అన్వేషించండి

Chiranjeevi lakshmi sowbhagyavati Serial Today August 27th: ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్‌: మిత్రను కాపాడినట్లు బిల్డప్ ఇచ్చిన మనీషా – తానే లక్ష్మీ అని నిజం చెప్పమన్న అరవింద

Chiranjeevi lakshmi sowbhagyavati Today Episode: మిత్రను రౌడీల నుంచి తానే కాపాడానని మనీషా బిల్డప్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Chiranjeevi lakshmi sowbhagyavati  Serial Today Episode:  మిత్రను సేవ్‌ చేయడానికి సంయుక్త అక్కడికి రాలేదన్నమాట. అయితే మనీషా ఒక్కతే మిత్రను కాపాడి తీసుకొచ్చిందన్నమాట అని దేవయాని అంటుంది. ఇంతలో సంయుక్త, అర్జున్‌ ఇంటికి వస్తారు. వాళ్లను చూసిన మనీషా మీరు మిత్రను సేవ్‌ చేయడానికి అక్కడికి వచ్చారా? నేను మిమ్మల్ని అక్కడ చూడలేదని అడుగుతుంది. నా చేతికి కట్టు ఉన్నట్లే నీ చేతికి కట్టు ఉందేంటి? ఆ దెబ్బ ఎలా తగిలింది. అయినా మీరు అక్కడికి ఎప్పుడు వచ్చారు. నేను రౌడీలను తరిమికొట్టి మిత్రను తీసుకొచ్చారా? అని అడుగుతుంది.

దేవయాని: అంతే అయ్యుంటుంది మనీషా.. సినిమాల్లో హీరో కష్టపడి ఫైట్‌ చేశాక ఆఖరులో పోలీసులు వచ్చినట్లు నువ్వు మిత్రను కాపాడి తీసుకొచ్చాక వీళ్లు పోలీసుల్లాగా వచ్చినట్టున్నారు.

సంయుక్త: మిత్ర గారు మీరు క్షేమంగా బయటపడినందుకు చాలా హ్యాపీగా ఉంది.

మిత్ర: థాంక్యూ సో మచ్‌ సామ్‌..

దేవయాని: మిత్రను కాపాడినందుకు మనీషాకు థాంక్స్‌ చెప్పవా? సంయుక్త. నీకు తెలుసో లేదో ఇదివరకు మిత్ర ఏ ప్రమాదంలో ఉన్నా.. లక్ష్మీ కాపాడేది. ఇప్పుడు ఆ బాధ్యత మనీషా తీసుకుంది. లక్ష్మీ లేని లోటు మనీషా తీరుస్తుంది. చూశావా మిత్ర దేవుడు నీకు లక్ష్మీ లేని లోటును మనీషాతో తీర్చాడు.

 అని దేవయాని చెప్పగానే మిత్ర లోపలికి వెళ్లిపోతాడు. మనీషా వెళ్లిపోతుంది. తర్వాత దేవయాని, మనీషా దగ్గరకు కచ్చితంగా నువ్వు మిత్రను కాపాడలేదు కదా? అని అడుగుతుంది. అవునని మనీషా చెప్తుంది. మరోవైపు అర్జున్‌, జయదేవ్‌, అరవింద.. ముగ్గురు కలిసి సంయుక్తను నువ్వు కాపాడి ఆ మనీషా కాపాడింది అని ఎందుకు చెప్పావు అని అడుగుతారు. దీంతో ఎవరు కాపాడిన ఆయన సేఫ్ గా ఉన్నారు కదా అంటుంది.

     అయితే తనను కాపాడిందని మిత్ర ఆ మనీషా మీద మంచి ఇంప్రెషన్‌ పెంచుకుంటే కష్టం కదా అంటాడు జయదేవ్‌. అయితే మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారని సంయుక్త చెప్తుంది. మరోవైపు సంయుక్త జాగ్రత్త పడితే ఏం చేస్తావు మనీషా అని అడుగుతుంది దేవయాని. జాగ్రత్త పడటం అంటే ఏం చేస్తుంది ఆంటీ.. తను సంయుక్తలా నటిస్తున్న లక్ష్మీ అని నిజం చెప్పేస్తుందా? అంటుంది. మరోవైపు అరవింద, మిత్రకు నువ్వే లక్ష్మీ అని నిజం చెప్పమని చెప్తుంది.  మరోవైపు లక్ష్మీ అన్ని ఆలోచించుకుని నిజం చెప్పేలోపు నేను మిత్రకు బెటర్‌ హాప్‌ అవుతానని అంటుంది మనీషా. తర్వాత పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికి వస్తారు.

జయదేవ్‌: అరవింద వాడే నీ మనవడు..

లక్కీ: నాన్నమ్మా నాన్న వచ్చాడంట కదా ఎక్కడున్నాడు.

అరవింద: పైనున్నాడు లక్కీ వెళ్లు..

లక్కీ: నాన్నా… ఎలా ఉన్నారు..? మీకేం కాలేదు కదా?

మిత్ర: ఏం కాలేదు లక్కీ..

  జున్ను వచ్చి నీ చేతికి ఏమైంది అమ్మా అని అడుగుతాడు. జున్నును చూసిన అరవింద వాడు సేమ్‌ మిత్రలాగే మాట్లాడుతున్నాడు కదండి. అంటే అవునని వాడు మిత్ర రక్తమే కదా అంటాడు జయదేవ్‌. ఇంతలో జున్ను ఏడుస్తుంటాడు. వాడు కార్చే కన్నీరు తన తల్లికోసమని.. తన తల్లి చిందించిన రక్తం తన తండ్రికోసమని వాడికి తెలియదు అంటుంది అరవింద. ఇంతలో జున్ను నువ్వు ఇంకోసారి ఇలా చేయనని నాకు మాట ఇవ్వు అని సంయుక్తను అడుగుతాడు.

అరవింద: ఇక నా వల్ల కాదండి వాడు బాధపడుతుంది.. వాడి కన్నతల్లి కోసమని ఇప్పుడే వాడితో చెప్పేద్దామండి.

జయదేవ్‌: నిజం చెప్పాల్సింది నువ్వు నేను కాదు అరవింద.. లక్ష్మీ. తన కొడుకు తనెవరో చెప్పాలి.

అరవింద: అప్పటి వరకు ఆ పసిమనసు అలా బాధపడాల్సిందేనా..?

జయదేవ్‌: నీ ఆరాటం నాకు అర్థం అయ్యింది. నాన్నమ్మలా వాడిని దగ్గరకు తీసుకో.. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

 అని చెప్పగానే అరవింద, జున్నును పిలుస్తుంది. దగ్గరకు తీసుకుంటుంది. ప్రేమగా హగ్‌ చేసుకుంటుంది. ఇంతలో నేను మిత్ర అంకుల్‌ ను చూడాలని జున్ను పైకి వెళ్తాడు. మరోవైపు మనీషా తన చేతికి కట్టుకున్న బ్యాండేజ్‌ చూసుకుంటూ మిత్రను గుర్తు చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మాన్‌స్ట‌ర్‌ కాదు... రాజశేఖర్ - పవన్ సాధినేని సినిమాకు 1990 సూపర్ హిట్ టైటిల్

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
Nindu Manasulu Serial Today July 18th: నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
Karthika Deepam 2 Serial Today July 18th: కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget