![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 7th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీతో విడాకులు కావాలన్న మిత్ర.. జున్ను అర్జున్, లక్ష్మీలకు పుట్టాడని అంటోన్న దేవయాని!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ మిత్ర కలవకుండా చేయడానికి జున్ను అర్జున్‌కి పుట్టాడని మిత్రకు చెప్పి మనసు మార్చేద్దామని దేవయాని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 7th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీతో విడాకులు కావాలన్న మిత్ర.. జున్ను అర్జున్, లక్ష్మీలకు పుట్టాడని అంటోన్న దేవయాని! Chiranjeevi Lakshmi Sowbhagyavathi serial today september 7th episode written update in telugu Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 7th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీతో విడాకులు కావాలన్న మిత్ర.. జున్ను అర్జున్, లక్ష్మీలకు పుట్టాడని అంటోన్న దేవయాని!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/07/4e92fba45b627da4dea67d6b898a54471725679102256882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జున్ను తనని తండ్రి అనగానే మిత్ర ఎవడ్రా నీకు నాన్న ఈ పెళ్లి ఆపడానికి నువ్వు ఎవడ్రా అని అరుస్తాడు. ఇక అర్జున్ పోలీసుల్ని తీసుకొని వస్తాడు. పెళ్లి చేసుకుంటే అరెస్ట్ అవుతావు మిత్ర అని అర్జున్ మిత్రకు చెప్తాడు. మిత్రని అరెస్ట్ చేస్తారంటున్నావ్ మిత్ర ఏం తప్పు చేశాడు అని మనీషా అర్జున్ని అడుగుతుంది.
అర్జున్: కట్టుకున్న భార్య ఉండగా మిత్ర మిమల్ని పెళ్లి చేసుకోవడం తప్పు.
మిత్ర: నా భార్య బతికే ఉందని నీకు ఎవరు చెప్పారు.
అర్జున్: కళ్లముందు నిజం కనిపిస్తుంటే ఎవరో చెప్పడం ఏంటి.
మిత్ర: తను నా భార్య కాదు. నా భార్య ఎప్పుడో చచ్చిపోయింది.
అరవింద: లేదు మిత్ర లేదు తనే లక్ష్మీరా తను బతికే ఉందిరా.
మిత్ర: తను బతికున్నా నా దృష్టిలో చనిపోయింది మామ్. నాతో ఎప్పుడు తను కలిసి ఉంది మామ్. నాతో విడిపోవాలి అని విడాకులు అడిగిన మనిషిని నా భార్య అని ఎలా అనుకోవాలి.
దేవయాని: అలా అడుగు మిత్ర ఆ రోజు లక్ష్మీ ఎందుకు విడాకులు అడిగింది మిత్రతో కలిసి ఉండలేకే కదా.
మనీషా: విడాకులు అడిగిన ఆమె విడిపోకుండా కోర్టులో కళ్లు తిరిగి పడిపోయి ప్రెగ్నెంట్ అని నాటకం ఆడింది.
అరవింద: మిత్ర అంటే ఇష్టం లేక తను ఆ పని చేయలేదు మిత్ర అంటే ఇష్టం కాబట్టే తిరిగి వచ్చింది.
మిత్ర: అప్పుడు అయినా నాతో కలిసి ఉందా అమ్మ మరొకరితో పెళ్లికి సిద్దం అయింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
వివేక్: అన్నయ్య అది నువ్వు వదినను అర్థం చేసుకోవడానికి పెద్దనాన్న ఆడిన నాటకం అది.
మనీషా: మన ప్రత్యర్థి ప్రవీణ్ మిట్టల్‌తో చేతులు కలిపి మన షేర్లు ఇచ్చేసింది. తను చేసిన పనికి మనం ఆల్‌మోస్ట్ రోడ్డున పడ్డాం.
అరవింద: అందుకు కారణం ఎవరు మనీషా నువ్వు కాదా. నువ్వు లక్ష్మీని బెదిరించి
లక్ష్మీ: అత్తయ్య గారు వద్దు. ఇది నాకు నా భర్తకు సంబంధించి విషయం మధ్యలో మీరు ఎవరూ జోక్యం చేసుకోవద్దు.
మిత్ర: నన్ను చీట్ చేసి చనిపోయినట్లు నాటకం ఆడి ఇప్పుడు నన్ను భర్త అంటావా. నవ్వు ఏమైపోయావో అని ఫ్యామిలీ అంతా ఎంత సఫర్ అయ్యారో తెలుసా. నీ వల్ల నేను పిచ్చోడిని అయి తాగుబోతు అయిపోయాను.
దేవయాని: తనకి నువ్వు ఏమైపోతే ఏంటి మిత్ర. హ్యాపీగా అర్జున్ ఇంట్లో చేరి తన సుఖం తాను చూసుకుంది.
