Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 2nd: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ముందు బయటపడ్డ మనీషా బండారం.. జానుతో పెళ్లికి వివేక్ ఏం చేయనున్నాడు?
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode దేవయాని, మనీషాలు జున్ను అర్జున్ కొడుకని డీఎన్ఏ టెస్ట్‌లో వచ్చేలా చేయాలని మాట్లాడుకోవడం అది మిత్ర వినేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను ఏడుస్తూ ఉంటే లక్ష్మీ ఓదార్చుతుంది. లక్ష్మీ మిత్ర దగ్గరకు వెళ్లి తన చెల్లిని చాలా పెద్ద సమస్య నుంచి రక్షించినందుకు రెండు చేతులు ఎత్తి దండం పెడుతుంది. జాను పెళ్లి కావాల్సిన పిల్ల అని తనకి ముందు ముందు ఇలాంటివి జరగకూడదని అందుకు జానుకి పెళ్లి చేయాలని అందుకు జాను, వివేక్‌ల పెళ్లి చేయాలని మిత్రతో అంటుంది. ఒకసారి దేవయానితో మాట్లాడమని అంటుంది.
మిత్ర: నన్ను ఏ రకంగా ఈ సాయం అడుగుతున్నావ్?
లక్ష్మీ: జాను అక్కగా అడుగుతున్నా తల్లిదండ్రులు లేని ఓ ఆడపిల్ల కోసం అడుగుతున్నా. సాటి మనిషికి సాయం చేసే మంచి మనసు మీకు ఉందని అడుతున్నా. మీరు ఈ సాయం చేస్తే అమ్మానాన్నల లేని ఓ ఆడపిల్లకు మంచి భవిష్యత్ ఇచ్చినవాళ్లు అవుతారు. మిత్ర మౌనంగా వెళ్లిపోతాడు.
జాను విషయంలో తాము చేసిన ప్లాన ఫెయిల్ అయిందని మనీషా, దేవయాని మాట్లాడుకుంటారు. ఇంతలో మిత్ర అక్కడికి రావడంతో ఇద్దరూ షాక్ అయిపోతారు. ఇంతలో మిత్ర వచ్చి వివేక్ పెళ్లి జానుతో చేయమని అంటాడు. దేవయాని మాత్రం వద్దనేస్తుంది. తన నిర్ణయం మార్చుకోనని చెప్పేస్తుంది. దాంతో మనీషా లక్ష్మీని తిడుతుంది. మిత్ర మాత్రం తాను జాను కోసం చేశానని చెప్తాడు. మిత్ర వెళ్లిపోతాడు. మనీషా లక్ష్మీతో నీకు మూడు లక్ష్యాలున్నాయని ఆ ముడింటిలో ఏ ఒక్కటి జరగనివ్వనని అంటుంది. జానుతో వివేక్ పెళ్లి అవ్వదని అంటుంది. వివేక్ ఆ మాటలు సీక్రెట్‌గా వింటాడు.
వివేక్: పెళ్లి గురించి వదిన సాయం తీసుకోవాలని అనుకున్నా కానీ వద్దు. వదినకు అడిగితే ఎలా అయినా మా పెళ్లి చేస్తుంది కానీ అది వదినకు పెద్ద సమస్య అవుతుంది. ఇక ఏదైనా నేను చేయాలి.
లక్కీ, జున్నులు పరుగున ఇంటికి వస్తారు. కాంపిటేషన్‌లో తమకే ఫస్ట్ వచ్చిందని అంటారు. షీల్డ్ నానమ్మ, తాతయ్యలకు చూపిస్తారు. సంతోషిస్తారు. ఇక దేవయాని, మనీషాలు తిట్టుకుంటారు. లక్ష్మీ కూడా రావడంతో లక్కీ తమకు ప్రైజ్ వచ్చిందని అంటారు. వాళ్ల నటకు అందరూ ఏడ్చారని చెప్తారు. ఒక జున్ను తండ్రికి తన బహుమతి చూపించి ప్రైజ్ వచ్చిందని చెప్తాడు.. నీ వల్లే ఇదంతా డాడీ అని చెప్పి హగ్ చేసుకుంటాడు. ఇక మిత్రని తీసుకొని కింద అందరూ ఉంటే అక్కడికి వెళ్తాడు. లక్కీని, లక్ష్మీని పిలిచి ఫ్యామిలీ ఫొటో తీసుకుందామని పిలుస్తాడు.
మిత్ర జేబు నుంచి ఫోన్ తీసుకొని సెల్ఫీ తీస్తాడు. అందరూ సంతోషిస్తారు. మనీషా రగిలిపోతుంది. మేం వద్దా అని అరవింద అంటే వద్దని అంటాడు. ఇది మా ఫ్యామిలీ ఫొటో అంటాడు. దానికి మిత్ర రేయ్ వాళ్ల మా అమ్మానాన్నలురా అని అంటాడు. పర్లేదులే అని అరవింద అంటుంది. జయదేవ్ ఫ్యామిలీ పిక్ తీస్తాడు. మనీషా కోపంతో బయటకు వెళ్లిపోతుంది. ఇక దేవయాని జున్నుకి డీఎన్ఏ టెస్ట్ చేయించాలని అన్నావని దాన్ని ఏం చేశావని అడుగుతుంది. దానికి మనీషా డాక్టర్‌తో చెప్పి మొత్తం రెడీ చేశానని అంటుంది. డాక్టర్తో మాట్లాడుతుంది. ఆ మాటలు మిత్ర వినేస్తాడు దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.