళ్లమని చెప్తుంది. పిల్లలు లేరని అత్తమ్మ బాధ చూసైనా వెళ్లమంటుంది రుక్మిణి. తాను వెళ్లేలేనని... దేవినే తన బిడ్డగా చెప్తే సంతోషిస్తందని అంటాడు. అమెరికా వెళ్లకపోతే సత్య బాధపడుతుందని రుక్మిణి ప్రాధేయపడుతుంది. అయినా ఆదిత్య ఒప్పుకోడు. అమెరికా వెళ్లలేనంటాడు.
మళ్లీ ఆదిత్య, రుక్ముణీ దగ్గరవుతున్నారని మండిపడుతుంటాడు మాధవ్. రాధకు తనకు పెళ్లి కాలేదని గ్రహించే వీళ్లిద్దరూ బరితెగించారని అనుకుంటాడు. ఎలాగైనా రాధను తన ఇంటిదాన్ని చేసుకోవాలనుకుంటాడు. దీని కోసం ఎంతకైనా తెగిస్తానంటాడు.
ఒంటరిగా కూర్చొని ఉన్న దేవుడమ్మ రుక్ముణి కోసం ఆలోచిస్తుంటుంది. ఇంతలో తోటికోడలు రాజమ్మ వచ్చి నిన్ను ఇంతలో ఎందుకు బాధపెట్టుకుంటావని ప్రశ్నిస్తుంది. మనసులో బాధను వివరిస్తుంది దేవుడమ్మ. పూజరి చెప్పినట్టు రుక్ముణి తిరిగి వస్తుందని అంటుంది. ఎప్పుడు వస్తుందని గట్టిగా అరుస్తుంది. రుక్ముణీ ఇంటి నుంచి వెళ్లినప్పుడు కడుపుతో ఉందని... అ బిడ్డలో ఎన్ని కష్టాలు పడుతుందో అర్థం కావడం లేదంటుంది దేవుడమ్మ. ఇంటికి రావడానికి ఎందుకు ఆలోచిస్తుంది... అలా ఎందుకు ఇంటికి దూరంగా ఉందని అనుకుంటుంంది. ఇవన్నీ అర్థం కాక నాలో నేనునలిగిపోతున్నాను రాజమ్మ అంటుంది. నువ్వు అంతగా బాధ పడొద్దని... రుక్మిణి రాకూడదు అనుకోవడం లేదని... తను రాలేని పరిస్థితుల్లో ఉందేమో అంటుంది. కచ్చితంగా పూజలు ఫలించి తన అడ్డంకులు తొలగిపోయి రుక్మిణి వస్తుందని భరోసా ఇస్తుంది రాజమ్మ. దాంతో కాస్త ఆనంద పడుతుంది దేవుడమ్మ.
ఇక్కడ మనవరాళ్లతో మాధవ్ ఫేరెంట్స్ ఆడుకుంటూ ఉంటారు. కళ్లకు గంతలు కట్టే ఆట ఆడుతుంటారు. ఇంతలో మాధవ్ వస్తాడు. ఆతన్ని పట్టుకొని పట్టుకున్నానని.. ఎగిరి గంతేస్తుంది దేవి. మాధవ్ చిరగ్గా వదులూ అని కసురుకుంటాడు. దానికి అంతా షాక్ అవుతారు. తర్వాత మాధవ్ సారీ చెప్తాడు. ఏదో టెన్షన్‌లో ఇలా చేశానంటాడు. కోపంలో ఇలా చేశానంటూ చెప్తాడు. ఏడుస్తూ దేవి వెళ్లిపోతుంది. ఎవరు పిలిచినా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది.
అది చూసిన మాధవ్ తండ్రి కోప్పడతాడు. తల్లి కూడా గద్దిస్తుంది. పిల్లలలను ఇలానే చేస్తారా అంటూ నిలదీస్తారు. అంతా దేవి వద్దకు వెళ్లిపోతారు. రుక్మిణి మాత్రం అక్కడే ఉండి మాధవ్‌కు వార్నింగ్ ఇస్తుంది. దేవి వద్ద నటిస్తున్నావని.. తనను లొంగదీసుకోవడానికి దేవిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావని అంటుంది. నువ్వు ఎన్నిచేసినా నా బిడ్డను తన తండ్రి దగ్గరకు పంపిస్తానంటూ శపథం చేస్తుంది రుక్మిణి.