మనీషా: జేఎమ్మార్ గారిని మోసం చేసి అతని కూతురిలా చేరింది. అర్జున్ ప్రత్యర్థి అని తెలిసి కూడా టెండర్ ఆయనకు వెళ్లేలా చేసింది.
దేవయాని: అర్జున్ గారికి అంత అండర్‌స్టాండింగ్ ఏంటో. ఇద్దరి మధ్య అంత సంబంధం ఏంటి.
అరవింద: దేవయాని తప్పుగా మాట్లాడితే చెప్పు తెగేలా కొడతా. నా కోడలి మీద నిందలు వేస్తే చంపేస్తా. నోరు జాగ్రత్త.
అర్జున్: లక్ష్మీ నిప్పు ఆంటీ తను నాకు మంచి ఫ్రెండ్ అంతే దయచేసి తనని తప్పుగా అర్థం చేసుకోకు మిత్ర తను నిజంగా దేవత.
మిత్ర: ఈ దేవత సంయుక్తలా నా ఇంటికి ఎందుకు వచ్చింది. నా భార్య అని నా దగ్గర ఎందుకు దాచింది. మీ అందరికీ తెలిసిన నిజం నా దగ్గర ఎందుకు దాచింది.
దేవయాని: మొన్న మిత్రని కిడ్నాప్ చేసింది కూడా తనే అయింటుంది.
మనీషా: అవును ఈ లక్ష్మీనే మిత్రని కిడ్నాప్ చేసి కాపాడాలని ప్లాన్ చేసింది సమయానికి నేను వెళ్లాను కాబట్టి మిత్రని కాపాడుకున్నాను.
జాను మొత్తం దేవయాని వాళ్ల వల్లే జరిగిందని మిత్రతో పెళ్యి అయినప్పుటి నుంచి తన అక్క బాధ పడుతూనే ఉందని నిలదీస్తుంది. దాంతో లక్ష్మీ జాను చెంప పగలగొట్టి వెనక్కి వెళ్లమని అంటుంది. మాట్లాడాల్సిన నువ్వు మాట్లాడటం లేదని మిత్రకు చెప్పాలి కదా అని అరవింద అంటుంది. దానికి మిత్ర లక్ష్మీ తనకు గాయం చేసిందని ఎవరు ఏం చెప్పినా తాను వినను అని మిత్ర అంటాడు. తనని మోసం చేసి బాధ పెట్టిన లక్ష్మీ తనకు వద్దని మిత్ర తెగేసి చెప్తాడు. లక్ష్మీకి చేతులు జోడించి తన జీవితం నుంచి ఇంట్లో నుంచి వెళ్లిపో అని అంటాడు. తాను వేరే జీవితం మొదలు పెడుతున్నానని అంటాడు. చట్ట బద్ధంగా విడాకులు తీసుకొని అప్పుడు మనీషాని పెళ్లి చేసుకుంటానని మిత్ర అంటాడు. అప్పటి వరకు లక్ష్మీ మన ఇంట్లోనే ఉంటుందని అంటాడు. అందరూ ఇంటికి వెళ్లిపోతారు.
మిత్ర ఇంటికి వచ్చి లక్ష్మీని గుర్తు చేసుకొని బాధ పడుతుంటాడు. ఇక మనీషా వచ్చి డోర్ తీయమని ఇప్పుడే నిన్ను చూడాలి మాట్లాడాలి అని మనీషా అంటుంది. తనని కాసేపు ఒంటరిగా వదిలేయ్ మని మిత్ర అరుస్తాడు. దాంతో దేవయాని మనీషాని తీసుకెళ్లిపోతుంది. తన పెళ్లి జరగలేదని మనీషా తెగ ఫీలవుతుంది. లక్ష్మీని ఆపడానికి మరేం చేయలేమని అంటుంది. దానికి దేవయాని లక్కీ మిత్ర, లక్ష్మీల కూతురని అనాథ కాదని మనకి మాత్రమే తెలుసని ఇక యాక్సిడెంట్ వీడియోతో లక్ష్మీని భయపెట్టొచ్చని అంటుంది. ఇక ఇవి రెండు కాక ఇంకో అసలైన బ్రహ్మాస్త్రం జున్ను ఉన్నాడని అంటుంది దేవయాని. జున్ను మిత్ర, లక్ష్మీకి పుట్టిన వాడని కాని మిత్ర జున్ను, లక్ష్మీలను అంగీకరించడం లేదని జున్ను మిత్రకు పుట్టలేదని అర్జున్, లక్ష్మీలకు పుట్టాడని నిరూపిద్దామని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి ఘనస్వాగతం పలికిన అపూర్వ – చంద్రను చూసి ఎమోషన్ అయిన భూమి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)