Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 6th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: భలే ట్విస్ట్ ఇచ్చిన పిల్లలు.. దెబ్బకి మనీషా పని అవుట్.. నువ్వే నా తండ్రివని మిత్రతో చెప్పిన జున్ను!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ సంయుక్త ఒక్కరే అని జున్ను, లక్కీ చెప్పడం మిత్రని జున్ను నాన్న అని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర, మనీషాలు పెళ్లి మండపంలో పెళ్లి పీటల మీద కూర్చొంటారు. లక్కీ, జున్నులు ఫొటో పట్టుకొని పరుగున వస్తుంటారు. ఇక మిత్ర మనసులో ఎంత కంట్రోల్ చేసుకుందామని అనుకున్నా సంయుక్తని చూస్తుంటే లక్ష్మీ గుర్తొస్తుందని లక్కీ పక్కన ఉంటే తప్ప లక్ష్మీని పక్కన పెట్టలేనని అనుకొని వివేక్‌ని పిలిచి లక్కీని తీసుకురమ్మని చెప్తాడు. వివేక్ జానుకి లక్కీ, జున్నుల గురించి అడుగుతాడు.
ఇక మిత్ర వివేక్‌ని పిలవడం చూసిన మనీషా దేవయానిని పిలిచి ఏం జరిగిందని అడిగి తెలుసుకోమని చెప్తుంది. దేవయాని వివేక్ దగ్గరకు వెళ్తే వివేక్ లక్కీ, జున్నుల గురించి దేవయానికి అడుగుతాడు. వాళ్ల వంకతో పెళ్లి ఆపేస్తారా ఏంటి అని దేవయాని అడుగుతుంది. ఇక పిల్లలు మనీషాకు గిఫ్ట్ తేవడానికి వెళ్లారని తనకు చెప్పారని అంటుంది. ఎవరు ఏం చేసినా ఈ పెళ్లి ఆగదని చెప్పి వెళ్తుంది. మనీషా దగ్గరకు వెళ్లి పిల్లలను అడ్డుపెట్టుకొని పెళ్లి ఆపాలని చూస్తున్నారని చెప్తుంది.
మనీషా: వాళ్లకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు ఆంటీ వెంటనే తాళి కట్టమని చెప్పండి.
దేవయాని: నాకు అదే అనిపిస్తుంది. పంతులు గారు వెంటనే పెళ్లి జరిపించండి. పంతులు తాళి కట్టమని మిత్రకు చెప్తాడు. మిత్ర తాళి కట్టడానికి రెడీ అవుతాడు. లక్ష్మీ ఏం చేయలేక ఏడుస్తుంది. మిత్ర మొదటి ముడి వేసే టైంలో లక్కీ, జున్నులు ఫొటో తీసుకొని వచ్చి పెళ్లి ఆపండని అరుస్తారు. మిత్ర తాళి కట్టకుండా ఆగిపోతాడు. అరవింద వాళ్లు సంతోషపడతారు. దేవయాని, మనీషా షాక్ అయిపోతారు.
జున్ను: ఈ పెళ్లి జరగడానికి వీళ్లేదు.
దేవయాని: ఎంట్రా చిన్న పిల్లాడివి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్. ఎందుకు ఈ పెళ్లి ఆపాలి.
లక్కీ: ఎందుకు అంటే మా నాన్నకి ఆల్రెడీ పెళ్లి అయింది కాబట్టి. నాకు అమ్మ ఉంది కాబట్టి.
మనీషా: నీకు ఆ విషయం ఎవరు చెప్పారు లక్కీ. నేనే నీకు కాబోయే అమ్మని.
లక్కీ: నువ్వు మా అమ్మవి కాదు. ఈవిడే మా అమ్మ అని లక్ష్మీ, మిత్రల ఫొటో చూపిస్తుంది. అందరికీ ఫొటో చూపిస్తుంది. లక్ష్మీతో పాటు అందరూ షాక్ అయిపోతారు.
మిత్ర: లక్కీ ఈ ఫొటో బయటకు ఎందుకు తీశావ్ తను నీకు అమ్మ కాదు నాకు భార్య కాదు అని ఫొటో విసిరేస్తాడు.
జున్ను: ఆవిడ మీకు భార్య కాకపోతే ఫొటోలో మీ పక్కన ఎందుకు ఉంది. ఈవిడకు మీకు ఏంటి సంబంధం.
దేవయాని: అది అడగడానికి నువ్వు ఎవరురా నీకు ఏంటి సంబంధం.
జున్ను: నాకు సంబంధం ఉంది.
మనీషా: ఏంట్రా సంబంధం ఉంది చనువు ఇచ్చాం కదా అని మిత్రనే ఎదురిస్తున్నావ్ ఆ హక్కు నీకు ఎవరు ఇచ్చారు.
జున్ను: ఆ హక్కు నాకే ఉంది. ఎందుకంటే ఈయనే మా నాన్న. ఫొటోలో మీ పక్కన ఉందే ఆమె మా అమ్మ లక్ష్మీ.
లక్కీ: అవును నాన్న జున్ను లక్ష్మీ అమ్మ కొడుకే. లక్ష్మీ అమ్మ కూడా ఎవరో కాదు ఈ సంయుక్త ఆంటీనే లక్ష్మీ అమ్మ. మిత్ర మొత్తం గుర్తు చేసుకుంటాడు. నాకు అమ్మ ఉంది నాన్న ఈ లక్ష్మీ అమ్మే నాకు అమ్మ. మరో అమ్మ నాకు వద్దు. నువ్వు మనీషాని పెళ్లి చేసుకోవద్దు.
మనీషా: ఏం వాగుతున్నావే నువ్వు ఈ లక్ష్మీకి పుట్టావా అసలు మిత్ర మీ నాన్నే కాదు. నువ్వు ఓ అనాథవి. నువ్వు ఎవరికి పుట్టావో మీ అమ్మానాన్న ఎవరో తెలీదు.
మిత్ర మనీషాని కోపంతో కొడతాడు. మనీషా అడిగిన దాంట్లో తప్పేముందని దేవయాని సపోర్ట్ చేస్తే లక్కీని తన కూతురు కాదని ఎవరు అన్నా వాళ్లని చంపేస్తా అని మిత్ర అంటాడు. అరవింద మిత్రతో లక్కీ నీ కూతురే జున్ను కూడా నీ కొడుకే అని లక్ష్మీని చూపించి తను నీ భార్య అని చెప్తాడు. అందరూ తను లక్ష్మీనే అని నీ కోసం మన కోసం బతికే ఉందని చెప్తారు. ఇక దేవయాని కావాలనే సంయుక్తే లక్ష్మీనా మీకు నిజం తెలిసి కూడా ఎంత నాటకం ఆడారని మిత్రని రెచ్చగొడుతుంది. మనీషా కూడా తనకి ఇప్పుడే తెలిసిందని అంటుంది. ఇక జున్ను మిత్రని నాన్న అని అంటే ఎవడ్రా నీకు నాన్న అని మిత్ర గట్టిగా అరుస్తాడు. తను నా భార్య కానప్పుడు నువ్వు కొడుకు ఎలా అవుతావని అరుస్తాడు. ఈ పెళ్లి చేసుకోవద్దని ఎలా చెప్తావ్ అని కోప్పడతాడు. ఇంతలో అర్జున్ పోలీసుల్ని తీసుకొని వస్తాడు. ఈ పెళ్లి ఆపకపోతే అరెస్ట్ అవుతావని అంటాడు. ఎందుకని మనీషా ప్రశ్నిస్తే భార్య ఉండగా మరో పెళ్లి చేసుకుంటే జైలుకి వెళ్తావని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: సాహసం చేసి పంచకమణిని దక్కించుకున్న నయని.. కుట్ర చేసిన గజగండ!