Chiranjeevi lakshmi sowbhagyavati Serial Today August 29th: ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్: జున్నుకు నిజం చెప్పిన లక్ష్మీ – లక్ష్మీకి కవలలు పుట్టారన్న నిజం తెలుసుకున్న దేవయాని
Chiranjeevi lakshmi sowbhagyavati Today Episode: మిత్రను నమ్మించి మనీషాతో పెళ్లి చేయాలనుకున్న దేవయాని ఆశలపై సంయుక్త నీళ్లు చల్లడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Chiranjeevi lakshmi sowbhagyavati Serial Today Episode: లక్ష్మీ చేతికి ఉన్న కట్టు చూసి జున్ను షాక్ అవుతాడు. నిన్న సామ్ ఆంటీ చేతికి కూడా సేమ్ కట్టు చూశాను. అంటే నువ్వే సామ్ ఆంటీవా? అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మీరిద్దరు ఒకటేనా? అని అడుగుతాడు. లేదు మేము ఒక్కటి కాదు అంటుంది లక్ష్మీ. జున్ను నువ్వు నన్ను మోసం చేశావు. అంటూ బయటకు వెళ్లిపోతాడు. అర్జున్, జున్నుకు నిజం తెలిసిపోయిందని వెళ్లి నిజం చెప్పు అంటాడు. అయితే జున్ను కు అన్ని చెప్తాను. ఒక్కవాళ్ల నాన్నకు తప్పా.. అని జున్ను దగ్గరకు వెళ్తుంది లక్ష్మీ .
లక్ష్మీ: నేను నీకు అబద్దం చెప్పలేదు జున్ను నీ దగ్గర నిజం దాచాను అంతే
జున్ను: నిజం చెప్పకపోవడం అబద్దమే కదా?
లక్ష్మీ: కాదు ఒక మంచి పని కోసం నిజం దాస్తే అది తప్పు కాదు.
జున్ను: అసలెందుకని నువ్వు శామ్ ఆంటీలా వాళ్ల ఇంట్లో ఉన్నావు.
అని జున్ను అడగ్గానే అక్కడ ఒక సమస్య ఉందని అది నేను నేనులా చేయలేను కాబట్టి అలా వెళ్లాను అని చెప్తుంది లక్ష్మీ. జున్నుకు అర్తమయ్యేలా చెప్తుంది. దీంతో జున్ను కన్వీన్స్ అవుతాడు. మరోవైపు మనీషా, మిత్ర కలిసి లక్కీని గోపికలా రెడీ చేస్తుంటారు.
మనీషా: మిత్ర ఈ పనులననీ నీకెందుకు లక్కీని నేను రెడీ చేస్తానుగా నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో..
మిత్ర: మనీషా రెస్ట్ తీసుకోవాల్సింది నువ్వు. నీ చేతికే కదా గాయం అయ్యింది. ఆ నొప్పి ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నా ఆనందం అంతా లక్కీని రెడీ చేయడంలోనే ఉంది మిత్ర.
దేవయాని: మనీషా బంగారం లాంటి మాట చెప్పావు. లక్కీ అంటే ఎంత ప్రేమ. ఎంత శ్రద్ద. రేపు అదృష్టం బాగుండి నీకు మిత్రకు పెళ్లి అయి ఒక పాప పుడితే లక్కీని చూసుకున్నట్లు ఆ పిల్లను చూసుకోవేమో..?
మనీషా: అదేంటి ఆంటీ అలా అంటున్నారు. ఒకవేళ నాకు మిత్రకు పెళ్లైతే నాకు పిల్లలు అవసరం లేదు. నాకు లక్కీ చాలు.
అని మాట్లాడుకుంటుంటే మిత్ర వింటుంటాడు. తర్వాత మనీషా, లక్కీని తీసుకుని వెళ్లిపోతుంది. మనీషా గురించి దేవయాని మిత్రకు గొప్పగా చెప్తుంది. మరోవైపు గోపికగా మారిన లక్కీని చూసిన అరవింద, జయదేవ్ వివేక్ చాలా హ్యాపీగా ఫీలవుతారు. చాలా అందంగా ఉన్నావని అందరూ అంటుంటే ఇంతలో మిత్ర వచ్చి ఆ క్రెడిట్ అంతా మనీషాది అంటూ వస్తాడు. దేవయాని కూడా మనీషా వల్లే లక్కీ అంత అందంగా రెడీ అయ్యిందని అంటుంది.
దీంతో మనీషా వల్ల లక్కీకి అందం రాలేదని.. లక్కీకి నాచురల్ బ్యూటీ అని అరవింద చెప్తుంది. లక్కీకి ఎంత గెటప్ వేసినా ఒక్కటి తక్కువ అయ్యిందని అరవింద అనగానే జయదేవ్, వివేక్ కూడా ఏదో మిస్ అయ్యిందని ఆలోచిస్తుంటారు. ఇంతలో లక్ష్మీ వస్తుంది. పాపిట బిల్ల మిస్ అయ్యిందని లక్ష్మీ చెప్పగానే అందరూ అవునని అంటారు. జాను వెళ్లి పాపిటబిల్ల తీసుకురావడంతో లక్ష్మీ పెడుతుంది.
లక్ష్మీ: సూపర్‌గా ఉన్నావు లక్కీ.. జున్ను కూడా కృష్టుడి గెటప్ లో చాలా బాగున్నాడు.
లక్కీ: జున్ను కృష్ణుడి గెటప్ వేసుకున్నాడా?
మనీషా: జున్ను కృష్ణుడి గెటప్ వేసుకున్నాడని నువ్వెప్పుడు చూశావు. ఈ ఇంట్లో ఉన్న మీకు ఆ ఇంట్లో ఉన్న జున్ను గురించి ఎలా తెలుసు.
దేవయాని: కొంప దీసి నువ్వే జున్నును రెడీ చేశావా ఏంటి?
అని అడగ్గానే ఇంతలో జున్ను కృష్ణుడి గెటప్‌లో వస్తాడు. దీంతో జాను, జున్ను ఇందాకే వచ్చాడని బయటే కలిశాడని చిన్న తప్పు ఉంటే సంయుక్త గారే సరి చేశారని చెప్తుంది. తర్వాత అందరూ కలిసి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక దేవయాని లక్కీ, లక్ష్మీ కూతురని తెలిసిపోయింది కానీ జున్ను కూడా లక్ష్మీ కొడుకేమోనని నాకు డౌట్ గా ఉందని చెప్తుంది. లక్ష్మీ డెలివరీ అయిన హాస్పిటల్ కు ఫోన్ చేసి లక్ష్మీ డెలివరీ డీటెయిల్స్ అడుగుతుంది. హాస్పిటల్ వాళ్లు కవలలు పుట్టారని చెప్పడంతో దేవయాని షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘కార్తీకదీపం 2’ సీరియల్: శౌర్య జబ్బు గురించి తెలుసుకున్న అనసూయ – ఊరిలో ఇల్లు అమ్మేస్తానన్న నర్సింహ