అన్వేషించండి

Satyabhama Serial Today September 30th: సత్యభామ సీరియల్: మైత్రి విషయంలో కొట్టుకుంటున్న హర్ష, నందిని, వారం గడువు.. సత్యకి అడ్డంగా బుక్కైపోయిన క్రిష్‌!

Satyabhama Today Episode సత్య, మహదేవయ్యలు ఒకర్ని ఒకరు మాటలు అనుకోవడం ఛాలెంజ్‌లు చేసుకోవడం ఈలోపు క్రిష్ అక్కడికి వచ్చి వాళ్లని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య, మహదేవయ్యల మాటలు కొనసాగుతుంటాయి. మహదేవయ్య సత్యతో ఈ ఇళ్లే కాదు ఊరు మొత్తం నా సామ్రాజ్యమని అంటాడు. ఎక్కడ ఏం జరిగినా నాకు సమాచారం వస్తుందని నన్ను కాదని ఏం జరగదని నువ్వు నన్ను ఏం చేయలేవని మహదేవయ్య అంటాడు. 

సత్య: ఒక్కసారి గురి తప్పిందని ప్రతీ సారి ఇలా అవుతుందని అనుకోవద్దు. నాది ధర్మ పోరాటం.
మహదేవయ్య: మీ ఎడ్డోడు నా దిక్క ఉంటాడు. మీరు నా కాళ్ల కింద బతకాల్సిందే.
సత్య: చూద్దాం.. మీ చిన్నాతోనే ఛీ కొట్టిస్తా నా సత్తా ఏంటో అర్థమయ్యేలా చేస్తా.
క్రిష్: ఏంటి అర్థమయ్యేలా చేస్తా అంటున్నావ్ బాపుతో.
సత్య: మనం అనుకున్నాం కదా మామయ్య గారికి సపోర్ట్ చేయాలని అంటున్నా. గెలుపోటములు నిర్ణయించాల్సింది నువ్వే క్రిష్ ఎందుకంటే కథ నీ చుట్టూ తిరుగుతోంది.
క్రిష్: సత్య ఏం మాట్లాడుతుందో అర్థం కాదు బాపు. 
మహదేవయ్య: రేయ్ అది ముందు ముందు నీకే అర్థమవుతుందిలే.
క్రిష్: వీళ్లిద్దరూ తెలుగే మాట్లాడుతున్నారు కదా.

విశ్వనాథం ఇంటికి అతని ఫ్రెండ్ అతని భార్య వస్తారు. విశ్వనాథం, శాంతమ్మ, విశాలాక్షి మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో మైత్రి వాళ్ల కోసం కాఫీ తీసుకొస్తుంది. కోడలు చాలా బాగుంది. ఇద్దరి ఈడు జోడు బాగుందని అంటారు. మ్యారేజ్ గిఫ్ట్ అని మైత్రి చేతిలో పెడతారు. నందిని ఆ మాటలు విని రగిలిపోతుంది. ఇంతలో విశ్వనాథం తను కోడలు కాదని అంటాడు. నందిని వచ్చి గెస్ట్‌ల ముందే కోప్పడుతుంది. మా ఇద్దరిలో భార్య ఎవరో తెలీదా అని అంటుంది. తాళి చూసి నేనే భార్యని అని ఫిక్స్ అయిపోతానని అంటుంది. నాకు పుట్టింటి వాళ్లు అత్తింటి వాళ్లు ఎవరూ లేరని నేను అనాథనే కదా అని అంటుంది. ఇక మీరు మీరు ఎలా ఉన్నా పర్లేదు హర్ష కనీసం బయట వాళ్ల ముందు అయినా పద్ధతిగా ఉండండని చెప్పి నందిని ఏడుస్తూ వెళ్లిపోతుంది. తమ పొరపాటు వల్ల జరిగిన  గొడవకు విశ్వనాథం ఫ్రెండ్ సారీ చెప్పి వెళ్లిపోతాడు. ఇక మైత్రి హర్ష చేతిలో గిఫ్ట్ పెట్టి గదిలోకి వెళ్లిపోతుంది. 

నందిని గదిలోకి వెళ్లి తనది, హర్షది ఫొటో విసిరేస్తుంది. హర్ష నందినిని తిడతాడు. నందిని కూడా హర్షతో గొడవ పడుతుంది. నేను ఏదో తప్పుగా ఆలోచిస్తున్నాను అంటే ఒక అర్థం ఉంది వచ్చిన వాళ్లు కూడా అలానే ఆలోచిస్తున్నారు అంటే అర్థమేంటి తప్పు ఎవరిది అని నందిని భర్తని ప్రశ్నిస్తుంది. వాళ్లకి మైత్రి గురించి తెలీదు కదా అని అంటాడు. ఆడదానివి అయి సాటి ఆడదాని మీద జాలి చూపించకుండా ఇలా కామెంట్స్ ఎలా చేస్తున్నావ్ అని అడుగుతాడు. తన కోసం మనిద్దరం కొట్టుకుంటే తను ఈ ఇంట్లో ఎలా ఉండగలుగుతుందని ప్రశ్నిస్తుందని అంటాడు. ఇక వారంలో నీ సమస్య పరిష్కరిస్తానని చెప్పి హర్ష వెళ్లిపోతాడు.

రాత్రి క్రిష్ ఇంటికి వస్తాడు. చేతికి గాయం అయి రక్తం వస్తుంది. అది సత్య చూస్తే గొడవ పెడుతుందని తనకు తెలీకూడదని అనుకొని చేతికి రుమాలు కట్టుకుంటాడు. సత్య గదిలో కోపంగా ఉంటుంది. అది చూసిన క్రిష్ తాను కొట్టాటకు వెళ్లినట్లు సత్యకి తెలిసిపోయిందేమో అనుకుంటాడు. సత్య దగ్గరకు వెళ్లి ప్రేమగా మాట్లాడుతాడు. కావాలనే సత్యని కూల్ చేయడానికి పొగుడుతాడు. ఇక సత్య ఎక్కడికి వెళ్లావని క్రిష్‌ని అడుగుతుంది. 

క్రిష్: ఏం లేదు బాపు ఒక చిన్న పని అప్పగిస్తే వెళ్లా.
సత్య: మరి నేను చెప్పిన పని ఏం చేశావ్.
క్రిష్: నువ్వు ఏం చెప్పావ్. 
సత్య: అంతేనా నా మీద ప్రేమ ఇంతేనా. మేకప్ కిట్ తెమ్మన్నా మర్చిపోయావ్ కదా.
క్రిష్: అయ్యో మర్చిపోయానే అసలు ఎప్పుడు చెప్పింది ఇప్పుడు ఏదో ఒకటి మ్యానేజ్ చేయాలి. వచ్చేటప్పుడు దుకాణానికి వెళ్లా సత్యా. మంచిది రేపు వస్తుందంట వస్తే వాడే ఇంటికి తెస్తాడంట. నిజం సత్య.
సత్య: అసలు నేను నీకు మేకప్‌ కిట్టే తీసుకురమ్మని చెప్పలేదు. నీకు నా మీద ప్రేమనే లేదు. మీ బాపు మాటే వింటావ్ నన్ను పట్టించుకోవు.
క్రిష్: మనసులో దేవుడా ఏ టాపిక్ వద్దు అనుకున్నానో మొత్తం అక్కడికే వస్తుంది. నిజం గానే నువ్వు మేకప్ కిట్ అడగలేదా.
సత్య: లేదు. నేను అడిగింది యూనివర్సిటీకి వెళ్లి మాస్టర్స్ అడ్మిషన్ అప్లికేషన్ అడిగాను కదా.
క్రిష్: చెప్పిందో లేదో అవును అంటే ఒక బాధ కాదు అంటే ఒక బాధ. సరే సంపంగి రేపు నీకు అప్లికేషన్ తీసుకొస్తా. ముందు అయితే నాకు ఆకలి వేస్తుంది ఒడ్డించు.
సత్య: ప్లేట్ క్రిష్‌ చేతిలో పెడుతూ మనసులో నువ్వు తినకుండా నేను తిననని నీకు తెలుసు అది మర్చిపోయి నాకు పెట్టకుంటా నువ్వు తిన్నావనుకో నా చేతిలో చచ్చావ్. 

క్రిష్ బిర్యాని వాసన బాగుందని అనుకుంటాడు. నోటి వరకు తీసుకెళ్లి బామ్మకి మందులు ఇచ్చావా అని అంటాడు. సత్య ఇచ్చానని నువ్వు తిను తిను అంటుంది. సత్య అలా చూడటం ఇంతలో క్రిష్ ఒక్కసారి ఆగి నేను తినకుండా సత్య తినదు కదా మరి తిన్నాను అన్నాదంటే ఇది కూడా నాకు టెస్టేనా అనుకుంటాడు. తేరుకొని సత్య నువ్వు తినకుండా నేను తినను కదా అని అంటాడు. దాంతో సత్య పొంగిపోతుంది. క్రిష్‌ని పొగిడేస్తుంది. దాంతో క్రిష్ దేవుడా బతికించావ్ లేదంటే ఈ కారణంతో ఈ రోజు నా ఫొటోకి దండ పడేదని అనుకుంటాడు. ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: రౌడీని చంపేసి సత్యకు ట్విస్ట్ ఇచ్చిన మహదేవయ్య.. అదిరిపోతున్న మామకోడలి చదరంగం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Embed widget