అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today September 30th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: హోటల్‌ గదిలో వేరే వ్యక్తితో జాను, వివేక్ నిర్ణయం ఏంటి? ఆ ఒక్క విషయంలో బాధగా ఉందన్న లక్ష్మీ!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode జానుని దేవయాని, మనీషాలు ట్రాప్ చేసి హోటల్‌ గదిలో వేరే వ్యక్తితో పోలీసులు, మీడియాకు దొరికేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను, వివేక్ అనుకోకుండా ముద్దు పెట్టుకుంటారు. దాని గురించి జాను ఆలోచిస్తూ మేడ ఉంటుంది. ఇక వివేక్ అక్కడికి వచ్చి అనుకోకుండా జరిగింది ఈసారి అనుకొని చేయొచ్చు కదా అని అంటాడు. ఇంతలో జానుకి ఓ లేడీ కాల్ చేస్తుంది. హోటల్‌కి రమ్మని మనీషా ఫోన్ దొరికిందని అందులో మీ అక్క, అత్తయ్యల వీడియో అందని చెప్తుంది. దాంతో జాను హడావుడిగా పరుగులు తీస్తుంది. లక్ష్మీ ఎక్కడికి అని అడిగితే వచ్చాక చెప్తానని అంటుంది. ఇక మిత్ర గదిలో గాజు పెంకులు పడిన శబ్ధం వస్తే లక్ష్మీ పరుగున వెళ్తుంది. వాటిని తీస్తానని అంటే మిత్ర వద్దని అంటాడు. ఇది నా గది నా గదిలోకి రావొద్దని అంటాడు. మిత్ర ఎన్ని చెప్పినా లక్ష్మీ వినకుండా గాజు ముక్కలు తీస్తుంది. 

మిత్ర: నా మీద నీకు అంత జాలి ఉందా.
లక్ష్మీ: నా మీద మీకు ఎలాగూ లేదు కదా. 
మిత్ర: నేను ఎందుకు నీ మీద జాలి పడాలి.
లక్ష్మీ: అందుకేనా నా మీద రాత్రి మనీషా అన్ని మాటలు అన్నా సైలెంట్‌గా ఉన్నారు. నా మీద మనీషా వేయకూడదని నిందలు వేసింది. అందుకు కూడా నేను బాధ పడలేదు కానీ మీరు మౌనంగా ఉన్నారు.. ఆ టైంలో మీ మౌనమే నన్ను ఎక్కువగా బాధ పెట్టింది. నా మీద మీకు కోపం ఉండొచ్చు నన్ను మీ భార్యగా కూడా చూడకపోవచ్చు. కానీ మీ కళ్ల ముందు ఓ ఆడదానికి అవమానం జరిగితే ఎందుకు చూస్తూ ఊరుకున్నారు. ఎందుకు మీ గొంతు అణిచేశారు. ఎందుకు మీ వ్యక్తిత్వాన్ని చంపుకున్నారు. 

లక్ష్మీ గాజు ముక్కలు తీస్తుండగా ఓ పెంకు తగిలి రక్తం వస్తుంది. దాంతో మిత్ర కంగారుగా లక్ష్మీ అని పిలిచి లక్ష్మీ వేలిని తన నోట్లో పెట్టుకుంటాడు. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. తర్వాత మిత్ర లేచి నేను కావాలని చేయలేదని చెప్తాడు. దీన్ని నీకు ఫేవర్‌గా తీసుకోవద్దని అంటాడు.

లక్ష్మీ: నాకు అలాంటి కోరికలు లేవు మీరు గాయ పడకూడదని వచ్చి నేను గాయపడి వెళ్తున్న. నాలుగు గోడల మధ్య ఆడదాన్ని బాధ అర్థం చేసుకోవడం కంటే నలుగురు ముందు ఆ ఆడదాని గౌరవం కాపాడటం ముఖ్యం. 

జాను హోటల‌కి చేరుకుంటుంది. తనకు ఫోన్ చేసిన ఆవిడకు కాల్ చేస్తుంది. ఆవిడ జానుకి గది లోపలికి రమ్మని చెప్తుంది. ఇలాంటి ప్లేస్‌కి నేను రాలేదు నాకు భయం మీరే బయటకు రండి అని జాను అంటే ఏం పర్లేదు ఇది మంచి ఏరియానే లోపలికి రా అని ఆవిడ చెప్తుంది. జాను భయపడుతూనే వెళ్తుంది. ఆవిడ జానుని లోపలికి పిలిచి బెడ్ మీద కూర్చొబెట్టి ఏం భయం లేదని చెప్తుంది. ఫోన్ ఇమ్మని జాను చెప్తే ఆవిడ ఫోన్‌ తీసుకొస్తానని చెప్పి జానుని లోపల కూర్చొపెట్టి తలుపు వేసేస్తుంది.. 

జాను అక్కకి కాల్ చేస్తానని అనుకొని మనీషా ఫోన్ దొరికితే ఒక్కసారి చేసి విషయం మొత్తం చెప్పొచ్చని అనుకుంటుంది. ఇక ఇంట్లో లక్ష్మీ వివేక్‌ జాను గురించి మాట్లాడుకుంటారు. జాను కంగారుగా ఎక్కడికో వెళ్లిందని లక్ష్మీ అంటే నా ముందే తనకు ఏదో ఫోన్ వచ్చింది అందుకే వెళ్లిందని వివేక్ అంటాడు. జరగరానిది ఏదో జరుగుతున్నట్లు గుండె పీకేస్తుందని లక్ష్మీ ఫీలవుతుంది. దేవయాని, మనీషాలు చాటుగా వింటూ తన పథకం స్పీడ్ పెంచాలని అనుకుంటారు. ఇక లక్ష్మీ వివేక్‌తో జానుకి కాల్ చేయమని చెప్తే జాను ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక ఆవిడ దేవయానికి కాల్ చేసి జానుని రూమ్‌లో కూర్చొపెట్టానని చెప్తుంది. తర్వాత మీడియాకు కాల్ చేసి విషయం చెప్తుంది. మనీషా పోలీస్‌లకు కాల్ చేసి హెటల్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్తుంది. ఇక జాను ఉన్న గదిలో ఇప్పటికే ఓ వ్యక్తిని ఉంచానని జానుకి ఆ విషయం తెలీదని కాసేపట్లో జాను పని అయిపోతుందని అంటుంది.

మరోవైపు దీక్షితులు గారు అరవిందకు కాల్ చేస్తారు.  మీ ఇంట్లో ఏమైనా శుభకార్యం పెట్టుకున్నారా అని అడుగుతారు. దానికి అరవింద ఏం  లేదు అని అంటుంది. దానికి దీక్షితులు గారు త్వరలో మీ ఇంట్లో ఓ గొప్ప శుభకార్యం జరగబోతుందని అంటారు. అరవింద, జయదేవ్ సంతోషిస్తారు. స్వామీజీ ఇప్పటి వరకు గండాల గురించే చెప్పారని మొదటి సారి శుభకార్యం గురించి చెప్పారని అనుకుంటారు. మరోవైపు పోలీసులు హోటల్‌కి రైడ్‌కి వస్తారు. జాను ఉన్న గదిలోకి వచ్చి చెక్ చేస్తారు. అక్కడ ఓ వ్యక్తి ఉండటం చూసి జాను బిత్తర పోతుంది. తనకు ఏం తెలీదని ఏడుస్తుంది. ఇక మీడియా కూడా వచ్చారని పోలీసులకు చెప్పడంతో పోలీసులు అప్పుడే తెలియడంతో ఏదో తేడాగా ఉందని అనుకుంటారు. నువ్వు ఎందుకు వచ్చావని పోలీసులు జానుని అడిగితే జాను జరిగింది చెప్తుంది. ఎవరో నిన్ను కావాలనే ఇరికించారని పోలీస్‌ అధికారి అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: మైత్రి విషయంలో కొట్టుకుంటున్న హర్ష, నందిని, వారం గడువు.. సత్యకి అడ్డంగా బుక్కైపోయిన క్రిష్‌!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
Godavari Serial Today August 3rd: 'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget